మరి కవిత్వాలు చదవడం ప్రారంభించాక పేరు మార్చుకున్నారో, లేదంటే తానే ఒక కవితగా మారినప్పుడు పేరు మార్చుకున్నారో నాకు స్పష్టంగా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను "కవితా ప్రసాద్" గారి కవిత్వం వాస్తవం. ప్రసాద్ గారి కవిత్వం ఒక మనసున్న ప్రాణం వంటిది, ఏదో పై పైన కాకుండా కాసేపాగి లోతుగా పరిశీలిస్తేనే స్పష్టత కనిపిస్తుంది.