అర్జున్ రెడ్డి ట్రైలర్ social media లొ ఒక రేంజ్ లొ ట్రెండ్ అవుతొంది. కాని ఆ ట్రైలర్ లో ఒక shot లొ బామ్మ గారు కనిపిస్తారు. ఆవిడ ఎవరో కాదండి yesteryear actress కాంచన గారు. Almost 30 years తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. So here’s an emotional short story from a fan to this veteran actress.
కాంచన(76) ఇప్పుడు బాగా ముసలావిడ. నడవడం కూడా కష్టంగా ఉంది. సాయంత్రం డాబా మీద బాల్కనీ లో కాసేపు గాలికి కూర్చుని సూర్యాస్తమయం చూస్తుంది. "తను రాలిపోయే రోజు ఎప్పుడొస్తుందా ?" అన్న చిన్న ఆలోచన. ఇప్పుడు చావు ఆమెకి ఓ ఆలోచన మాత్రమే. భయం కాదు. తను జీవితం లో అన్నీ చూసింది. మంచి, మోసం, కీర్తి, కపటం, బాధ, బాధ్యతా అన్నీ. కాంచన 1980లలో క్రేజీ హీరోయిన్. కుర్రకారు గుండెల్లో ఓ తుఫాను. తనకి ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి నవ్వుకుంది. ఇంతలో పనివాడు మధు(43) వచ్చి, "ఎవరో మీ అభిమాని అంట! పూల బొకే తో వచ్చాడు మేడమ్!! ఎంత చెప్పినా వినడం లేదు! పిలవమంటారా ?" అని అడిగాడు. ఎందుకో బాధపెట్టడం ఇష్టం లేక తలూపింది. తన అభిమాని అంటే ఏ 50 ఏళ్ల ముసలాడో అనుకుంది. తీరా చూస్తే వచ్చిన అభిమాని 16 ఏళ్ల కుర్రాడు. ఆశ్చర్యపోవటం ఆవిడ వంతయ్యింది. కుర్రాడు 76 Red Roses ఉన్న బొకే ఆమెకి ఇచ్చి, "Happy Birth Day Madam" అన్నాడు. అప్పుడు కాలెండర్ చూసింది, అక్టోబర్ 17. మధు ఆ కుర్రాడికి టీ తెచ్చి ఇచ్చి వెళ్లిపోయాడు.
"నాకు ఎందుకో నీ మీద అనుమానం గా ఉంది! ఎప్పుడు పుట్టావు నువ్వు ?" అని అడిగింది. ఆ కుర్రాడు నవ్వి, "2000 లో మేడమ్!" అన్నాడు. నేను 1980 లోనే సినిమాలు మానేశాను. నన్ను అందరూ ఎప్పుడో మర్చిపోయారు! అంది కాంచన. నేను మొన్న జనవరి లో మీరు, NTR కలిసి నటించిన "కిలాడి" చూశాను. నిజం చెప్పాలంటే నేను మీవి కేవలం 8 సినిమాలే చూశాను. కానీ ఆ కిలాడి చూసిన రోజే మీ అభిమాని అయిపోయాను. 1964 లో వచ్చింది ఆ సినిమా. మొన్న జనవరి లో మా క్లాసిక్స్ అనే ఛానల్ లో వేశారు ఆ సినిమా. "ఏ నాలో అంతగా ఏం నచ్చింది?" అని అడిగింది. ఆ కుర్రాడు సీన్ ప్రకారం ఆమె నటన, హావభావాలు పలికిన తీరు వర్ణించడం మొదలుపెట్టాడు! ఓ పావు గంట అయ్యాక ఆమెకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. తను ఆ సినిమా లో అంత గొప్పగా నటించానా? అని తానే ఆశ్చర్యంతో, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది.. "సినిమా విషయాలు వద్దు! నీ గురించి చెప్పు!" అని ఆ కుర్రాడి విషయాలు తెలుసుకుంది.
ఆ కుర్రాడు ఆమెతో సెల్ఫీ దిగాడు. నెల రోజుల నుంచి కాలు కదపలేక పోతున్న ముసలావిడలో కొత్త ఉత్సాహం చూసి పనివాడు ఆశ్చర్యపోయాడు. ఇక ఆ కుర్రాడు సెలవు తీసుకుని వెళ్లబోతుండగా, " ఈ రోజుల్లో అయితే నా వల్ల కాక పోయేది ఏమో ?" అని అంది ఆవిడ. "ఈ రోజుల్లో మీరు కానీ ఉండి ఉంటే పచ్చబొట్టేసిన పాటలో తమన్నాకి బదులు మీరే ఉండేవారు! ఇది నిజం!" అన్నాడు. ఆమె ఆ కుర్రాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని హత్తుకుంది. ఆ కుర్రాడు ఇచ్చిన పూల బొకే తో పాటు ఓ చిన్న కవర్ ఉంది. ఆ కవర్ ఓపెన్ చేస్తే ఓ చిన్న DVD ఉంది.
వెంటనే ఆ DVD ప్లే చేయించింది. ఆ DVD లో కాంచన పాత Dance Moments అన్నీ కొత్త పాటలకి re-edit చేసి ఉన్నాయి. ఆ పచ్చబొట్టేసిన పాటకి తను, కాంతారావు రావు వేసిన స్టెప్స్ కి నవ్వు ఆగలేదు. సంవత్సరాల తరువాత, ఆ రాత్రి కాంచన మళ్ళీ నవ్వింది. చెప్పాలంటే ఆమె మనసు ఉయ్యాల ఊగింది. అది ఓ 16 ఏళ్ల కుర్రాడు ఊపిన ఉయ్యాల. తను నటన ఆపేసిన 20 ఏళ్లకి పుట్టిన ఓ పసివాడు ఊపిన ఉయ్యాల. ఆ నటికి జీవితం, సినిమా కన్నా వింతగా అనిపించిన రాత్రి అది.