దేశం మరువదు మీ త్యాగం.. APJ అబ్దుల్ కలాం గారు

Updated on
దేశం మరువదు మీ త్యాగం.. APJ అబ్దుల్ కలాం గారు
నా దేశానికి కలలు కనటం నేర్పించారు, కష్టపడటం చూపించారు, దారి మార్చారు, మార్గాన్ని సృష్టించారు, రక్షణ కల్పించారు, ధైర్యం అందించారు, ముప్పుని అరికట్టారు, గౌరవం తెప్పించారు, సామర్ధ్యాన్ని పెంపొందించారు, స్థాయిని పెంచారు, ఆలోచనలు చొప్పించారు, ఆనందపడేలా చేసారు. నడకలు రాని దేశాన్ని పరుగులు పెట్టించారు, పదాలు రాని దేశంతో పద్యాలూ పాడించారు, నిలబడ లేని దేశాన్ని ఎగిరేల చేసారు, గమ్యం లేని దేశానికి మార్గం మీరయ్యారు. మీరు ఈ రోజు నుండి లేకపోవచ్చు గాక, కాని మీరు చూపిన మార్గం, ఇచ్చిన స్పూర్తి, సాధించిన ప్రగతి, అనుభవించిన కష్టాలు, ఆచరించిన నియమాలు, అందించిన విజయాలు, పాటించిన పద్దతులు, నేలపై మొక్కలు నింగిలో చుక్కలు ఉన్నంతవరకు ఈ నా దేశం లో ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరి మనసులో, ఏదో ఒక సమయంలో మెదులుతూనే ఉంటాయి. మాతృ భూమి పై ప్రేమతో, మహోన్నత కృషితో మరుపురాని మరవలేని మజిలీలు ఎన్నోఅందించిన, సొంత సుఖాలు ఏవి ఎరుగని స్వచ్చమైన మనిషి మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దేశానికి ధైర్యం,మార్గం, గర్వం, ఖ్యాతి మీరు. మా హృదయాల్లో మీరు ఎప్పటికి ఉంటారండి కలాం గారు. స్వర్గం కూడా సంతోష పడుతుంటుందేమో మీ రాక వలన... మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్దిస్తూ... _/\_ APJ (1)