Contributed by Bharadwaj Godavarthi
మనతో మనం గడిపిన క్షణాలు మాత్రమే నిజమైన జీవితం ఏమో? చిటికె శబ్ధానికి, గాలి పాటకే, పరవశించిపోయి స్వచ్ఛమైన చిరునవ్వుని కురిపించే ఆ బాల్యానికి, సంవత్సరానికి ఒకసారి పెరిగే జీతంలోనో, ఖరీదైన వస్తువులలోనో, చిరునవ్వుని వెతుకునే ఆధునిక సమాజం నీడ తాకకుండావుంటే ఎంత బావుండునో!!
ఓ పాప, నువ్వు అలానే ఆ బాల్యంలో ఉండిపో, ఎందుకంటె నువ్వు పాపగా ఉన్నపుడు అందరి గమ్యం నిన్ను నవ్వించడం మాత్రమే!
అలా కాకుండా నువ్వు ఒకసారి ఎదగడం మొదలుపెడితే వాళ్ళ ఇష్టాలు నీ గమ్యాలు అవుతాయి, వాళ్ళ భయాలు నీ కట్టుబాట్లు అవుతాయి, చివరికి ఏదో ఒకరోజు అద్దంలో నీ చిరునవ్వే కాదు నీ ప్రతిబింబం కూడా కనుమరుగవుతాయి.