సమయం రాత్రి 9:గంటలు ఆఫీస్ లో పని అక్కడే వదిలేసి, ఆ పని వల్ల వచ్చిన అలసట తో ఇంటికి వచ్చాను. నా అలసట పోగొట్టేలా తను message చేసింది. తను: hello సూర్య! ఇంటికి వచ్చావా నేను: haa ఇప్పుడే వచ్చాను.. తను: table మీద dinner పెట్టాను తినేసి త్వరగా నిద్రపో.., పొద్దున్న నేను వచ్చేసరికి నిద్రపోతూ ఉండకు.. నేను: సరే సంధ్య madam! ఇంకేటి సంగతులు తను:పేరు కి ఆఫీస్, ఇల్లు హైదరాబాద్ లో నే ఉన్న, అక్కడి నుండి ఇక్కడికి రావడానికి 2 hours పడుతోంది. నేను: hahaha పోనీ weekends ayina కలిసుందాం అంటే, నీకు wednesday week off, naaku sunday week off మధ్యలో పండగ ఏదైనా ఉందా?.. తను: ఏమో చూడాలి.. ఇదేదో ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కథ లా లేదు, నువ్వు రాత్రి ఇంట్లో ఉంటావ్, నేను పొద్దున్న ఇంట్లో ఉంటాను.. నేను:మీ మేనేజర్ ని అడుగు ఎన్నాళ్ళు నేను నా husband ఒకే ఇంట్లో ఉంటూ long distance relationship lovers లా ఉండాలి అని.. తను: haa అడుగుతాలే..సరే మరి office వచ్చింది, good night, sweet dreams!
ఇలా.. కాసేపు తనతో chat చేసుకున్న తరువాత, fresh up అయ్యి, తినేసి నిద్రపోయాను.. ఒక్కసారిగా, నా గతం నా కలలా కనిపించింది..
364 రోజుల క్రితం "అబ్బాయికి, అమ్మాయి.. అమ్మాయికి అబ్బాయి నచ్చారు, జాతకాలు కూడా కలిసాయి, ఇక ముహూర్తం పెట్టెయ్ మంటారా", ఆత్రంగా అడిగారు పంతులు గారు.. "ఈ కాలం లో ముహూర్తం కుదరటం ఎంత ముఖ్యమో, job timings కుదరటం కూడా అంతే ముఖ్యం" అన్న మా మావయ్య వేసిన joke కి అందరు నవ్వుతున్నారు, వాళ్ళ నవ్వు మధ్య ఎదో చెప్పాలని మొహమాట పడుతూ సంధ్య ని మాత్రం నేను గమనించా..
"uncle, నేను సంధ్య తో మాట్లాడచ్చా?" అని పర్మిషన్ అడిగా నా కాబోయే మావయ్య ని.. "తప్పకుండ, సంధ్య, తనకి నీ room చూపించు" అన్నారు తను. ఇద్దరం పైకి వెళ్ళాం నేను: ఇప్పుడు చెప్పండి సంధ్య గారు ఎదో చెప్పాలని మొహమాట పడుతున్నారు.. తను: సూర్య గారు! నేను ఎన్నో కలలు కనీ కష్టపడి సంపాదించుకున్న జాబ్ ఇది. Night shift అనే కానీ, I Love this job ఇంకో సంవత్సరం ఓపిక పడితే day shift లోకి మారచ్చు.. కానీ, ఈ సంబంధం ok అయితే.., మావాళ్ళు నా చేత job మాన్పిస్తారేమో అని భయంగా ఉంది..
నేను: సంధ్య గారు, direct గా point కి వస్తా, నేను మీకు నచ్చానా? దానికి దీనికి సంబంధం ఏంటన్నట్టు ఓక చూపు చూసింది, నేను: చెప్పండి నచ్చనా? లేదా? సిగ్గు పడుతూ అవునని సైగ చేసింది తను.. నేను: నాకు మీరు కూడా చాలా నచ్చారు. మీ independency ఇంకా నచ్చింది. మనవాళ్ళని నేను ఒప్పిస్తా, ఏముందండి, ఒక సంవత్సరమే గా, ఒక long distance lovers లా ప్రేమించుకుందాం, ఎలాగో నాకు love story ledane baadha ఉండదు.. సంవత్సరం తరువాత మనం అస్సలైన couple అవ్వచ్చు.., ఈ పెళ్లి ని ఎందుకులెండి postpone చేయడం, let's get married..
ఈ మాట కి తన చిరునవ్వే సమాధానమయ్యింది, నవ్వుతు, తలా దించుకుని, కళ్ళు మాత్రమే పైకెత్తిన తనని చూసి మొదటి సారి "I love you" చెప్పా.. మా వాళ్ళందరిని పెళ్లి తరువాత తాను జాబ్ చేస్తుందని ఒప్పించా.. పెద్దలందరి దీవెనలతో పెళ్లి అయ్యింది, నా ఆఫీస్ కి తన ఆఫీస్ కి మధ్యలో ఉండే చోట flat దొరికింది.., పొద్దున్న 6 గంటలకి నిద్రలేచి.. కాఫీ పెట్టి, 7 గంటల కి అలసిపోయి వచ్చిన తనని ఆ కాఫితో సేద తీర్చి, ఒక రెండు గంటలు తనతో మాట్లాడి, ఆఫీస్ కి వెళ్ళేవాణ్ణి.. సెలవుల్లో తనతో గడిపే క్షణాలు, చూసే సినిమాలు, అప్పుడప్పుడు మమ్మల్ని ఒకటయ్యేలా చేసేవి.. ఇంత కష్టం దేనికి అంటే.., అనుకున్న కల సాధించుకోవడానికి, తన ఇష్టాన్ని గౌరవించడం భర్త గా నా భాద్యత. నేనిచ్చే కాఫీ తాగుతూ తను చూసే ఆ చూపు చాలు ఆ క్షణం కోసం రోజంతా ఎదురుచూస్తాను. ఇలా 364 రోజులు continue చేసాం, మా పెళ్లి అయ్యి, సంవత్సరం అవ్వడానికి ఇంకొన్ని గంటలే మిగిలాయి., కళ్ళు మూసుకున్న కానీ ఈ ఆలోచనలే.., మొత్తానికి కొంచెం ఆలస్యంగా నిద్ర పట్టింది..
ఆలస్యంగా నిద్రపోయా ఏమో తను వచ్చేసరికి నిద్రపోతూ ఉన్నాను. తన దగ్గర ఉన్న extra key తో లోపలి వచ్చి, నా చెవిలో "happy anniversary శ్రీవారు, one month నుండి మా manager ని అడిగితే, ఈరోజు చెప్పాడు నాకు dayshift approve అయ్యిందని" అని ఒక మంచి మాట తో నన్ను నిద్ర లేపింది..
"Congratulations! madam ji happy anniversary" అని తనని hug చేసుకున్నానో లేదో, మా manager నుండి message "Happy marriage anniversary సూర్య! రేపటి నుండి needi night shift, prepare for that!" అని వచ్చింది.. మా manager కి ఇలా shock ఇచ్చి ,joke అనడం చాలా మామూలు విషయం. ఇది కూడా joke అయితే బాగుణ్ణు..