Contributed By Anusha chalumuri
అనగనగా ఒక పండుగ మూడు రోజులు 2 ఊళ్ళు. ఒక ఊరేమో అమ్మమ్మ ది ఇంకొకటి నానమ్మ వాళ్ళ ఊరు. అప్పట్లో half yearly exams అయిపోగానే pongal holidays . షాపింగ్ మాత్రం ముందుగానే అయిపోయేది, ఎప్పటిలానే కొత్త బట్టల్ని బయటికి తీసి ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలని అమ్మ తో వాదించి మరీ pack చేయించుకునేవాళ్ళం నేను చెల్లి. ఇక రానే వచ్చింది journey time . భోగి కి ఒక రోజు ముందే వెళ్లిపోయేవాళ్ళం అమ్మమ్మ ఇంటికి .
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు అమ్మమ్మలు అంటే మరి నలుగురు తాతయ్యలు brothers ఒకే దగ్గర ఉండేవారు. అందరిలో మా అమ్మమ్మ అదే మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమ. . ఇక ఇంటి విషయానికొస్తే 4 ద్వారాలు ఉన్నా ఒకే ముంగిలి. అమ్మమ్మ తాతయ్యలు సంవత్సరం అంతా ఒకరితో ఒకరు మాత్రమే గడిపినా సంక్రాతి అంటే అందరి ఇళ్ళు నిండిపోతాయి. పెద్దమ్మ పిన్ని మావయ్యలు అంతా అమ్మ cousins వాళ్లే 9 మంది ఇంక నా cousins ఒక 15 మంది వరకు. అందరం భోగి ముందు రోజే చేరుకునే వాళ్ళం, వెళ్ళగానే lunch చేసి కాసేపు nap వేసి ఇంక సాయంత్రం ఐతే ఒక్కో అమ్మమ్మ ఇంట్లో ఒక్కో రకం స్నాక్స్. తింటుండగానే మొదలుపెట్టారు అమ్మ వాళ్ళు అందరూ కలిసి కొత్త బట్టలు display . అన్నిట్లో నా బట్టలు బాగున్నాయని అందరూ పొగిడినపుడు ఏదో చిన్నపాటి గర్వం. ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 7 గంటలకే dinner అయిపోయేది. తర్వాత కాసేపు బాతాఖానీ , తొమ్మిది గంటలు అవకుండానే నిద్రపోయాం మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా భోగి మంటలు దగ్గరికి వెళ్ళడానికి.
Day 1: భోగి ఈ రోజు మాత్రం త్వరగానే start అయిపోతుంది, అంటే పొద్దున్నే నాలుగింటికే నిద్ర లేపేస్తారు భోగి స్నానం చేయడానికి. అందరి పిల్లలలోకి పెద్ద వాళ్ళు ముందు భోగి స్నానం చేయాలి అంటే ఇంకాస్త త్వరగా లేవక తప్పలేదు నాకు. మాంచి చలికాలం కదా వేడి నీళ్లు మరిగే వరకు wait చేయాలి, స్నానం చేయాలి. ప్రతి అమ్మమ్మ ఇంట్లో పెద్ద పిల్లలకి అదో bumper ఆఫర్. ఇంక నా లాగానే మిగతా 3 ఇళ్లల్లో ఇంకో 3 lucky elders. మొత్తానికి మనం ముందే లేచినా మిగతా వాళ్లంతా రెడీ ఐయ్యేంత వరకు వెయిట్ చేయాలి తప్పదు. అందరూ ready అయిన తర్వాత ఒక చిన్న fashion షో అదే అందరి కొత్త బట్టల తో అమ్మమ్మల్ని entertain చేస్తాం . ఇంక టైం అయిపోతుంది భోగి మంట దగ్గరికి వెళ్ళాలి. వీధి చివర లో ఒక పెద్ద భోగి మంట అక్కడ వీధి లో ఉన్న పిల్లలు అందరు వస్తారు మేము కూడా మా మావయ్యలని నిద్రలేపి మాకు తోడుగా తీసుకెళ్ళేవాళ్ళం . ఖాళీ చేతులతో ఐతే కాదు పిడకల దండలు తీసుకెళ్లే వాళ్ళం భోగి మంటల్లో వేయడానికి. అక్కడ కూడా మళ్ళీ పోటీ, ఎవరి దండ పెద్దది అని మొత్తానికి వాటిని తీస్కుని భోగి మంటల దగరికి వెళ్లి అందులో వేసేయడమే. ఇంక ఒక గంట సేపు అలా ఆ భోగి మంట ఎంత ఎత్తుకు వెళ్తుందో చూస్తూ ఆ మంట దగ్గరే చలి కాచుకుంటూ సూర్యుడు కి హాయ్ చెప్పేసి ఆ భోగి మంటల్లో నుండి ఒక కాలిన పిడక ని తీస్కుని దాన్ని బొట్టు లా పెట్టుకుని అక్కడ పంచిన biscuites , chocolates తీస్కుని ఇంటికి వచ్చేసేవాళ్ళం . అంతే ఇంక అమ్మ మొదలు పెట్టేది కొత్త బట్టలు పాడైపోతాయి వెళ్లి మార్చుకుని వస్తే tiffin పెడతా అనేది . మనకేమో అవి మార్చుకోడం నచ్చదు కానీ ఏం చేస్తాం పండగ లో అదీ ఊరిలో అంటే కుదురుగా ఉండం కదా. పాడైపోతాయి కొత్తవి కాస్తా మధ్యాహ్నంకీ పాతవి అయిపోతాయి . ఇంక అంతా అయిపోయింది, త్వరగా లేచాం కాబట్టి కాసేపు నిద్రపోదాం అనుకునేసరికి ముందు రోజు మిస్సయి కొంచెం లేట్ ఐన మిగతా cousins వచ్చేస్తారు. అంటే వాళ్ళు మన కన్నా కొంచెం పెద్దవాళ్ళు ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అని ఉంటాయి గా పాపం. ఇంక వాళ్ళు వచ్చాక నిద్ర ఏముంది ఎలా ఉన్నారు అని అనుకునే లోగానే ఒక cousin అంటుంది బోర్ కొడుతోంది ఎమన్నా ఆడుకుందాం అని. అప్పట్లో మరి ఊరిలో ఎక్కువగా ఆడుకునే ఆట హౌసీ. అదే హౌసీ టికెట్స్ ఉంటాయి అందులో నంబర్స్ ఉంటాయి లైన్స్ , జల్దీ, హౌసీ అని ఉంటాయి కదా అదే . అప్పట్లో ఒక్కో టికెట్ 50 పైసలు నుండి ఒక రూపాయి. అప్పట్లో అదే ఎక్కువ అందులోను 2 టికెట్స్ తీస్కుని ఆడితే అదో కిక్ . ఇలా పిల్లలం అంతా గేమ్ లో ముంగిపోతుంటే ఈ లోపల అమ్మ వాళ్ళు వచ్చి చాలు చాలు టైం అయింది భోజనం చేయండి అని గుర్తు చేసేదాకా ఆకలి తెలీదు . ఇంక అక్కడితో ఆట కి బ్రేక్ ఇచ్చి త్వరగా అందరం ముంగిట్లో కూర్చుని తినేసి మళ్ళీ గేమ్ షురూ . ఈ లోగా అమ్మ పిన్ని అత్తయ్య పెద్దమ్మ వాళ్లంతా స్వీట్స్ అదే ఇంటికి వెళ్ళాక చుట్టుపక్కల పంచుకోడానికి ఇంక మా పిల్లలం రోజు తినడానికి preparations చేస్తారు. వాళ్లేమో అందులో బిజీ మేము గేమ్ లో బిజీ. ఏ మాటకి ఆ మాటే మా 4 ఇళ్లల్లో సున్నుండలు popular. అవి కాకుండా ఒకొక్కరికి నచ్చింది ఒకోకరు చేస్తారు అరిసెలు , జంతికలు, గులాబీ పువ్వులు , మురిపీలు, ఇలా ఎన్నో . .
ఇక మాకు game బోర్ కొట్టి మేము ఆపేద్దాం అనుకునే లోగా అమ్మ వాళ్ళు join అవుతారు. మేము కూడా ఆడతాం అని కాసేపు వాళ్ళతో ఆడేశాక వాళ్ళకి బోర్ కొట్టి ఆపెద్దాం అనుకున్నపుడు మా అన్నయ్య ఒక గేమ్ అంటాడు jackpot అని అందర్నీ వన్ రూపీ పెట్టమని ఒక్కో నెంబర్ ఇస్తాడు కళ్ళుమూసుకుని, ఎవరి నెంబర్ ఎక్కువయితే వాళ్ళకే డబ్బులు అన్నీ. హౌసీ ఆడితే ఇదొక లైన్ ఐన గెలిచేవాళ్ళం, ఇక్కడ ఆ ఛాన్స్ లేదు ఒకే సరి రూపాయి పోతుంది . సర్లే పోతే పోయింది లే ఇంక చాలు లే అని ఆపేసి ఎవరికీ వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకుంటాం. అన్నయ్యలు ఏమో వాళ్ళ స్టడీస్ క్రికెట్ గురించి డిస్కషన్ మావయ్యల తో కలిసి, మేమేమో కాసేపు బాతాఖానీ ఇంకాసేపు అంత్యాక్షరి ఆడుతూ ఇలా సరదాగా గడుపుతుంటే, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడేం చేస్తాడు అంటే ఖాళీ గా ఉండకుండా ఎదో ఒకటి నోట్లో వేస్కుని మింగేస్తాడు . కాకపోతే అవి food items కాదు నట్లు బోల్ట్లు లేదా ఎదో ఒక బిందె లో తల దూర్చేసి కాసేపు అందర్నీ కంగారు పెట్టి ఆ తర్వాత శాంతిస్తాడు . ఇలా సాయంత్రం అంతా అంత్యాక్షరి ఆడుతూ పాటల్ని పడుతూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ గడిపేస్తూ తెలీకుండానే డిన్నర్ టైం ఐపోతుంటే త్వరగానే తినేసి నిద్రపోతాం .........
Day 2: సంక్రాతి ఈ రోజు మనం త్వరగా లేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మ వాళ్ళు పూర్వీకుల్ని పూజించడానికి పిండి వంటలు ఫలహారాలు చేయడం లో బిజీగా ఉంటారు. మనం లేస్తే వాళ్ళని మనం disturb చేస్తాం అని చెప్పి మనల్ని నిద్ర కూడా లేపరస్సలు. ఒక్కోసారైతే పండగ ముహూర్తం త్వరగా తెల్లవారుజాము ఐతే వాళ్ళే మొత్తం పూజ చేసేసి అప్పుడు మనల్ని లేపుతారు స్నానం చేసేసి దండం పెట్టుకోమని . లేదంటే మాత్రం ధీమాగా లేచి ఇంకో కొత్త dress వేస్కుని ధీమాగా టిఫిన్స్ కూడా చేసి అమ్మ అమ్మమ్మ వాళ్ళ వంటకాల దగ్గర కి వచ్చేసరికి,, తిన్న టిఫిన్ అరడగం start అవకుండానే వాళ్ళు చేసిన బూరెలు గారెలు మనల్ని టేస్ట్ చేయమంటారు . మనం టేస్ట్ చేసేలోగా వాళ్ళు అరటి ఆకుల్లో అన్ని వేసి పెద్దల కి భోజనం అరెంజ్ చేసేస్తారు. అంతా అయిపోయాక పంతులు గారి కోసం ఎదురుచూపులు. మా వీధి అన్ని ఇళ్ళకి ఆ ఊరిలోనే ఒక ఫేమస్ పంతులుగారు వచ్చి పూజ చేసి వెళ్తారు. అతను మా అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వస్తారో అని అనుకునే లోగా వచ్చేస్తారు. ప్రతీ సంవత్సరం అతనే వస్తారు కాబట్టి మా అందరి జాతకాలు పట్టేస్తారు. మా అమ్మ వాళ్లేమో వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారు భవిష్యత్తు లో ఎలా ఉంటారు ఇలాంటి questions అడుగుతుంటారు. ఆ పంతులు గారేమో హాస్యం గా కొన్ని సమాధానాలు ఇచ్చి అతను చేయాల్సిన పూజ చేసేసి అతనికి అందవల్సినవి అతను తీస్కుని మాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్లిపోతారు . ఇంక వెంటనే మేము కూడా ధూపం లో కాస్త సాంబ్రాణి వేసేసి పూర్వీకులకు నమస్కరించి వాళ్ళని వచ్చి తినమని పిలిచి వాళ్ళ కోసం కాసేపు తలుపులు మూసి వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదించారని కొంచెం మనం పెట్టినవి భుజించారని భావించి మేము కూడా భోజనాలు చేసేస్తాం . కాసేపు పిల్లలందరం పెద్దవాళ్లందరితో కూర్చుని చిన్న చిన్న ఆటలు ఆదుకునే లోగా సాయంత్రం అయిపోతుంది .
ఇక ఇప్పుడు మేమేమో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంక ఆ టైం లో ఆ వాతావరణాన్ని అమ్మమ్మ ఇంటిని వదిలి వెళ్లాలని లేకపోయినా నానమ్మ ఇంటికి వెళ్తే అక్కడకూడా cousins వస్తారని ఇక్కడ అక్క, అన్నయ్య, చెల్లి, వదిన, మావయ్య, అందరికి టాటా చెప్పి మళ్లీ పండగ కి కలుద్దాము అని ఒకర్ని ఒకరు హత్తుకుని వీడ్కోలు చెప్పుకుని, నేను అమ్మ నాన్న చెల్లి నానమ్మ ఇంటికి start అవుతాం . అమ్మమ్మ తాతయ్య దగ్గర ఐతే ఆశీర్వాదాలతో పాటు pocket money కూడా లభించేది మరి .
నానమ్మ ఊరు అమ్మమ్మ ఊరుకి మరీ దూరం కాకపోయినా ఒకప్పుడు ఎటువంటి transport ఉండేది కాదు కాబట్టి నడిచి వెళాల్సిన పరిస్థితి .అప్పట్లో అది 7kms ఏ ఐనా అది నడవటం అంటే కష్టమే అనిపించేది. కాకపోతే చెరువు ని దాటుకుని పంట పొలాల మధ్యలో నుండి వెళ్తుంటే ఆ గాలికి అలసట తెలిసేది కాదు . అదే time లో ఏదన్నా ఎడ్ల బండి ఎదురుపడితే ఆ ఊరు వైపు కి అది ఎక్కేసి వెళిపోయేవాళ్ళం . మొత్తానికి చీకటి పడేలోగా నానమ్మ ఇంటికి చేరుకున్నాం .అక్కడలా ఇక్కడ నలుగురు నానమ్మ లు లేరు కానీ నానమ్మ కి నలుగురు పిల్లలు ఎనిమిది మనుమలు మనవరాళ్లు . ముందో వెనకో అందరం రాత్రికి నానమ్మ ఇంటికి చేరుకునే వాళ్ళం . అప్పటికే అలసిపోయాం కాబట్టి పెద్దగా ఆటలు ఎం లేవు తినడం బాతాఖానీ నిద్రపోవడం .
Day 3: కనుమ పొద్దున్నే మా నాన్న సూర్యుడు వచ్చే కన్నా ముందే తను లేచి మమ్మల్ని లేపుతారు అక్కడ బ్రష్ తీసుకెళ్తే పర్లేదు లేదంటే అప్పట్లో ఆ ఊరిలో ఉండేవి కావు మరి తప్పక వేప పుల్లలతో పళ్ళు తోముకోడమే. వెంటనే అక్కడ కట్టెల పొయ్యి దగ్గర స్నానం కి వేడి నీళ్లు మరుగుతుంటే మేమేమో చలి కాచుకునే వాళ్ళం . ఆలా కాసేపట్లో అందరు ready అయిపోయాక పిల్లలు అందరం కలిసి పశువులు ఉన్న కళ్ళం కి వెళ్లి అక్కడ కాసేపు సరదాగా టైంపాస్ చేసి ఆవుల్ని , ఎద్దుల్ని, ఎడ్ల బండిని decorate చేస్తున్న బాబాయ్ కి కాస్త సాయం చేసేవాళ్ళం . అప్పట్లో ఎద్దు కి బొట్టు పెట్టడం అంటే చిన్నపాటి సాహసమే మరి . అక్కడ అయిపోయాక మళ్లీ ఇంటికి వెళ్లి అక్కడ పూర్వీకులకు పూజ చేసి lunch చేసి మళ్లీ చలో కళ్ళం . చీకటి పడేవరకు అక్కడే ఇంక ఖాళీ గా ఉంటామా అంటే లేదు, పక్కనే వేరే వాళ్ళ చెరుకు తోటల్లో చెరుకు కొట్టేయడం, పెసలు అనుకుని మినపకాయలు కోసేయడం చెరువు గట్ల దగ్గర చేపల కోసం దిగడం. ఇలాంటివి అన్నీ చేస్తే పొగడ్తలు ఏమన్నా ఉంటాయా అంత లేదు అన్నీ తిట్లే ఎందుకంటే ప్రతిసారి దొరికిపోయే వాళ్ళంకదా . ఇంక అక్కడే ఉంటే ఇంకా తిడతారని ఇంటికి వెళ్తే అక్కడ కూడా మా విషయం తెలిసి కొన్ని అక్షింతలు పడ్డాయి , కాకపోతే అప్పటికే వాళ్ళు గారెలు బూరెలు తో రెడీ గా ఉండటం వాళ్ళ తిట్లు తో పాటు అవి కూడా తినేసాం . ఈ లోగా నైట్ dinner కోసం ఒక పక్క మసాలా నూరుతుంటే ఇంకో పక్క కోడిని కోస్తున్నారు ఇంకో పక్క చేపల్ని చేస్తున్నారు అంటే ఊహించుకోండి విందు భోజనమే . అప్పట్లో ఆ ఊరిలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదు దీపం బుడ్డి వెలుగులో నాన్నమ్మ వండిన కోడి కూర తో అమ్మ చేసిన గారెలు తింటూ మధ్య మధ్యలో చేప ముక్కల్లో ముళ్ళు తీసుకుంటూ ఎలాగోలా భోజనం పూర్తి చేసేసాం . కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటుంటే మధ్యలో కరెంటు వస్తే కాసేపు పేకముక్కలతో వచ్చి రాని ఆటలు ఆడుకుంటుంటే అమ్మ అత్త వాళ్ళు నిద్రపోమంటే అలా అవే కబుర్లు చెప్పుకుంటూ మాకే తెలీకుండా నిద్రపోయేవాళ్ళం .
Day4: ముక్కనుమ & back to homes ధీమా గా నిద్ర లేచి టిఫిన్ చేస్తుంటే ఒకరి తర్వాత ఒకరు ఎవరి ఇళ్ల కి వాళ్ళు వెళ్లేందుకు బయల్దేరుతున్నాం . నానమ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీస్కుని ఇక్కడ కూడా కాస్త పాకెట్ మనీ సంపాదించుకుని మళ్లీ మా నాలుగురమే ఉండే మా ఇంటికి బయల్దేరాం . ఈ లోగా అమ్మమ్మ మళ్లీ ఓసారి అటు రమ్మంది అన్నమాట గుర్తొచ్చిన అప్పటికే అలసిపోయాం కాబట్టి అటు వెళ్లలేక అమ్మమ్మ మావయ్య కి ఇచ్చి పంపిన చికెన్ మటన్ తీస్కుని ఇంటికి వెళ్లి వాటిని తినేసి relax అవుతుండగానే అమ్మ పిలిచి అమ్మమ్మ నానమ్మ ఇంటి నుండి తెచ్చిన స్వీట్స్ పక్కింటి ఎదురింటి అంటీ వాళ్ళఇంటికి తీస్కెళ్ళమంటుంది. అమ్మతో తర్వాత వెళ్తా అని వాదించి గెలవలేక తప్పక వెళ్లి ఇచ్చి వాళ్ళు ఇచ్చే స్వీట్స్ తీస్కుని వచ్చి అలా కుర్చున్నామో లేదో సెలవులకి అని టీచర్ ఇచ్చిన home works మిగిలిపోయుంటే వాటిని పూర్తి చేసి nidrapoye వాళ్ళం . అంతే మళ్లీ తర్వాత రోజు నుండి school కి వెళ్లి అక్కడ friends తో మా అమ్మమ్మ ఇంట్లో అది చేసాం నానమ్మ ఇంట్లో ఇది చేసాం అని అయిపోయిన సంక్రాతి శెలవుల్ని ని ఇంకొన్ని రోజులు గుర్తు చేస్కుంటూ మళ్లీ పండగ వరకు గడిపేయడమే .
ఆ మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తుల్ని, అల్లరి చేష్టల్ని ఇప్పుడు తలుచుకుంటూ నా ఇప్పటి సంక్రాతి . నాలా జ్ఞాపకాలతో జరుపుకునే వాళ్ళు అలా తలుచుకోకుండా ఇప్పటికీ చిన్నప్పటిలానే మీ సంక్రాంతిని జరుపుకుంటున్న వాళ్ళు అందరికి నా సంక్రాతి శుభాకాంక్షలు.