మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్న ఈ దేవాలయ చరిత్ర ఎంతో ఘనమైనది.. ఎన్నో సంవత్సరాల జీవితం కలిగి ఉండి నాటి సంస్కృతికి ప్రస్తుతానికి వారధిగా నిలుస్తుంది. సాక్షాత్తు అగస్త్య మహాముని చేతుల మీదుగా నిర్మింపబడిన ఆలయమని ఈ దేవాలయాన్ని అగస్తేశ్వరాలయం అని పిలుస్తారు. అగస్త్యుడి వల్ల మాత్రమే కాదు 400 సంవత్సరాల తరబడి ఇక్కడి జ్యోతి నిరంతరం వెలుగుతుండడం వల్ల కూడా ఈ దేవాలయానికి ఎంతో ఖ్యాతి లభించింది.
400 సంవత్సరాల అఖండ జ్యోతి:
1795 సంవత్సర కాలంలో ఈ ఆలయ పూజారైన జకెపల్లి సదాశివయ్య గారు ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించడం ప్రారంభించారు. ఏ శుభ ముహూర్తాన ఈ జ్యోతిని వెలిగించారో కాని అప్పటి నుండి ఈనాటి వరకు ఈ ఆలయ పూజారి వంశస్థులు జ్యోతి ఆరిపోకుండా నువ్వుల నూనె ద్వారా వెలిగిస్తున్నారు. ఈ జ్యోతి కోసం ప్రతిరోజు 1100 గ్రాముల నువ్వుల నూనె అఖండ జ్యోతి కోసం వినియోగిస్తారు.
తిమ్మరసు, అగస్త్య మహాముని:
మునులలో అత్యంత శక్తివంతమైన వారు అగస్త్య మహాముని. ఓసారి బాసర జ్ఞాన సరస్వతిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి గోదావరి తీరానికి చేరుకుని ఘోర తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించారట. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, గొప్పతనం, శాసనాలు తిమ్మరుసు చెక్కి తన సంతకం కూడా ఉంటుంది.
ఆలయం ధ్వంసం:
ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం చాలా వరకు ధ్వంసమైన ఆలయంగా చెబుతుంటారు. అల్లాఉద్ధీన్ ఖిల్జి కాలంలో సేనానిమాలిక్ ఈ దేవాలయాన్ని కూల్చారని ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల వారు హిందు దేవాలయాల పరిరక్షణలో భాగంగా మళ్ళి నిర్మించారు.