Contributed By Avinash Vemula
నన్ను ఎవరో వెంటాడుతున్న ఫీలింగ్... ఎవరో తరుముతున్న భయం ...
నేను పరిగెడుతూనే ఉన్నాను... వీలైనంత వేగంగా.... అందనంతా దూరంగా... నన్ను వెంటాడుతున్న ప్రశ్నల నుండి... నన్ను తరుముతున్న ఆలోచనల నుండి...
ఈ పరుగు సమాధానాలు తెలియక కాదు... పరిష్కారం వెతకడానికి కాదు... నన్ను నేను పరీక్షించుకోడానికి... నా బలాన్ని, నా ప్రేమని, నా సహనాన్ని...
ఆపేస్తాను ఈ పరుగుని... హాయిగా ఓ చెట్టు కింద కూర్చుంటాను.... తనివితీరా ఊపిరి పీల్చుకుంటాను... నేనేంటో నాకు తెలిసినపుడు...
నా ఈ అన్వేషణకి కారణమైన సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ఒక్క క్షణం ఆగినట్టుగా అనిపిస్తుంది... ఇది మనోవేదన.. ఇది మనోపరీక్ష...
వేచి చూద్దాం... ముందు ఏది ఆగుతుందో.. నా పరుగో లేక నా గుండెనో...
కానీ అప్పుడుదాకా మాత్రం అలా ఆగి ఆగి కొట్టుకుంటున్న గుండెతో ఆగి ఆగి పరిగెడుతూనే ఉంటాను..