90's Kid : హాయ్ రా ! నేను 90's వాడిని !
Present Kid : Hello Bro! I'm Present Day's kid.
90's Kid : నిన్ను చూద్దాం అని Time Machine ఎక్కేసి నీ కాలం లోకి వచ్చేసా !
Present Kid : Nenu kuda ninnu chudham ani adhee Time machine ekkesi vachesa.
90's Kid : సరేలే చదివేవాళ్ళని confuse చెయ్యకుండా పాయింట్ కి వచేద్దామ్.
Present Kid : Haa adhi.... Iddariki same age annamata ippudu...iddaram oka Weekend kalusukunnam, aaah Saturday jarigina conversation ippdu chudham. Again...Nice to meet you raa...!!!
90's Kid : మాకు మాత్రం ఇంగ్లీష్ రాదనుకున్నావా ఏంటీ ?? Nice to meet you too! హా అర్థమయ్యిందా ?
Present Kid : Haa ayyindhi ayyindhi. Em ilaa kalisav nannu? Emaina cheppala? cheppalante fast ga cheppey..... facebook create cheskovali nenu eroju.
90's Kid : ఎందుకు రా బాబు మనకి ఆ Facebook లు . చందమామ కథలు చదువుకుందామా ? సాయంత్రం మా ఇంటికి వచ్చేయ్ !
Present Kid : Avem kathalu raa? Nuvvu raasava enti kompadeesi? Sarle repu Sunday kadha ., nee plans enti?
90's Kid : ఏముంటాయి రా ....పొద్దున్నే 6 కి మా అమ్మ లేపేస్తది నన్ను . తర్వాత డాడీ తో మార్కెట్ కి వెళ్లి వచ్చాకా , ETv లో పంచతంత్రం miss అవ్వకుండా చూడాలి.
Present Kid : Inaa sunday kuda 6 ki lechipothava....? Inaa adem chustav ra babu. Naakaithe assalu nachadhu. Paigaa market ki velthavaa?
90's Kid : ఎందులో ఐనా దూకి సచ్చిపో రా .... పంచతంత్రం నచ్చదు అన్నవాడిని నిన్నొక్కడినే చూస్తున్నా . ఐనా Sunday అంటే ఈటీవీ లో పంచతంత్రం, ఇంట్లో చికెన్ common ఏ రా మాకు . సరేలే నువ్వేం చేస్తావ్ మరి ?
Present Kid : Nenu lechedhe 10 ki. Lechaka Tv lo cinemalu vesthadu gaa. Inka ave time pass naku.
90's Kid : అవునూ సినిమాలు అంటే గుర్తొచ్చాయి ... నా దగ్గర చాలా collection ఉన్నాయ్ తెల్సా సినిమా పాటల పుస్తకాలు . మేము క్లాస్ లో break ఇచ్చినప్పుడు పాడుకుంటాం .
Present Kid : Avna..... inaa annii youtube lo videos vachesayi gaa. Sarele...tarwatha em chesthav?
90's Kid : తర్వాత కుదిరితే నేనూ , మా పక్కింటి ఫ్రెండ్స్ కలిసి అష్ఠాచెమ్మా లేదా రాముడు సీత ఆడతాం . తర్వాత అమ్మ భోజనానికి పిలుస్తాది .
Present Kid : Adem game raa? Ramudu Seetha vinna kani aadatam radhu naku. Repu nenuu meetho adataniki vastha. Naku kuda nerpinchu.
90's Kid : సరే రా పొద్దున్నే పదిన్నర కి మా ఇంటికి వచ్చేయ్ .........
Present Kid : Tarwatha thinnaaka em chesthav? Padukuntaavemo kadha...
90's Kid : అస్సలు పడుకోను . పడుకుంటే sunday waste అయిపోతుంది కదా . కుదిరితే ఇల్లు సర్దుతా లేదా , Telephone బుక్ చిన్నది తయారుచేస్కుంటా !
Present Kid : Illu mee amma sardhadhaa? Nuvvenduku sardhadam? Telephone book cheskovadam enti ardamkaledhu.
90's Kid : నాకు ఇల్లు సర్దడం అనేది ఒక సరదా .చాలా బాగుంటది తెల్సా ! Telephone book చిన్నది నా దగ్గరున్న waste papers అన్నీ కలిపి gum తో లేదా అన్నం మెతుకులతో అతికించి తయారుచేస్తా . ఇప్పటికీ నేను చేసిన రెండు books ఉన్నాయ్ తెలుసా మా ఇంట్లో ...... ..మా డాడీ ఆ బుక్స్ ఏ వాడతారు ఇప్పటికీ ఎవరికైనా phone చెయ్యాలంటే !
Present Kid : Arey nakuu nerpisthava? Nenuu nerchukunta. Avnuu chethilo enti idhi? Eee tape ni ekkadoo chusa kani gurthuravatledu.
90's Kid : అరేయ్ ఇవి తెలీవా నీకు ? Pistol tapes రా . నా దగ్గర gun కూడా ఉంది తెలుసా ...Gun తోనే కాదు ..... గోడకి గీసినా ఇవి సౌండ్ వస్తాయ్ !
Present Kid : Arey bhale undi raa, nakuu kavali ekkada ammautharo cheppu tarwatha konukkunta.
90's Kid : మరి మధ్యాహ్నం అంతా ఏం చేస్తావ్ రా ?
Present Kid : Emundhi... nenuu appudappudu padukonu. Pogo lo Chota Bheem leda Youtube lo cinemalu chustha. elaago intloo wifi untadi ga maku.
90's Kid : నేను , మా పక్కింట్లో పిల్లలు కలిసి బొంగరం ఆట , చింత పిక్కల ఆట ఆడుకుంటాం తెలుసా రేపు !!!
Present Kid : Avna.... ayya baboiii nuvvu matladedhi naku edhii sarigga ardamkavatledhu raa. Avanni nuvvu naku nerpinchali repu. Anni 1st time vintunna nenu.
90's Kid : సరే రా .... రేపు మా పదిమంది గ్యాంగ్ లో నువ్వూ కలిసిపోతావ్ అన్నమాట .
Present Kid : Enti padhi mandhi untara neku aadukovadaniki? Maa apartment lo nenu okkadine aadukovali edaina...adi kuda phone lone chaalavaraku...........
90's Kid : హా అలా సాయంత్రం 4 అవ్వగానే అందరం పోగుఅవుతం . ముంజులు తిన్నా తర్వాత వాటితో బండి చేసుకొని Cricket ఆడతాం .
Present Kid : Avnaa ithe adhi kuda nerpinchu ela cheyyaalo ...inkem chestharu?
90's Kid : అలా సాయంత్రం అయ్యేసరికి అందరం ఇంట్లో మిగిలిన దీపావళి సామాను లో పాము బిళ్ళలు , వెన్నముద్దలు పోగేసుకుని కాల్చుకుంటాం .
Present Kid : Ithe nenuu vastha raa, naa daggara kuda chala unnay. Deepavali ki nenu okkadine kalchukunna. Meru rojuuu padhi mandhi kalisi kalustharu. Chalaa miss ayyaanu ra nenu!
90's Kid : రేయ్ వర్షం పడేలా ఉంది ఇప్పుడు .ఆకాశం లో మబ్బు చూడు ఎంత ఉందో .....పేపర్ బోట్స్ చేసుకుందామా ?
Present Kid : Naaku cheyyadam radhu raa....nadhi kuda nuvve chesi ivvu.
90's Kid : నీకు రాదా ?చాలా easy రా బాబు . నేను ఇదే కాదు గాలిపటాలు , Paper rocket, gun, ఇంకా చాలా చేస్తా తెలుసా ...
Present Kid : avanni naku kuda nerpinchu. Hey naku galipatam ela cheyyalo cheppava please please .....
90's Kid : అంటే నీకు ఇప్పటిదాకా గాలిపటం చెయ్యడమే రాదా ? అంటే ఇంకెప్పుడు ఎగరెయ్యడం నేర్చుకుంటావ్ రా ?ఐనా నీ దగ్గర యూట్యూబ్ ఉంది గా ........ అందులో చూసి నేర్చుకో రా .........
Present Kid : Nuvvu youtube lo chudakundane nerchukunnav ga. Naakuu alaage nerpinchu. Areyi athanu evaru raa? Enti adhi?
90's Kid : అరేయ్ ఇంత లేట్ గా చెప్పావేంటి రా బాబు . జరుగు జరుగు ...... పుల్లైస్ రా అది . నాకు రెండు కావాలి . నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వూ కొనుక్కుందువు రా ...
Present Kid : Chala bagundhi raa... neneppuduu thinnaa, bayata Scoops ae thinta. Idhi inka bagundhi.
90's Kid : అవును మరి నువ్వేం చేస్తావ్ సాయంత్రం తర్వాత ? తినేసి పడుకోవడం ఏనా ?
Present Kid : Home Works unte cheskoni, tinesi padukunta raa....anthe. Mari nuvvem chesthav?
90's Kid : ఓరి నీ ..., మీ తాతయ్య నీకు విక్రమాదిత్యుడు బేతాళుడు కథలు , రామాయణం లో బాలకాండ కథలూ చెప్పరా ?
Present Kid : Ledhu raa... vallu eppudo kani maa intiki raaru . Vachinappudu Serials chustharu. Inka naakem cheptaru?
90's Kid : అవును నాకో doubt రా ...నేను ఇందాకడినుంచి అచ్చ తెలుగు లో మాట్లాడుతుంటే ...నువ్వు Tenglish లో మాట్లాడతావేంటి ?
Present Kid : Inka Ardamkaalendhenti? Chadive vallaki teliyali kada nuvvu 90's vi, nenu Present kid ni ani.
90's Kid : సరేలే ఇది మాత్రం correct గా చెప్పావ్ . ముందు ఐస్ తిను ...... కారిపోతుంది ............