57 ఏళ్ళ శారద గారి జీవితం పక్షి జీవితాన్ని పోలి ఉంటుంది. ఒకే పని చేస్తూ ఒకే చోట ఉండకుండా, అక్కడి వాతావరణానికి పరవశించి మరొక చోటుకి ప్రయాణిస్తారు. 57 సంవత్సరాలలో విద్యార్థిగా, బ్యాంక్ ఉద్యోగినిగా, రచయిత్రిగా, voracious reader గా, ఆర్టిస్ట్ గా, పెబుల్ ఆర్టిస్ట్ గా ఇలా ఒకే జన్మలో రకరకాల జీవితాలను గడిపారు. చిన్నతనంలో Limca book of records drawings చూసి వాటి మీద ఇష్టం పెంచుకున్నారు. వాటిని తన చేతుల ద్వారా పలుకరించాలని సృష్టించారు. కొన్ని డ్రాయింగ్స్ వేశారు పర్వాలేదు బాగానే వచ్చాయి అని నమ్మకం కలిగినా కొనసాగించడానికి అమ్మ నాన్నలను పెయింటింగ్స్ ఖర్చులను మాత్రం అడగలేదు. ఆ తరువాత చదువులు, బ్యాంక్ లో ఉద్యోగంలో చేరాక "తనలోని ఆర్టిస్ట్ ను చిన్ననాటి మిత్రురాలిగానే చూసేవారు".
అది హాబినా, లక్షణమా అని పక్కగా చెప్పలేము కాని శారద గారికి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థను అర్ధం చేసుకుని నేర్చుకుని ఆచరించిన తర్వాత తనకు బ్యాంకింగ్ రంగం అంటే ఇష్టం పోయింది. తోటి ఉద్యోగస్థులు ప్రేమగా "వద్దు శారద.." అని వారించినా సున్నితంగా VRC తీసుకుని బయటకు వచ్చేశారు. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే ఒక బ్యాంకర్ గానే ఒక పరిధి వరకే గుర్తింపు ఉంటుంది. "ఇప్పుడు ఎలాగూ బయటకు వచ్చేశాము, Unique Identity Creative పనులలో ఉంటుంది అని తనకు తెలుసు. ఈ ప్రయాణంలోనే తన చిన్ననాటి "ఆర్టిస్ట్ స్నేహితురాలిని మరల కలిశారు". ఒకరోజు డైరీ రాసుకుంటూ ఉండగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి ఫోటో చూశారు. సరదాగా బాల్ పాయింట్ పెన్ తో బొమ్మ వేసి వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఐనా పెన్సిల్ తో వేస్తారు ఇలా పెన్ తో వెయ్యరు అని సజెషన్ వచ్చింది.
పెన్సిల్ ఐతే ఒక చోట పొరబాటు జరిగిన సరిదిద్దు కోవచ్చు అని తెలుసుకుని ప్రాక్టీస్ చెయ్యడం మొదలుపెట్టారు. ఏ టీచర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ Instituteకు వెళ్ళలేదు.. మనిషి తడబడుతూ నడవడం నేర్చుకున్నట్టుగా, తప్పులు మాట్లాడుతూ మాట్లాడడం నేర్చుకున్నట్టుగా శారద గారు తన 50లో పెయింటింగ్ నేర్చుకున్నారు. మన సంస్కృతిలో కళ ఒక భాగం భారతీయ మహిళలు గొప్ప ఆర్టిస్టులు.. వారు నేల మీద మునివేళ్లతో ముగ్గు వెయ్యగలరు, ఆకులను నూరి అరచేతి మీద అందంగా గోరింటాకు పెట్టగలరు, చెక్కలకు పసుపు కుంకుమ అద్ది కడప గా తీర్చిదిద్దగలరు. అలా శారద గారు తనదైన శైలిలో బొమ్మలు వేశారు. రాగి ఆకులు, పాత బాటిల్స్, నల్లరాళ్ళు, గాజు గ్లాసులు ఇలా నచ్చిన ప్రతి వస్తువు మీద వేస్తూ తాను గుర్తింపు తెచ్చుకుని ఆ వస్తువులకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు. శారద గారు వేసిన కొన్ని అపురూపాలు.. శారద గారిని ఇక్కడ కలుసుకోవచ్చు: Mail ID: sharadasivapurapu@gmail.com
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
a 21.
22.