ఇప్పుడు మన దేశంలో ఉన్న International Standard Sports Academy లో దాదాపు అన్ని కూడా ఒక Sports Person స్థాపించినవే.. సుధీర్ఘ కెరీర్ లో ఎన్నో మెడల్స్ సాధించి రిటైర్ అయ్యాక గవర్నమెంట్ వారి సహాయంతో అకాడమి స్థాపించిన వారే మనదేశంలో అధికం. కాని "చలసాని బలరామయ్య" మాత్రం మిగిలిన వారందరి కన్నా భిన్నమైన వారు.. ఆయనకు కూడా చిన్నప్పటి నుండి ఆటలంటే చాలా ఇష్టం కాని ఆర్ధిక పరిస్థితుల దృష్ఠ్యా ఇంకో రంగంలోకి వెళ్ళారు. అక్కడ ప్రపంచ స్థాయిలో బిజినెస్ లో గౌరవంగా సంపాదించి, ఇప్పుడు అదంతా ఒదిలేసి తనకెంతో ఇష్టమైన క్రీడారంగంలో సేవలు చేస్తూ దేశం గర్వించె ఆటగాళ్ళను అకాడెమి ద్వారా తయారుచేస్తున్నారు.. అది ఏ స్థాయిలో అంటే దాదాపు 150 ఎకరాలకు పైగా ఆటస్థలాలు ఏర్పాటుచేసి కోట్ల రూపాయలను పేదవారి కోసం, దేశం కోసం వెచ్చిస్తున్నారు.

"చిన్నప్పుడు రన్నింగ్(100మీటర్స్) రేస్ లో మొదటిసారి ఓడిపోయారు, సంవత్సరం తర్వాత అదే రన్నింగ్ రేస్ లో గెలిచారు.." 'ఒక స్కూల్ లో అడ్మిషన్ టెస్ట్ లో ఫేయిల్ అయ్యారు ఇక అప్పుడే నిశ్ఛయించుకున్నారు ఇక జీవితంలో ఒక్కసారి కూడా Examలో Fail అవ్వకూడదని.. అనుకున్నట్టు గానే ఎప్పుడు పరీక్షలలో ఫేయిల్ అవ్వలేదు.. ఇవన్ని ఎందుకు చెబుతున్నానంటే ఓటమిలో పాఠాలు నేర్చుకుని గెలుపును అందుకోవడం మాత్రమే కాదు, ఇటు ఆటలలో అటు చదువులలో రెండింట్లో ఆయన సామర్ధ్యం గురుంచి తెలియాలని.. అలా చిన్నప్పటి నుండే చదువులో, గేమ్స్ లలో పట్టుదలతో మంచి ప్రావీణ్యం పొందారు.

కామినేని ఈశ్వర రావు అనే వేయిట్ లిఫ్టర్ మన తెలుగువారు. ఒకసారి ఆయన ప్రదర్శన చూసి ఎలాగైనా ఒలపింక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలని చిన్నతనంలో Decide అయ్యారు. కాని మన బలరామయ్య గారికి తినటానికి తిండి కూడా లేని పరిస్థితి.. అందుకుని ముందు చదువు మీద దృష్ఠిని కేంద్రీకరించారు.. కాని ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఆశ మాత్రం అలాగే ఉంది. ముందుగా Indian Air force లో Job సాధించారు. ఉద్యోగం చేస్తూనే స్పోర్ట్స్ నుండి జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడారు.. Indian Air force నుండి ఇండియన్ రైల్వేస్ లో జాబ్ మారే సరికి ఇక గేమ్స్ లో అంతగా ఆడలేకపోయారు. ఆ ఉద్యోగంలో జీతం తను ఆశించినంతగా రాకపోవడంతో దానికి రాజీనామా చేసి ఒక చిన్నపాటి పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించాడు దానిలో లాభాలు విపరీతంగ రావడంతో భారతదేశంలోనే అత్యున్నత సంస్థగా గుర్తింపు లభించింది. అప్పటికి కుడా ఆయన మదిలో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఆశ అలాగే ఉంది.

ఇక సంపాధించింది చాలు అని కుటుంబ పరంగా ఆయన చేయవలసిన కర్తవ్యాలన్నీటిని పూర్తిచేసి పూర్తిస్థాయిలో తనకిష్టమైన ఆటలపై దృష్ఠిసారించారు. కృష్ణా జిల్లాలో CBR Academy of Sports & Education(2001) స్థాపించి పేద పిల్లలకు చదువుతో పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా దేశం గర్వించదగిన పౌరులను సమాజానికి అందిస్తున్నారు. కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్ లో 3 బంగారు పతకాలు, ఏషియన్ ఛాంపియన్ షిప్ లో 3 రజిత పతకాలు.. ఇలా వివిధ విభాగాలలో ఇంటర్నేషనల్ లెవల్ లో 2, నేషనల్ లెవల్ లో 40, రాష్ట్ర స్థాయిలో 9 పతకాలు ఆ అకాడెమి విద్యార్ధులు సాధించారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోని అకాడమీ లానే మన హైదరాబాద్ లో కూడా 75 ఎకరాలలో అకాడెమి స్థాపించి భవిషత్తులో ఆయన కోరిక ప్రకారం తన శిష్యులు ఒలంపిక్స్ లో మెడల్స్ గెలవాలని బలంగా ఆశిస్తున్నారు.

