పిల్ల జమీందార్ - తెలుగు సినిమాలలో ఓ ప్రత్యేక స్థానం దీనిది. విడుదలైనప్పుడు నాని సినిమా కదా అని ధియేటర్ కి వెళ్ళాను నేను, సినిమా పూర్తయ్యాక బయటకి వెళ్ళేప్పుడు నాని సినిమా కాదు అశోక్ సినిమా కాదు అచ్చ తెలుగు పదాలు పలికిన సినిమా అనుకుంటూ వెళ్ళాను. అశోక్ ఎవడ్రా అనేగా !? ఈ సినిమా రచయిత, దర్శకుడు ఇతనే అండి. తెలుగు భాష మీద అతనికి ఏ స్థాయి ప్రేమ, అభిమానం, అనురాగం ఉన్నాయో ఈ సినిమా చూస్తుంటే అర్ధమవుతుంది. పొగడబంతిపువ్వు మొహమోడ, తస్కస్కంభట్లు, మళ్ళీ, సహస్రం, వ్యాకోచించిన, సంకోచించి ఇలాంటి తెలుగు పదాలు వినిపించటమే కాదు, ఎలా పలకాలో కూడా చెప్పటం అది కూడా అందరికి అర్ధమయ్యేలా వినోదాన్ని దాటిపోకుండా. ఈ సినిమాలోని సంభాషణలు నవ్వు తెప్పించటమే కాదు, ఆలోచన కలిగించేలా కూడా ఉన్నాయి. ఇంత మంచి సినిమా గురించి అందరికి తెలియాలి అనే ఉద్దేశ్యంతో వురికే చెప్తే నేనే వినను, అందుకే కొన్ని సంభాషణలు మచ్చుకు చూపిస్తూ చెప్తే ఆసక్తి కలుగుతుంది అని ఈ ఆర్టికల్ ఇలా రాయటం జరిగింది.
1. నాని కామెడీగా చెప్తాడు కాని, ఇది వందకు పదింతలు సత్యం అండి. నేనూ ఈ స్టడీ అవర్ల బాధితుడినే కనుక నాకు వెంటనే కనెక్ట్ అయ్యింది. ఎంత చదివినా వందే కదండీ! మహాప్రభో స్టడీ అవర్లతో సావగొట్టకండి!!!
2. ఈ ఆర్టికల్ చదువుతున్న మనలని ఉద్దేశించింది కాదు ఈ డైలాగ్. తెలుగుని తెలుగులో చదవటం తెలీని చాలా మంది తెలుగు యువకుల కోసం అన్నమాట. తెలుగు కంటే టింగ్లిష్ బాగా అలవాటైన ప్రభుద్దుల కోసం.
3. నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుంటే ఒక్కసారి ఓడిపోయి చూడండి. ఎప్పుడూ గెలిచేవాడి చుట్టూ అభినందించేవాళ్ళు ఉంటారు, ఓడిపోయినా వాడి పక్కన ప్రోత్సహించేవాళ్ళు ఉంటారు. ప్రోత్సహించే వాళ్ళని సంపాదించుకోండి.
4. నేర్పించగలిగినవారెందరున్నారు ప్రస్తుత సమాజంలో. చెప్తే వినేవారు, చూపిస్తే నేర్చుకునే వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది అనుకోండి.
5. తలబడి కలబడి నిలవడు పాటలో ఓ చిన్న వాక్యం. మంచి సంగీతం, శంకర్ మహదేవన్ స్వరం, కృష్ణ చైతన్య సాహిత్యం అద్భుతంగా అమరాయి. ఈ పాట ఒక్కసారి వినిచూడండి. ఏదో మాయ జరిగి మొత్తం మారిపోతుంది అనను కాని, తెలీని ఓ మంచి అనుభూతి మట్టుకు ఖచ్చితం.
6. అదండీ! విషయం.
7. ఏలాంటి వ్యాఖ్యా లేదు. రాయాలని నాకూ లేదు.(నో కామెంట్ కి గూగుల్ అనువాదం.)
8. మిగిలినవి ఏమో కాని మనిషిని మనిషిలా చూసేవాళ్ళు ఈ రోజుల్లో దేవుడన్నట్టే భయ్యా. నేనైతే ఇప్పటివరకు ఒక్క దేవుడ్ని కూడా చూడలేదు. నేనూ దేవుడిని కాదు, ఎందుకంటే చెప్పినంత వీజీ కాదు కనుక.
9. జీవితం, కాలం రెండిటికి భలే సారూప్యం ఉందండీ! రెండు అనులోమానుపాతంలో ఉంటాయ్. కాలం కరుగుతుంటే, జీవితం పెరుగుతుంటుంది. ఒక్కదానికి విలువివ్వకపోయినా రెండోదానికి విలువుండదు.
ఇవన్ని మచ్చుకు మాత్రమె, సినిమాలో ఇంకా బోలెడు వినోదాన్ని, వివేకాన్ని పంచె సంభాషణలు ఉన్నాయి. youtube లో చూసేయ్యండి మరి!