"జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా ఉండకు, నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవూ అనుభవించవలసిందే" -సరోజినీ నాయుడు. భారత స్వతంత్ర పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని తన వాగ్ధాటితో, కవితలతో దేశీయులలో స్పూర్తిని మరింత పెంచారు.. ఇప్పుడే చాలావరకు మహిళలు తమ హక్కులను ఉపయోగించుకోలేక వెనకడుగు వేస్తున్నారు మరి 70 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. స్వతంత్ర పోరాటమంటేనే తెల్లవాడి తూటకు ఎదురు నిలబడడం, వాళ్ళ నిర్ధాక్షిణ్యం లేని కుట్రలకు ఓపికతో నేర్పరితనంతో వ్యూహ రచన చేయాలి.. వీటన్నిటిలో భారత స్వతంత్ర పోరాటంలో మహిళల శక్తి కూడా అపారం నిరూపించారు సరోజినీ నాయుడు గారు. అందుకే కాబోలు అప్పటికి, ఇప్పటికి మహిళ లోకానికి స్పూర్తి ప్రధాతగా నిలుస్తున్నారు.


1879లో ఇదే రోజు నాడు మన హైదరాబాద్ లో జన్మించిన సరోజినీ గారికి చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే కేం బ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివే వరకు సాగింది వారి చదువుల ప్రయాణం. అక్షరాలను చదవడం మొదలుపెట్టినప్పటి నాటి నుండే ఇంగ్లీష్ అంటే ఇష్టం ఏర్పడటంతో ఎలాగైనా ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఆరాట పడ్డారు. అలా కేవలం 11ఏళ్ళు నిండేసరికి ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడేశారు. కేవలం 13 సంవత్సరాలకే పదమూడు వందల లైన్లతో "Lady Of Lake" రచన చేసి అందరిని ఆశ్ఛర్యానికి గురిచేశారు. రచయితగా ఆమె శైళి చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. అది పోరాట రచన కావచ్చు, ప్రేమ కవిత్వం కావచ్చు మరే ఇతర విభాగం కావచ్చు ప్రతి లైన్, ప్రతి పుస్తకం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది ఆమె రచన.


కేవలం స్వతంత్ర పోరాటంలో మాత్రమే కాదు భారతీయులలో ఉన్న మూడ నమ్మకాలు, అనవసర ఆచారాలు, కుల విద్వేషాలపై కూడా సమర్ధవంతంగా పోరాటం చేశారు. సరోజినీ నాయుడు గారు కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు. మన కందుకూరి వీరేశలింగం గారి ఆద్వర్యంలో ఈ వివాహం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ సమావేశం లాంటి స్వతంత్ర పోరాటంలో కీలకమైన సందర్బాలలో తమదైన శైళిలో పోరాటం చేశారు. "నేను ఒక ఒక మహిళని నా పరిధి ఇంతే అని సరోజినీ గారు ఎక్కడా ఆగిపోలేదు" ఆకరికి జైలు జీవితం కూడా బెదరక గడిపారు. ఎంతోమంది జీవితాల త్యాగాలతో సిద్ధించిన స్వేచ్ఛా భారతావని సంపన్న దేశంగా ఎదగడానికి ఉద్యమంలో పాల్గొన్న వారే ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా నాడు ఎన్నికయ్యారు.. అలా సరోజినీ నాయుడు గారు స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ గా కూడా భారతీయులకు సేవచేశారు.



Mahatma Gandhi with Charlie Chaplin at Canning Town, London, September 22, 1931.
Mahatma Gandhi mit Charlie Chaplin und anderen in Canning Town (London) am 22. September 1931.