Not One, Not Two. This Organisation Built 135 Libraries For Kids To Study For Free

Updated on
Not One, Not Two. This Organisation Built 135 Libraries For Kids To Study For Free

వజ్రం విలువ వజ్రానికే తెలుస్తుంది.. పుస్తకం విలువ ఓ బుక్ లవర్ కే తెలుస్తుంది. హైదరాబాద్ కు చెందిన షెఫాలీ రావుకు పుస్తకాలంటే చాలా ఇష్టం. పుస్తకాలు తన దైనందిన జీవితంలో ఎలా భాగమయ్యాయంటే ఇప్పటికీ మనసు బాగోలేకపోతే నచ్చిన స్నేహితులతో మాట్లాడరు, ఒక మంచి పుస్తకం తెరిచి చదువుకుంటుంది. షెఫాలీ రావు వల్ల వారి పిల్లలు కూడా పుస్తకాలపై ప్రేమ పెరిగిపోయింది. పిల్లలకు పరీక్షలున్నా కాని, ఆటలాడి ఎంత అలసిపోయినా ఎదో ఒక పుస్తకం చదువుతారు. పుస్తకాలు చదవాలని చాలామందికి ఉంటుంది, లైబ్రెరీలు లేక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదవలేకపోతున్నారు. ఇన్ని ఇబ్బందులను చూసే ఈ పుస్తక ప్రేమికురాలు పుస్తకాలు ఇవ్వడం లేదు ఏకంగా లైబ్రెరీలనే నిర్మించి ఇస్తుంది.

మొదటి లైబ్రెరీ: షెఫాలీ రావు తో పాటు పిల్లలు, భర్త ఎక్కడ బుక్ ఫెయిర్ జరిగిన పుస్తకాలు కొంటారు, చదువుతారు, ఆత్మీయులకు బహుమతిగా ఇస్తారు. ఈ అలవాటు వల్ల ఇంట్లో ఒక రూమ్ అంత పుస్తకాల కోసమే కేటాయించారు. పుస్తకాలపై బుక్ లవర్స్ చూపించే గౌరవం అంత ఇంత ఉండదు. వాటిని సెకండ్ హ్యాన్డ్ కు అమ్మలేరు, పోనీ ఎవరికైనా ఇద్దామంటే వారు ఆ బుక్ చదువుతారో లేదంటే పడేస్తారో అనే అనుమానం ఉంటుంది. షెఫాలీ రావు ఇంటికి దగ్గర్లో ఓ స్కూల్ ఉంది. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అందులో లైబ్రెరీ ఏర్పాటుచేసి వారి పుస్తకాలను ఇచ్చేసింది. పిల్లలు ఇష్టంగా చదువుకోవడం, చదివిన తర్వాత వారి మానసిక ఎదుగుదలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుండడంతో మరిన్ని చోట్ల గ్రంథాలయాలను నిర్మించాలని..

ఖర్చంతా వీరే భరిస్తారు: మన ఇంట్లో చదివిన పుస్తకాలు చాలానే ఉంటాయి. వీటిని అమ్మేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. షెఫాలీ రావు ఇంకా తన టీమ్ అపార్ట్మెంట్స్, ఇల్లులు, కార్పొరేట్ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇలా వివిధ చోట్లకు వెళ్లి స్పెషల్ డ్రైవ్ లను ఏర్పాటుచేశారు. సేకరించిన పుస్తకాలను ఒకచోట భద్రపరిచి లైబ్రెరీలను ఏర్పాటుచేసిన తర్వాత వాటిని అక్కడికి తరలిస్తారు. అలా ఇప్పటికీ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో 135 గ్రంథాలయాలను నిర్మించారు 47,000 పుస్తకాలతో..

ప్రత్యేక రీసెర్చ్: ఒక చోటు నుండి అభ్యర్ధన వస్తే గుడ్డిగా అక్కడ ఏర్పాటుచేయకుండా ఆ స్కూల్ కు, లేదంటే ప్రాంతానికి వెళ్లి ఎంతమందికి ఆసక్తి ఉంది, ఎలాంటి పుస్తకాలంటే ఇష్టం మొదలైన విషయాల గురుంచి తెలుసుకుని ఆ తర్వాతనే ఏర్పాటుచేస్తారు. డొనేషన్ ద్వారా పుస్తకాలు వస్తే సరే లేదంటే పబ్లిషర్స్ తో మాట్లాడి కొత్త పుస్తకాలు కొంటారు. కేవలం స్కూల్స్ కోసం అనే కాదు. కమ్యూనిటీ లైబ్రెరీలు, పబ్లిక్ లైబ్రెరీలను కూడా వీరు ఏర్పాటుచేస్తారు.