సంధ్య వేళలో మళ్లీ ఉదయించిన సూర్యుడు - ఒక చిట్టి ప్రేమ కథ!

Updated on
సంధ్య వేళలో మళ్లీ ఉదయించిన సూర్యుడు - ఒక చిట్టి ప్రేమ కథ!
(Story contributed by B Anil Reddy, who works as a software engineer in an MNC.) ఉదయ్ మరియు సంధ్య చాల కాలంగా మంచి మిత్రులు...అలా వాళ్ళు కలిసిన ఒక సంధ్య కాలపు సాయంకాలం... ​ఉదయ్: సంధ్య నీకో విషయం చెప్పాలి...!! సంధ్య: చెప్పు ఉదయ్..! ఉదయ్: నిజం చెప్పమంటవా..అబద్ధం చెప్పమంటావా..?? సంధ్య: ఊ...అబద్ధం చెప్పు ముందు.. ఉదయ్: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. సంధ్య: హా..ఇప్పుడు నిజం చెప్పు..?? ఉదయ్: ఇంతకముందు చెప్పింది అబద్ధం కాదు ..నిజం..!! సంధ్య: అబ్బో..సరే ఐతె..నేను తీస్కోను... ఉదయ్: ఎంటి..?? సంధ్య: ప్రేమ ఇస్తున్న అన్నవ్ కదా ...అది తీస్కోను అంటున్నా... ఉదయ్: సరే తీస్కోకు కాని తిరిగి ఇవ్వు... :p ఈ చిత్రమైన సంబాషణకి వాళ్ళు ఇద్దరు మనసులొనే నవ్వుకున్నారు... సంధ్య: ఐన నేను నీకు ఎందుకు నచ్చాను..??? కొంపతీసి అందంగా ఉన్నాన ఏంటి..?? ఉదయ్: అందం..ఐన ఒక అమ్మాయి అందంగా ఉండటంలో ఆ అమ్మాయి చేసింది ఏముంది..? తల్లితండ్రుల వల్లనో , దేవుడి దయ వల్లనో అందంగా పుడతారు అంతే.. నా ద్రుష్టిలో ఒక అమ్మాయి అందంగా ఉండటం అసలు అమె గొప్పతనం కాదు..అందమైన వ్యక్తిత్వం ఉండటం మాత్రమే అమె గొప్పతనం..నా సంధ్య చాల మంచి వ్యక్తిత్వం కలది ..అది చాలు నాకు... సంధ్య: కాని అబ్బాయిలు అందరూ అందంగా ఉండే అమ్మాయిలనే కావాలనుకుంటారు కదా...?? ఉదయ్: మనకి స్వఛ్ఛమైన ప్రేమ చూపించే అమ్మ అందంగా ఉండాల్సిన అవసరం లేదు...నిజమైన బాధ్యత చూపించే నాన్నకి అందంతో పని లేదు...కాని ఈ రెండు చూపించాల్సిన జీవిత భాగస్వామిని(life partner) ఎంచుకునే విషయంలో అందం ఒక్కటే ప్రామాణికం(requirement) అవ్వకూడదు... సంధ్య: ఎన్నో రోజుల నుండి నేనే నీకు చెప్పాలి అనుకుంటున్నాను ..చివరికి నువ్వే చెప్పేసావ్..నేను కూడ నీకు ప్రేమని ఇస్తున్నాను ...(నవ్వుతూ.. ) ఉదయ్: నా ప్రాణం తాకట్టు పెట్టి మరీ తీస్కుంటాను నీ ప్రేమని ....!! సరే గాని చీకటి పడుతుంది ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు.. నేను bike తీస్కొని వస్తాను... సంధ్య :ఊ...సరే..!! ఇంతలో ఎవరో సంధ్య అని పిలిచినట్లు అనిపిస్తే వెనుకకి తిరిగి ముందుకు నడుస్తు జారి పడబోయింది ... ఇంతలో ఉదయ్ వచ్చి సంధ్యని పడకుండా పట్టుకున్నాడు. ఉదయ్: ఎన్ని సార్లు చెప్పాలి సంధ్య నేను లేకుండ ఏం చెయ్యకు అని.. సంధ్య: తమరు పిలిచినట్లు అనిపిస్తేను...!! అంటూ గలగల నవ్వింది.. ఉదయ్: సరే ఇక వెళదాం పద... తనకి కళ్ళు లేవు అన్న చేదు నిజాన్ని కూడా మర్చిపోయి ఉదయ్ చేతిలో చెయ్యివేసి అనందంగా ముందుకి నడిచింది సంధ్య... అస్తమిస్తున్న సూర్యుడు అనందంగా నిష్క్రమించాడు..కోటి ఆశలు తన కళ్ళలో నింపుకున్న సంధ్య జీవితంలో మళ్ళీ ఉదయ్ రూపంలో ఉదయించడానికి...