ఇక్కడి నుండి వచ్చిన ఎందరో దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ లు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, నాయకులు మొదలైన గొప్ప వ్యక్తులను చూసి ఉస్మానియాకు ఎన్నో వందల సంవత్సరాల గతం ఉందేమోనని అనుకున్నాను, అదేంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 100సంవత్సరాలే నిండాయా అనిపిస్తుంది నాకు.. 1600 ఎకరాల క్యాంపస్ లో విద్య మాత్రమే కాదు ఆ విద్యను అందించే పరిసరాలు, Infrastructure, System ఎలా ఉండాలో భారతదేశంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. కందికొండ గారు రాసిన ఈ పాట ద్వారా ఉస్మానియ విశ్వ విద్యాలయ గొప్పతనం మరొక్కసారి గమనించవచ్చు.