Contributed By Krishna Prasad
"బాల్యం ఓ మధుర జ్ఞాపకం". ఏమి తెలియని వయసు, స్వార్థం లేని జీవనం, ఆరోగ్యకరమైన పోటీ, పొద్దుపోయే దాకా ఆటలు, అమ్మ వచ్చి రెండు తగిలిచ్చేవరకు ఇంటి మొహం చూడని వైనం, బట్టలంత మురికి అయితే, అమ్మ ఎక్కడ తిడు తుందో అన్న భయం తో రోడ్డు పక్కన కుళాయి దగ్గర ఆ మరకలు కడుక్కోవడం, అన్న మీద అక్క మీద చాడిలు చెప్పటం, ఉదయం స్కూల్ కి వెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చే రూపాయిని జాగర్తగా డిబ్బిలో దాచుకోవడం, స్కూల్ లో ఇచ్చిన కొత్త పుస్తకాల వాసన చూసి, వాటికి న్యూస్ పేపర్ అట్ట వెయ్యటం, స్కూల్ ఎప్పుడు అవుతుందా... అని ఎదురు చూస్తూ, స్కూల్ గంట కొట్టిన వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లటం. ఇలా మన బాల్యం గురించి ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే... దేవుడు వచ్చి నీకేం వరం కావాలో కోరుకో! అని అంటే వెంటనే నాకు మళ్లీ నా బాల్యం కావాలి అని అడిగేస్తాం. అంత చక్కనైనది, మర్చిపోలేనిది బాల్యం. మన చిన్నప్పుడు మనం చేసిన, మనం చూసిన, మనం ఆడుకున్న ఆ జ్ఞాపకాలని ఒకసారి గుర్తు చేసుకుందాం....
1. గోలీలటా : మళ్లీ వీటిలో చిన్న గోళీలు, పెద్ద గోళీలు రెండు ఉండేవి.

2. టైరాట : ఇప్పుడు మన టైర్లలో గాలి ఉండాలి, మరి అప్పుడు టైర్ వుంటే చాలు గాలి, చుబ్ అక్కర్లా... ఒకటే వేగం.

3. ఏడు పెంకులాట : అప్పట్లో మోస్ట్ అడ్వెంచర్ గేమ్. అవతలి టీమ్ నీ ఏమార్చి, వాళ్ళకి దొరకకుండా మనం పడగొట్టిన పెంకులని మళ్లీ పెర్చటం మంచి థ్రిల్ నీ ఇచ్చేది.

4. తాడు - బొంగరం : ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...

5. బంక మట్టి తో బొమ్మలు : మనలోని క్రియేటివిటీ పెంచిన ఆట...

6. గూటి బిళ్ళ : మోస్ట్ డేంజరస్ గేమ్ మనకి. ఎవరో ఒకరి నెత్తికి కన్నం పడందే ఆట అయ్యేది కాదు.

7. చీమ చింతకాయలు : బహుశా ఇప్పటి పిల్లలు ఇవి చూసి ఉండకపోవచ్చు... మనకి మాత్రం ఇవి కోసుకుని తినటం మహా సరదా...

8. WWE and Cricket కార్డ్స్ : రాంక్ 3..., రాంక్ 1 క్లాష్....

9. మనం ఇచ్చే రెండు రూపయలకే వాచ్ వచ్చేది.

10. ఎంటేన కదిలిందా.... బొమ్మ గోవిందా....

11. దీనిని ఎలా మర్చిపోగలం....

12. నోరూరుతుంది కదూ....

13. అప్పట్లో మనం చేసిన ప్రయోగం.

14. బీరువా అయినా తలుపు అయినా స్టికర్ పడాల్సిందే...

15. చల్లని నిమ్మ సోడా...

16. బోట్ షికారు...

17. రాముడు - సీతా : రాముడు 1000, సీత 0

18. రాజ దర్పం : ఫంక్షన్ అంత అయిపోయాక కుర్చిలన్ని ఒక దానిపై ఒకటి పెట్టి వాటి పైన కూర్చోవటం, సీఎం కుర్చీలో కూర్చున్న రాదు ఆ ఆనందం.

19. గురుగులాట : అన్నం, కురా రెడీ...

20. దాగుడు మూతలు : ఇంకా దీని గురించి, దీనిలో మీకున్న అనుభూతుల గురించి మాకు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.
