These 9 Things About Actor Dhanraj And His Struggle Into Cinemas Will Show You A Different Side Of His Story!

Updated on
These 9 Things About Actor Dhanraj And His Struggle Into Cinemas Will Show You A Different Side Of His Story!

ఇంతకు ముందు అంత Deepగా పరిశీలించలేదు గాని ఈ బిగ్ బాస్ షో స్టార్ట్ ఐన దగ్గరి నుండి అందులోని Participants గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.. ధనరాజ్ గారు తెరమీద కమేడియన్ యే కావచ్చు కాని తెర వెనుక మాత్రం తన జీవితాన్ని ఉన్నతంగా ఒక్కో ఇటుక పేర్చుకుంటు నిర్మించుకుంటున్న ఓ పోరాట యోధుడు.

1. నాన్న లారీ డ్రైవర్: ధనరాజ్ గారి అమ్మ నాన్నలు పెళ్ళికి ముందు ఆర్ధికంగా సంపన్నులైనా గాని వారిద్దరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవడంతో ఇద్దరి కుటుంబాల నుండి సహకారం రావడం పూర్తిగా ఆగిపోయింది. అమ్మనాన్నలకు ధనరాజ్ గారు ఒక్కడే కొడుకు. నాన్న లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. నాన్నకు కాస్త తాగుడు అలవాటు ఎక్కువగా ఉండడంతో ఓ ప్రమాదంలో చనిపోవడంతో అమ్మ ఒంటి చేత్తో చాలా కష్టపడి పెంచారు.

2. ఇంటి నుండి పారిపోయారు: ధనరాజ్ గారికి చిన్నతనం నుండి సినిమాల మీద పిచ్చి పెరగడానికి గల ప్రధాన కారణం "వారి ఇంటి గోడల మీద సినిమా పోస్టర్లు అంటించడం". అవును.. కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి ఆ పోస్టర్లను చూస్తూ తనని తాను హీరోలా తన ఊహాలోకంలో ఊహించుకునే వారు. 10క్లాస్ పరీక్షలు రాసేసాక(రిజల్ట్స్ కూడా రాకముందే) ఇంట్లో నుండి 400 రూపాయలు తీసుకుని, అమ్మకు చెప్పకుండా లారీ ఎక్కి హైదరాబాద్ కు వచ్చేశారు.

3. సర్వర్ గా: హైదరాబాద్ కు వచ్చేస్తే, సినిమా వాళ్ళను కలిసేస్తే అవకాశాలు సులభంగా వచ్చేస్తాయని అనుకున్నారు కాని ఇక్కడ పరిస్థితి తన ఊహకందనంత దారుణంగా ఉంది. తెలిసినవారు అంతగా ఎవరూ లేరు, భోజనానికి ఎన్నో అవస్థలు పడ్డారు. సినిమాలో అవకాశాలు రావాలంటే ముందు నేను బ్రతకాలి, పోరాడాలి.! అని కాకతీయ మెస్(ఆనంద్ సినీ సర్వీస్ పక్కన)లో సర్వర్ గా పనిచేశారు. ఒక పక్క సర్వర్ గా పనిచేస్తూనే మరోపక్క అవకాశాల కోసం ప్రయత్నించేవారు. కొన్నాళ్ళకు ఓ ఫిల్మ్ స్కూల్ లో పనిచేస్తూ అక్కడే నటన నేర్చుకున్నారు. అమ్మగారు కూడా హైదరాబాద్ కు వచ్చి అపోలో హాస్పిటల్ లో ఆయాగా పనిచేశారు.

4. మెదటి సినిమా: మన ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు అలా ధనరాజ్ గారికి కూడా. జై సినిమా కోసం 1,000మందిని ఆడిషన్స్ చేశాక అందులో నుండి 12మందిని సెలెక్ట్ చేశారు. వారిలో హీరో నవదీప్, వేణు మొదలైనవారిలో ధనరాజ్ గారు కూడా ఒకరు.

5. ప్రేమ వివాహం: ప్రేమ వివాహం అంటే నెలలు, సంవత్సరాల ప్రేమ కాదు.. భార్య శిరీష గారిని ఉదయం చూసి సాయంత్రం ప్రపోజ్ చేసేసారు అంతే.. ఆ తర్వాత కొన్ని రోజులకు శిరీష గారు మనస్పూర్తిగా ఒప్పుకున్నారు. కాని అంతకు ముందు ఒక విపత్కర సంఘటన జరిగింది. శిరీష గారికి ప్రపోజ్ చేసినరోజే ధనరాజ్ గారి అమ్మగారు చనిపోయారు.

6. అంతిమ సంస్కారాలకు రూపాయి కూడా లేదు: ఒక పక్క అమ్మ చనిపోయిందని గుండె పగిలేలా రోదించాలా.? లేదంటే దహణ సంస్కారాలకు డబ్బు లేదని భయపడాలా, తనని తాను నిందించుకోవాలా.? అనే అత్యంత హృదయ విదారకమైన పరిస్థితి అతనిది ఇలాంటి పరిస్థితి పగవానికి కూడా రాకూడదు. అదే శిరీష గారు వెంటనే స్పందించి తన దగ్గరున్న గాజులు, పట్టీలు, చెవి కమ్మలు ధనరాజ్ గారి మిత్రులకు అందించి తల్లి అంతిమ సంస్కారాలకు సహాయం చేశారు. తన జీవితంలో అమ్మ వెళ్ళిపోయాక మళ్ళి అంతే ప్రేమను అందించడానికి శిరీష వచ్చిందని సంతోషిస్తూ హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో ఆత్మీయుల సమక్షంలో వారిద్దరు పెళ్ళిచేసుకున్నారు.

7. నిర్మాతగా, హీరోగా: చిన్న చిన్న వేసుకుంటూ అట్టడుగు స్థాయి నుండి వచ్చి మొదటిసారి మరో ప్రొడ్యూసర్ తో కలిసి "ధనలక్ష్మి తలుపు తడితే" సినిమాను ప్రొడ్యూస్ చేశారు. హీరోగా బంతిపూల జానకి, AK Rao PK Rao, పనిలేని పులిరాజు లాంటి సినిమాలలో నటించి ఎప్పటికైనా హీరో అవ్వాలనే కోరికను తీర్చుకున్నారు.

8. సుకురామ్: జగడం సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా గాని ఆ సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన ధనరాజ్ గారికి మాత్రం మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా వల్లనే మొదట ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయని ఇప్పటికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటారు. ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో రామ్ గారి మీద ప్రేమ, గౌరవంతో తన కొడుకుకు "సుకురామ్" అని పేరు పెట్టుకున్నారు.

9. కెరీర్ బెస్ట్ రోల్: ఓ సాధారణ కమేడియన్ ఆడియన్స్ ని నవ్వించగలడేమో కాని, ఒక గొప్ప నటుడు మాత్రం ఎంత నవ్వించగలరో అంతే స్థాయిలో ఏడిపించగలరు. పిల్లజమిందార్ సినిమాలో అప్పటి వరకు నవ్వించి క్లైమాక్స్ లో ఆడియెన్స్ గుండె బరువెక్కేలా నటించడం ద్వారా ధనరాజ్ గారికి చాలామంచి పేరు వచ్చింది. ఆ సీన్ చేస్తున్నప్పుడు తన తల్లిని, తల్లి మరణాన్ని గుర్తుచేసుకుని ఏ గ్లిజరిన్ వాడకుండా కడుపునిండా ఏడుస్తూ చేశారాట.