సాంఘీకంగా, ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు చెందినవారి జీవితాలు ఉన్నతంగా వెలగాలనే గొప్ప ఉద్దేశంతో అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ ను పొందుపరిచారు.. కాని అదే ఇప్పుడు మన అభివృద్ధికి ఆటంకంగా ఒక కారణంగా నిలుస్తుందనే ప్రధాన అంశంతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపోందింది. ఇందులో ఒక వర్గం వారిదే తప్పు అని కాకుండా ఇరువురి తప్పులను చాలా స్పష్టంగా చూపించారు. ఈ దేశం మన ఇల్లు లాంటింది. మన కుటుంబంలో అందరూ అన్ని రకాలుగా బాగుంటేనే నిజమైన ఐక్యతకు చిహ్నంగా మన ఇల్లు నిలుస్తుంది. ఈ కల కేవలం ప్రతి ఒక్కరి సహకారంతో మాత్రమే నెరవేరుతుంది. ఎప్పుడో జరిగిపోయిన తప్పులకు ఇప్పుడున్న వారిని బాధ్యులను చేయకూడదు.. ఇది చాలా సున్నితమైన అంశంతో తీసిన షార్ట్ ఫిల్మ్, నిండు మనసుతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..