This Girl's Long Standing Tale Of Love Will Hit You Right In The Feels!

Updated on
This Girl's Long Standing Tale Of Love Will Hit You Right In The Feels!

వీణ - హలో నిధి, రేపు Get Together కి వస్తున్నావ్ కదా? పది రోజుల నుండి అడుగుతున్నానే. మన బ్యాచ్ మొత్తం వస్తున్నారు, నువ్ వస్తున్నావ్ కదా? నిధి - నేను ఇంకా డిసైడ్ అవ్వలేదే ….. వీణ - నీ ఎంకమ్మ , అసలు నీ ప్రాబ్లెమ్ ఏంటే . ఇంత బతిలాడించుకుంటున్నావ్. మన వాళ్ళని కలవడానికి నీకేంటే అంత నొప్పి. రేపు మార్నింగ్ 11 వరకు నువ్వు రావాలి ,సీరియస్గా చెప్తున్నా,రాకపోతే మాత్రం ఇంకా నువ్వెవరో నేనెవరో. ఇది మాత్రం పక్కా. ఇక నీ ఇష్టం.

వెళ్లాలా వద్దా ... రేపు గౌతమ్ వస్తాడా?? వచ్చినా నాతో మాట్లాడతాడా? అసలు నేను తనకి గుర్తున్నానా ... ఉఫ్…… అయినా ఎన్ని రోజులు ఇలా నాలో నేనే ఈ ప్రశ్నలు వేసుకోవాలి,ఇంకా ఎన్ని సంవత్సరాలు తన గురించే ఆలోచిస్తూ కూర్చోవాలి,??? రేపు వెళ్లి తనకి ప్రపోజ్ చేసేస్తా , ఏదైతే అది అవుతుంది,కనీసం నా ఫీలింగ్స్ ని కూడా చెప్పకుండా ఉండడం దేనికి . .... ఒకవేళ నో అంటే ?? ఆమ్మో….వద్దు నా వల్ల కాదు......తనకి కూడా నేనంటే ఇష్టమేమో ?.... కాలేజీ లో ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను స్పెషల్ గానే ట్రీట్ చేసేవాడు,తను కూడా నాలాగే చెప్పడానికి టైం కోసం ఎదురుచూస్తున్నాడా .... అబ్బా ఈ మెంటల్ టార్చెర్ ఏంటో , నిధి .... ఇవన్నీ కాదు రేపు వెళ్తున్నావ్ , గౌతమ్ తో మాట్లాడుతున్నావ్. అంతే

Next Day Morning 9 Am – On the Way to Get Together – In Cab ప్రతీ మనిషి లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద మనకున్న అభిమానం గౌరవం ప్రేమ ఏమాత్రం తగ్గదు . నా లైఫ్ లో అలాంటి స్పెషల్ పర్సన్ గౌతమ్ . మోస్ట్ యునీక్ క్యారెక్టర్ తనది . కాలేజ్ డేస్ లో తను చేసే పనులు ,తన ఆటిట్యూడ్ , స్టైల్, గట్స్ ,కాన్ఫిడెన్స్ లెవెల్స్, అమ్మాయిల్ని ట్రీట్ చేసే విధానం , సినిమాలో చూపించే హీరో లాగా ఉండేవాడు . తననెప్పుడూ దూరం నుంచి చూస్తూ ఉండడం తప్ప 3rd ఇయర్ కి దాక ఎప్పుడు మాట్లాడలేదు,మొదటి సారి ఎదో కాలేజీ లో ప్రోగ్రాం కోసమని తనతో మాట్లాడాను.

ఎప్పుడూ దూరం నుంచి admiring గా తనని చూసే నేను తనతో మాట్లాడడం అంటే అదో కొత్త ఫీలింగ్ . అప్పటినుండి కాలేజీలో ,కాంటీన్ లో,ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు చాలా రెగ్యులర్ గా మాట్లాడుకునేవాళ్ళం. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఆవకాయ పచ్చడి దాక అసలు మేము మాట్లాడుకోని టాపికే లేదు . తక్కువ టైం లో చాలా క్లోజ్ అయిపోయాం . తనతో మాట్లాడకపోతే నాకు రోజు గడిచేది కాదు . తను వేరే ఎవరితో అయినా మాట్లాడితే అసలు నచ్చేదికాదు,అది నా ఫ్రెండ్స్ అయినా . తనమీద ఉన్న అభిమానం,ఇష్టంగా మారింది. నాకు తెలీకుండానే తనతో ప్రేమలో పడిపోయా. తనకి కూడా ఇది తెలుసేమో అని అనుకునేదాన్ని .

నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు, నాన్నకి ఇప్పుడే పెళ్లి వొద్దని చెప్పలేను . ఈ విషయం వీణకి చెప్పాను . తరువాతి రోజు సాయంత్రం గౌతమ్ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మా ఇంటికి వచ్చాడు. " ఇప్పుడే పెళ్లేంటి అంకుల్ , తను క్లాస్ టాపర్ . నెక్స్ట్ సెమిస్టర్ లో ప్లేసెమెంట్స్ వస్తాయి కాలేజీకి,మా అందరిలో ఫస్ట్ జాబ్ కొట్టేది తనే . అసలు తనకి మీరంటే ఎంత ఇష్టమో తెల్సా అంకుల్, తను మిమ్మల్ని వదిలేసి ఉండలేదు . తన సాలరీతో మీకు ఒక ఇల్లు గిఫ్టుగా ఇవ్వాలని మాతొ ఎప్పుడూ చెప్పేది,అసలు తను చాలా టాలెంటెడ్ అంకుల్, మీరేమో అప్పుడే పెళ్లి ఆ అంటున్నారు,. ముందు స్టడీస్ పూర్తి చేయనివ్వండి,తనని లైఫ్ లో సెటిల్ అవ్వనీయండి,తన కాళ్ళ మీద తనని నిలబనివ్వండి, తనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడే పెళ్లి చేసేసి ఆ కలల్ని కన్నీళ్ల చాటున ఆపేస్తారా . పెళ్లి చేసి మీ భాద్యత తీర్చుకోవాలనుకుంటున్నారు , కానీ తను మీ భాద్యతలు తీసుకోవాలనుకుంటుంది . కాస్త టైం ఇవ్వండి అంకుల్ తనకి కూడా,మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. "

నాన్న ఆలోచించి సరే తన ఇష్టం అని చెప్పారు. నేను తలలు బద్దలు కొట్టుకునే సమస్యని చాల సింపుల్గా సాల్వ్ చేసేసాడు గౌతమ్ . ఆ రోజు నా ఆనందం అంత ఇంతా కాదు. ఆ ఆనందంతో అసలు నిద్రే పట్టలేదు,రాత్రంతా తన గురించే ఆలోచిస్తూ ఉన్నా,అప్పుడే నాకు చాలా క్లియర్ గా ఒక విషయం అర్ధం అయింది,నేను పూర్తిగా తనతో ప్రేమలో మునిగిపోయి ఉన్నా . కరెక్టుగా చెప్పాలంటే తనకి అడిక్ట్ అయిపోయా,తనతో మాట్లాడకపోతే ఆ రోజు ఎదో వెలితి,తనని చూడకపోతే అసలు అది రోజే కాదు. ఎమోషనల్గా తనతో అటాచ్ అయిపోయాను . తను లేకుండా అసలు నేనే లేను అనే స్థాయికి వెళ్ళిపోయాను అని అర్ధం అయింది,ఈ ప్రేమలు , ప్రేమ కథలు పుస్తకాల్లో చదుకోడానికి సినిమాల్లో చూడడానికి బావుంటాయి నిజజీవితంలో ఇవన్నీ కుదరవు . తనకి రేపటి నుండి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను,తనకెలాగూ నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పలేదు .

అప్పటి నుండి తను ఎదురుపడినా ,పలకరించినా, ఫోన్ చేసినా , మెసేజ్ చేసినా ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. లోలోపల ఎంతో కష్టంగా ఉన్నా కూడా తప్పలేదు . తనని avoid చేస్తూనే ఉన్నాను ప్రతీ చోటా. చివరికి ఫేర్వెల్ పార్టీ రోజు కూడా తనెంత మాట్లాడాలి అని ప్రయత్నించినా తనతో మాట కూడా మాట్లాడలేదు.

నేనే కాదు చాలా వరకు అమ్మాయిలందరూ చేసేది ఇలానే . ఎక్కడ ఆ అబ్బాయితో అటాచ్ అయిపోతామేమో అని భయపడి పూర్తిగా దూరం పెట్టేస్తారు,అమ్మాయిలకి ఫీలింగ్స్ లేవని అనుకుంటారందరు. కానీ దాని వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలీదు. ఈరోజు నేనొక పెద్ద కంపెనీ లో HR Manager ని , ఈరోజు నేను కోరుకున్న ప్రపంచాన్ని చూడగలుగుతున్నానంటే , ధైర్యంగా ముందుకెళుతున్నానంటే గౌతమ్ వల్లే . తనని కలిసి మూడేళ్లయింది,కానీ ప్రతిరోజు ప్రతి క్షణం నా ఆలోచనలన్నీ తన గురించే ,కలలో,ఊహల్లోఎప్పుడూ తనే. తనకి నా ప్రేమని చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు . ఇప్పుడు తనకి నేనసలు గుర్తున్నానో లేదో అనే భయం . ప్రతీ రోజూ తన ఫేస్బుక్ ప్రొఫైల్ ని చూడడం,ఏవేవో ఆలోచనలతో ఏడ్చేయడం. తన జ్ఞాపకాలతో నవ్వుకోవడం. దాదాపు నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది రెండేళ్లుగా . దేవుడే నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడేమో నా ప్రేమ ని తనకి చెప్పడానికి . ఈసారి మాత్రం ఎలాగైనా చెప్పేయాలి

Cab Reached Hotel వీణ - హమ్మయ్య వచ్చావా... వస్తావో రావో అని తెగ టెన్షన్ పడ్డా ..రా అందరూ వచ్చేసారు (మనసులో మాట్లాడుకుంటూ) గౌతమ్ ఎక్కడా ...కనపడడే ... హా ఉన్నాడు... లాస్ట్ లో కూర్చున్నాడు, నేను తనకి కనపడలేదు .. లంచ్ అప్పుడు మాట్లాడతా . ... ..ఇదేంటిది గుండె ఇంత వేగంగా కొట్టుకుంటోంది .... నిధి కంగారు పడకు,మెల్లిగా చెప్పేయ్... నిధి - గౌతమ్ ...... గౌతమ్ ……………ఎలా ఉన్నావ్ ???? గౌతమ్ - ఓహ్ నిధి నువ్వేనా ......... సారీ మీరేనా ?? నాతోనేనా మాట్లాడుతోంది ?? ఎక్కడో భూకంపం వొస్తుంది కావొచ్చు. ఇంకా గుర్తున్నానా మీకు,బానే గుర్తుపట్టారు... .. నిధి - హ్మ్ ... ఆలా ఏం కాదు గౌతమ్ - ఏంటి చెప్పండి నిధి - అది ... Am Sorry గౌతమ్ - Sorry దేనికి ?? నిధి - Actually Thanks గౌతమ్ గౌతమ్ - ఇందాక sorry ఇప్పుడు Thanks ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పేవి ?? నిధి - అంటే ఇన్ని రోజులు నీతో అసలు టచ్ లో కూడా లేను కదా, చాల rude గా behave చేసాకదా అందుకే సారీ. ఆ రోజు మా ఇంటికి వచ్చి మా నాన్నని convince చేసావు కదా నా కెరీర్ గురించే అందుకే Thanks. గౌతమ్ - ఓహ్ పర్లేదు . అన్నీ ఇంకా గుర్తున్నాయి . అయినా మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఎందుకు ? Ok Fine Have a Good Time. వీణ నీకోసం వెయిట్ చేస్తున్నట్టుంది .

నిధి - గౌతమ్ ఒక్క నిమిషం …… గౌతమ్ …….నీతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని అమ్మాయి అసలు ఏ కారణం లేకుండా నీకు దూరంగా ఉందంటే ఎందుకో నీకు అర్ధం అవ్వలేదా ?? ఉదయం నిన్ను చూసినప్పటి నుండి ఎప్పుడు నీతో మాట్లాడతానా అనే excitement నా మొహం లో నీకు కనపడలేదా? ఇప్పుడు నీ ఎదురుగా నిల్చొని మాట్లాడుతుంటే ,నా కళ్ళలో టెన్షన్ నువ్ గమనించలేదా ? ఇన్నేళ్లు నేను నటించాను,ఇప్పుడు నువ్వు నటిస్తున్నావ్ . సరే నేనే చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం కాదు పిచ్చి , కాదు కాదు ప్రాణం. ఎక్కడ నీమీద ఇష్టం పెరిగిపోతుందో అని నీ మీద ప్రేమతో నీకెక్కడ అడిక్ట్ అయిపోతానో అనే భయం తో ఆరోజు చెప్పలేదు . నువ్ లేకుండా బతికేద్దాం అనుకున్నా,కానీ నువు లేకుండా ఉన్న బతుకులో నేనే లేను గౌతమ్. నీతో ఉంటె నాతో నేను ఉండగలను,నాలా నేనుండగలను .

I Am Incomplete Without Gautam ఇక్కడికి వచ్చింది నిన్ను కలవడానికే .. నీతో కలవడానికే.. గౌతమ్ - Wow. అంటే అప్పుడు నీకు కన్ఫ్యూషన్ వచ్చింది చెప్పకుండా వెళ్లిపోయావ్. ఇప్పుడు నీకో క్లారిటీ వచ్చింది అడగకుండా వచేస్తావ్ ... అంతే కదా . నీకేనా నిధి ఫీలింగ్స్ ,ఎమోషన్స్ ఉండేది నాకుండవా ?? సింపుల్గా ఉన్న నా లైఫ్ లోకి వచ్చి , నీ నవ్వుతో,నీ మాటలతో ఇంకా అందంగా మార్చేసి, ఇలానే ఎప్పటికి ఉంటె బాగుండు అనుకునే టైంకి వదిలేసి వెళ్ళిపోయి complicated గా మార్చేసావ్ నా లైఫ్ ని . ఇప్పుడు ఏమని చెప్పాలి నీకు ?? అసలెంత మిస్ అయ్యానో తెలుసా . ఎలా చెప్పాలి నిధి ?? ఇన్నేళ్లూ నువ్వు ఎలా ఉన్నావో నేనూ అలానే ఉన్నానని చెప్పనా...ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నేను చెబుదామనుకున్నానని చెప్పనా?ఎలా చెప్పాలి ?? నిన్ను ఎలా అయినా, ఒక్కసారైనా చూడాలని అందరిని ఒప్పించి బెదిరించి బతిలాడి ఈ పార్టీ ఆరెంజ్ చేసానని చెప్పాలా? నీకోసమే ఇన్నేళ్లు ఎదురు చూస్తున్నానని ,నీ నుండి ఈ మాటలే వినాలని ఆరాటపడుతున్నానని చెప్పాలా? నాకు ఎలా చెప్పాలో తెలీదు నిధి . ఒక్క మాట మాత్రం చెప్పగలను నువ్ లేకుండా నేను కేవలం ప్రశ్ననే నేను ఎవరు అంటే దానికి సమాధానం నువ్వే నిధి. ఇన్నేళ్లు ఎదురు చూసేలా చేసినా , ఏడిపించినా మొత్తానికి చెప్పేసావ్ .

అర్దాంతరంగా ముగిసిపోయిందనుకున్న నా ప్రేమకథ నేను తను కలవడంతో మళ్ళీ మొదలయ్యింది ఇదీ నా ప్రేమకథ