ఉప్పలపు శ్రీనివాస్.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ మాండలీన్ శ్రీనివాస్ అని అంటే మాత్రం సంగీతాభిమానులు పరవశించి పోతారు... కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య పరికరమైన మాండలిన్ ను మొదటి సారిగా ప్రయోగించి విజయవంతంగా మూడున్నర దశాబ్దాలకు పైగా శ్రోతలను అలరించిన మహా విద్వాంసుడు శ్రీ మాండలిన్ శ్రీనివాస్... మాండలిన్ ను తన ఇంటిపేరుగా, మాండలిన్ కు తానే మారుపేరుగా తన నామాన్ని, స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఆయన..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కచేరీలు ఇచ్చి సంగీతాభిమానులను మైమరిపించిన శ్రీనివాస్ మన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం.. దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే పరమపదించటం భాదాకరమైనా.. ఆయన జీవించినంత కాలం సంగీతం లోనే గడిపారు...! అయనకంటూ కొన్ని చెరిగిపోని పేజీలను రాసుకొని వెల్లారు...
ఆయన గురించి మనమంతా తెలుసుకోవాల్సిన విశేషాలు..
1. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడే...! ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీత దర్శకుడిగా కంటే తన గురువుకి శిష్యుడిగానే తాను గర్విస్తానని చెప్తారు డి.ఎస్.పి.. తన సన్ ఆఫ్ సత్యమూర్తి ఆల్బమ్ ను శ్రీనివాస్ కు అంకితం (dedicate) చేశారు దేవి
2. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సభల్లో కచ్చేరీ చేశారు.. ఏ భారతీయ కళాకారుడికీ అప్పటివరకూ దక్కని అరుదైన అవకాశం అది...!
3. 7వ యేటనే తన తండ్రి, అన్నల ప్రోత్సాహంతో మాండలిన్ అభ్యాసం మొదలుపెట్టిన శ్రీనివాస 9వ యేట కచేరీతో అరంగేట్రం చేసారు ఆ బాలవిద్వాంసుడు..
4. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా గౌరవం పొందారు... ఊరు ఊరునా సంగీత కళాకారులు, విమర్శకులూ ఉండే తమిళనాట ఓ తెలుగు కుర్రాడికి దక్కిన అరుదైన గౌరవం అది..
5. 29వ యేటనే పద్మశ్రీ అందుకున్నారు.. ఎన్నో వందల సత్కారాలు,అవార్డులు పొందినా అత్యంత సాధారణంగా జీవించిన నిగర్వి.
6. హిందుస్థానీ కర్ణాటక సంగీతాలే కాక విదేశీ (వెస్టర్న్) సంగీతం లో కూడా ఎనలేనీ కీర్తిని ఘటించారు. హరిప్రసాద్ చౌరాసియా, జాకీర్ హుస్సేన్, పండిట్ రవిశంకర్, శంకర్ మహదేవన్, హరిహరన్, డ్రమ్స్ శివమణి లతోనే కాక విదేశీ వెస్ట్రన్ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్, జాన్ మెర్ లాగ్లిన్, నైగెల్ కొండి టైగన్, మైఖేల్ వైమన్ వంటి వారితో కలసి పని చేసాడు. దేశ విదేశాలలో కచేరీలు ఇచ్చాడు
భారతీయ సంగీతంలో ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది..ఆయనను ఎవరూ మరిపించలేరు..ఆయనలా ఎవరూ మనల్ని మరిపించలేరు కూడా...
1.బాలమేధావి
https://www.youtube.com/watch?v=2EIy6BjQPs0&feature=youtu.be
2.విదేశీ కళాకారులతో
https://www.youtube.com/watch?v=VA7Mzo73cd4&feature=youtu.be
3.పంచరత్న కృతులు
https://www.youtube.com/watch?v=nKYQuGTd0XU&feature=youtu.be
4.తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధనలో
https://www.youtube.com/watch?v=DxuG9WVFgas&feature=youtu.be
5.ఆయన ఇంటర్యూ
https://www.youtube.com/watch?v=XIn13XYdLBw&feature=youtu.be