మళ్లీ అదే కథ అదే వ్యథ ఆడదానిపై అకృత్యాలు మనకి రొజూవారీ విషయాలు అయ్యాయి. రోజుకి నాలుగు దుశ్చర్యలు వారానికి ఒకటి వెలుగులోకి నలుగురం రెండ్రోజులు చేతులు పిసుక్కొడం భాధ పడడం,అయ్యో అనుకొని చేవచచ్చిన సమూహంలా మళ్లీ మన బతుకుల్లో గడిపేయడం
రెండ్రోజుల్లో మళ్లీ మరొ దాశ్టికం జరగడం సోషల్ మీడియా కవులు భాధావేశమ్ తో కవితలు రాయడం నెక్లెస్ రొడ్లొ కాండిల్ మార్చ్ ప్లేకార్డులతో ఒక ర్యాలీ నాలుగు రోజులు మీడియాలో వార్త ఐదో రోజు మళ్లీ మరొ కథ
ఆవేశంతో రెండ్రోజులు,ఆవేదనతో రెండ్రోజులు గడిచిపొతాయి మర్చిపొవడానికి మరో అంశం దొరగ్గానే హాయిగా మరచిపోతాం చట్టాలెన్ని చేస్తెనేం మృగాలకి అవి ఎలాగూ వర్తించవుగా
అయినా సిటీ బస్సుల్లో మధ్యలో ఇనుప కంచె వేసినపుడే మనం ఎంత క్రూరుల మధ్య బతుకుతున్నామో,ఆడాళ్లు ఎంత అభద్రతలో ఉన్నారో అర్దం అయ్యింది
ఇంత మంది గాంధారీ పుత్రులు ఉన్న సమాజంలో రేపు నేను ఒక ఆడదాన్ని జీవితాంతం కాపాడుకొవాలీ,ఒక ఆడ పిల్లని పెంచి పెద్దచెయాలీ అంటేనే వెన్నులొ వణుకు పుడుతుంది
Maybe We Dont Deserve Woman.
Rest in Peace because we did not let you Live in Peace అనడం తప్ప మరేమీ చేయలేని ఓ చేతకానివాడు.