19 Countries In 2 Months. This 60-Year-Old Couple's Road Trip Is Travel Goals

Updated on
19 Countries In 2 Months. This 60-Year-Old Couple's Road Trip Is Travel Goals

కార్లో ఐతే మేలుకువతోనే ఉండాలి.. ప్రతి ఒక్క చెట్టును చూడవచ్చు.. వివిధ దేశాలలోని సాటి మనుషులను చూడవచ్చు. అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను, ఆహారపు అలవాట్లను ఇవన్నీ తెలుసుకోవచ్చు.. అందుకే డాక్టర్ రాజేష్ కాపాడియా గారికి ఈ ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. జీవిన సహచరికి తన ఆకాంక్షను చెప్పగానే "మీ జీవితంలో నేనూ భాగం ఇప్పుడు మీ ప్రయాణంలోను భాగం పంచుకుంటానని డా. దర్శన గారు కూడా చెప్పేశారు".. ఇంకేముంది మార్చి 28న ప్రయాణం మొదలుపెట్టారు..

రాజేష్ గారు మన హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.బి.బి.ఎస్ పూర్తిచేశారు. దర్శన గారు యూనివర్సిటీ ఆఫ్ ముంబయ్ లో మెడిసిన్ చేశారు. ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడి 37 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా మన హైదరాబాద్ కు వస్తుంటారు తప్ప ఇలాంటి సాహస యాత్ర మాత్రం ఇదే మొదటిసారి. జర్నీ ప్రారంభానికి ముందే ప్లానింగ్ అంతా సిద్ధం చేసుకున్నారు. 37,000 కిలో మీటర్ల ప్రయాణం విజయవంతం కావాలంటే అందుకు ముందు కావాల్సినది వెహికిల్. రాజేష్ గారు చిన్నతనం నుండి కార్లంటే విపరీతమైన ఇష్టం. 1981 నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో "నేషనల్ రోడ్ చాంపియన్" టైటిల్ ను కూడా అందుకున్నారు. అలాంట చాంపియన్ ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణానికి వెహికిల్ ఎలా తయారుచేసి ఉంటారో ఊహించుకోవచ్చు.

"టాయోట ల్యాన్డ్ క్రూజర్ రైట్ హ్యాన్డ్ డ్రైవ్" డీజిల్ కారును అవసరాలకు తగ్గట్టుగా మార్చారు. ఈ కార్ లోనే ఫ్రిడ్జ్, రెస్ట్ కోసం బెడ్స్, వంటచేసుకోవడం కోసం స్టౌ, ఇలా మూడు నెలల పాటు సాగే ప్రయాణానికి అన్ని అవసరాల కోసం కారుకు మార్పులు చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 19 దేశాల మీదుగా సాగిన ప్రయాణం గురుంచి..

19 దేశాల మీదుగా సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో సమస్యలు, ఆనందాలు.. ప్రతీ దేశపు సరిహద్దు లో ఆర్మీ సిబ్బందినుండి అధికారుల వరకు లక్ష ప్రశ్నలు, అనుమతుల కోసం తిప్పలు, సరైన మార్గం తెలియక ఇబ్బందులు, సిరియాలో, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నాయి ఇలాంటి అత్యంత సున్నితమైన ప్రదేశాలలో ప్రయాణం సాగింది. ఒక్కోసారి ఒక సరిహద్దు నుండి అనుమతి లభించకపోతే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు.

రాజేష్, దర్శన ఇద్దరు 60 సంవత్సరాలు పైబడిన వారు. ఈ వయసులో ఇన్ని వేల కిలోమీటర్ల జర్నీ అది కూడా 30 రోజులు అనుకున్న ప్రయాణం కాస్త 60 రోజులు దాటిపోయింది. ఒక రోజు గడవాలంటే చీకటి వెలుతురును చూడాల్సి ఉంటుంది అదే ఒక జీవితం పూర్తవ్వాలంటే ఎన్ని చీకట్లను ఎన్ని వెళుతుళ్లను చూడాల్సిఉంటుంది.? ఈ 60రోజుల ప్రయాణంలో వారు ఓ కొత్త జీవితంలో బ్రతికారు. 60డిగ్రీల ఉష్ణోగ్రత నుండి -14డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా వీరు ఈ ప్రయాణంలో అనుభవించారు.

సికింద్రాబాద్ లో అమ్మ కోకిలబెన్(85) పాదాలకు నమస్కరించాక వారి గమ్యం, విజయం పూర్తయ్యింది అన్నమాటే కాని 19 దేశాల మీదుగా సాగిన ప్రయాణాన్ని, ఆ పోరాటాన్ని మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేశారు.. అంతే కదా సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడూ ఎన్నడూ విడిపోని శరీర అవయవంలా మనతోనే ఉంటుంది.