Contributed by N V Chaitanya Sai
ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు , దాదాపు 20 సంవత్సరాల జీవితాన్ని అనుభవించావు , ఎవరో ఏదో నీకు బాగుంటుందని చెప్తే దాని వెంట పరిగెడుతున్నావు , 20 ఏళ్ళు నీతో నువ్వే కదా ఉన్నావు…నీ గురించి నీకు తెలియదా …!! నీకు ఏది ఇష్టమో లేదో కూడా నువ్వు నిర్ణయించుకోలేవా ?? ఒకవేళ నీ గురించి నీకు తెలిసినా…. ఎవరో ఏదో అంటరాని ఆగిపోతున్నావా ….ఆగిపో అలాగే వెళ్లి మందలో కలిసిపోతావు. ఎప్పుడూ ఎవరో ఒకరు నీ ఇష్టాన్ని ఒప్పుకోవాలని , నీ వెనుక నీకు అండగా నిలబడాలని అనుకోకు , ధైర్యంగా ముందడుగు వెయ్ …. అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు …నిన్న చూసి నవ్వుతారు అయినా ఆగకు … నీకు నీ మీద ఉన్న నమ్మకానికి , నీ ధైర్యానికి తరువాత వల్లే నిన్ను మెచ్చుకుంటారు . ఇప్పుడే నిర్ణయించుకో … నీ దారి నువ్వే ఏర్పరుచుకుంటావో , లేదా ఎవడో వేసిన దారి బాగుందని అందులో వెళ్ళిపోతావో !! నువ్వే ఏర్పరుచుకుంటే …ఓడిపోయినా కనీసం నీకు నచ్చిన దారిలో వచ్చాను అనే తృప్తి, సంతోషం ఉంటాయి. ఎవరో చెప్పింది చేసి ఓడిపోతే , ఆ చెప్పిన వాళ్ళు కూడా అప్పుడు నీ కోసం రారు . ఒకవేళ గెలిచినా … ఎవరో నీ పైన వేసిన ముద్రే నువ్వు అని మాత్రం మరచిపోకు . చాలా మంది చెప్తారు , కుక్క చావు కంటే దారుణమైన చావు లేదని , కానీ నువ్వు నీకు నచ్చింది చెయ్యలేక , నీ లాగా బ్రతకలేక , ఎవరో చెప్పింది విని , అది మనస్పూర్తిగా చెయ్యలేక , చివరి రోజులలో నీ చావు కోసం బాధతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు చూడు ….అది దారుణమైన చావు అంటే …!! నీ జీవితాన్ని పరిపూర్నంగా అనుభవించాక , నీకు నాచ్చింది చేసాక అప్పుడు నువ్వు నీ చావుని కూడా జీవితం లో ఒక బాగంలా చూస్తావు, దాని కోసం ఆనందంగా ఎదురు చూస్తావు…!! అలా చూసినప్పుడే నీ జీవితానికి ఓక అర్ధం ఉన్నట్టు .