What If You Look More Beautiful In The Mirror? – A Short Story : Part 2

Updated on
What If You Look More Beautiful In The Mirror? – A Short Story : Part 2

Contributed By Nimmagadda Saroja

Part 1 : Click here

మైత్రి, అనూష , ప్రవల్లిక,రవి,శ్రీకాంత్ ,అభి అంతా వచ్చేశారు. ప్రతి ఒక్కరివీ పలకరింపులూ, నువ్వు వస్తున్నావని నాకు చెప్పలేదు అంటే నాకు చెప్పలేదు అని నిందలు అయ్యి, అందరికీ రమ్య సర్దిచెప్పే సరికి సాయంత్రం అవ్వనే అయ్యింది. అనూష లేచి మొహం కడుక్కుందాం అని బాత్రూం కి వెళ్ళింది, అక్కడనుండి ఫేస్ ప్యాక్ వేసుకోటం కోసం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది, అందులోని అద్దం లో తనని తాను చూసి ఎందుకో చాలా అందంగా కనిపిస్తున్నా అనుకుంది, పొద్దున్న నుంచి ఎండలో తిరుగుతూనే ఉన్నా కానీ ఇలా ఎలా ఉన్నాను అనుకుని, తన మొహం అద్దానికి దగ్గరగా పెట్టి చూసుకుంది, ఎప్పటి నుంచో తనకు ఉన్న అమ్మ వారు పోసినప్పటి మచ్చ కనిపించటమే లేదు .. తనకు డౌట్ వచ్చి తన బాగ్ లోని అద్దం లో చూసుకుంది అందులో తన మచ్చ కనిపిస్తోంది, ఎదో తెలియని ఒక చిన్న భయం తనలో మొదలయ్యినా ,దానిని పట్టించుకోకుండా , తన పేస్ ప్యాక్ తీసి, కలప సాగింది. అద్దం లోని అనూష మాత్రం తల దించుకున్న అనూషను చూస్తూనే ఉంది.

" పైకెత్తని ఆ రెప్పలు నిన్ను సూటిగా చూస్తుంటాయి ... మునుపెన్నడు చూడని కలలను చూద్దువు రమ్మంటాయి "

అంటూ ఎక్కడ నుంచో అనూషకు పాట వినిపించ సాగింది, తనలో ఎదో తెలియని భయం చిన్నగా బలపడ సాగింది .. తన ముఖానికి కొంచెం మాస్క్ పూసుకొని .. ఎందుకో తన బింబం తనను చూస్తున్నట్టు అనిపించి తల పైకి ఎత్తి చూసింది .. అద్దం లోని అమ్మాయి తనలానే ఉంది, కానీ ఆమె చాలా అందంగా ఉంది ఇది నిజమేనా ?!అని తన మొహం తాను తాక గానే ఫేస్ ప్యాక్ ఉంది అని గుర్తొచ్చింది .. కానీ అద్దం లోని అమ్మాయి ముఖానికి అది లేదు! తను కంగారు పడుతోంది కానీ అద్దం లోని అనూష నవ్వుతోంది .. అనూషకి భయం తో ఒళ్ళంతా చెమటలు పట్టి .. గట్టిగా అరచి కుప్పకూలిపోయింది. ఐనా అద్దం లోని ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది...

ఆమె అరుపు వినగానే, అందరూ ముందు గది లోంచి పరిగెట్టుకొని వచ్చారు. అనూష ని తట్టి లేపి ఏమైంది అని అడిగారు, ఆమె నెమ్మదిగా లేచి కిందనే కూర్చొని, అద్దం వైపు చూసింది. "ఏంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న తరువాత అద్దంలో నీ మొహం నువ్వే చూసుకొని దడుచుకున్నావా ?" అంది ప్రవల్లిక వెటకారంగా. 'అదే నిజం అని చెప్పినా వీళ్ళు నమ్ముతారా?' అని అనుకుంది అనూష . ఇది తన ఊహ అయితే బాగుండు అనుకుంటూ , వాష్రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. అందరూ ఇంకా అక్కడే ఉన్నారు, అనూషకి ఏమైందా అని కొంచెం ఆదుర్దాగానే ఉన్నారు, అనూష కి కూడా ఈ విషయం తెలుసు అందుకే వస్తూ వస్తూనే తన డైట్ గురించి తన మీద తానే " అన్నీ తింటే లావైపోతాం , కొంచెం తగ్గించి తిన్నా , ఇదిగో ఇలా నీరసం వచ్చి ఏడుస్తాం .. ఎలాగే బాబు చచ్చేది " అని ఒక మాట విసురుకుంది. "నీకేమన్నా ఇది కొత్తా నే? ఇది మొన్న ఏం చేసిందో తెలుసా రమ్య ? డ్రెస్ మార్చుకుంటా అని చెప్పి గది లోకి పోయి కెవ్వున అరిచింది, ఏంటో అని వెళ్ళి చూస్తే, పాపకి డ్రెస్ టైట్ అయ్యిపోయింది అంట! తిండి మానుతుందేమో కానీ ఒక్క రోజు కూడా జిం మానదు, ఎమన్నా అంటే నీకేం తెలుసే మానేసిన తరువాత రోజు నాకు తెలుస్తుంది తేడా అని అంటుంది " అని ముగించింది మైత్రి." అబ్బా ! చల్లేండి దాన్ని వేసుకున్నది. మీరేమన్నా తక్కువా ? స్విమ్మింగ్ నేర్చుకో అంటే , ఆమ్మో నీళ్ళలో దిగితే నల్లగా అయ్యిపోతాను అని ఒకళ్ళు అంటారు, మారథాన్ కి పోదాం అంటే ఎండ కి rashes వస్తాయి అని ఒకళ్ళు అంటారు .. మరి రమ్య అయితే ఇంకా సూపర్, ఎప్పుడో అమ్మ గారికి మూడ్ వస్తే తప్ప కార్ window తెరవరు, ఎమన్నా అంటే జుట్టు చెదిరిపోతుంది అంట అందరరూ అందరే ! " అని అన్నాడు శ్రీకాంత్.

" నాకు ఆకలి వేస్తుందిరా , పదండి బయట తిని వద్దాం " అని అన్నాడు రవి. " నీ టైమింగ్ ఏ టైమింగ్ రా , ఎవ్వరు ఏమైపోయినా మన గడ్డి మనకు పడాల్సిందే " అని రవి వీపు మీద చిన్నగా చరిచాడు మనీష్. అనూష కి కూడా ఇక్కడ ఉండటం కంటే బయటకు వెళ్ళటమే మంచిది అనిపించింది, " తినేసి వద్దాం అబ్బా !" అని అంది. అందరూ అన్నీ మాట్లాడుతున్నారు కానీ రమ్య మాత్రం, అనూషనే చూస్తోంది. తనకు కూడా ఎదో తెలియని ఒక భయం గుండెల్లో బయలుదేరింది. అంతా ముందు గదిలోకి వెళ్తుంటే, రమ్య , అనూష మాత్రం ఒక్క సారి వెనక్కి తిరిగి అద్దం లో చూశారు, ఎదో తెలియని భయం తో వారిద్దరికీ చిరు చెమటలు పట్టాయి, పెదాలు వణుకుతున్నాయి.. అద్దం లో తమకన్నా ఎంతో అందంగా కనిపిస్తున్న రమ్య, అనూష పెదాలు కూడా వణుకుతున్నాయి .. అసలైన రమ్య కీ అనూష కీ

" వణికే ఆ పెదవులు ఏవో కబులురు చెబుతుంటాయి .. విన్నానని అనుకున్నవి అన్ని నిజం అని నమ్మిస్తాయి"

అని సన్నగా పాట వినబడుతోంది.. ఖంగారు పడి, గుండెలు వేగంగా కొట్టుకుంటుంటే ఇద్దరూ నోరు తెరచి ఒకరిని ఒకరు చూసుకున్నారు, ఏం మాట్లాడకుండా, అందరూ ఉన్న చోట కి వెళ్ళి, తలుపు తాళం వేసి బయటకి వెళ్ళారు .. అప్పుడు కూడా పాట వినిపించ సాగింది

"ఇటు రానని ఆవలి అంచున నిలిచే ఉంటుంది.. కాలానికి ఎదురీదే లా కవ్విస్తుంటుంది తానెవ్వరు అంటే ... అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి నిద్దురకే తెలిసే నడి రేయి."

కిందకు దిగి నడిచే అప్పుడు, రమ్య పక్కన అనూష నడుస్తూ, " రమ్య, నాకు ఆ ఇంట్లో ఏంటో చాలా uneasyగా ఉందే !" ఇంత వరకు తనలో తానే అనుకొని పైకి చెప్పకుండా ఎదో ఒకటి సర్ది చెప్పుకున్న నిజాన్ని , పైకి అనేసింది అనూష , ఇంక రమ్య కి తప్పలేదు " నేను మహా ఉన్నదే 6 గంటలు అయినా నాకు అలానే అనిపిస్తుందే , కానీ ఈ పారానార్మల్ స్టఫ్ అంతా నమ్మచ్చా ? లేదంటే ఏదన్నా నేనే ఊహించుకుంటున్నానా అని అనిపిస్తుందే " అని అంది. " లుక్! నీకు తెలుసు, I am ది మోస్ట్ ప్రాక్టికల్ పర్సన్ యు know రైట్! అండ్ ఐ డోంట్ ఫీల్ సేఫ్ there . పారానార్మల్ ఆ కాదా నాకు తెలియదు, there is something wrong with that mirror. naa reflection nannu choosi నవ్వుతోంది! that too while I am trembling and that is not normal. " అని అంది అనూష. " ఏం చేద్దాం ? నేను ఇక్కడే ఉండాలి కదా, ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ , దిగకుండానే నన్ను వెళ్ళిపోమంటావా? " అని అడిగింది రమ్య. " ఛా ! అలా కాదు, అసలు విషయం ఏంటి, what's wrong అని తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళిపోయినా ఆఫీస్ వాళ్లకు కాకున్నా మనకు మనం justify చేసుకోవాలి కదా ?"

ఇంతలో watchman కనపడటం తో రమ్య, అనూష ఆగి అడిగారు - " 506 లో ఇంతక ముందు ఎవరు ఉండే వారు? " "సతీష్ సార్ , స్వర్ణ మేడం ఉండే వారండి." " ఎందుకు ఖాళీ చేశారో తెలుసా నీకు" అని అడిగింది అనూష. "పాప పుట్టిన తరువాత, స్వర్ణ మేడం చనిపోయారు అండి.." అనూష , రమ్య ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. " ఎలా చనిపోయారు?" " పాప పుట్టాక రెండు నెలలకి జబ్బు చేసి చనిపోయారు" " ఆత్మ హత్య చేసుకుంది అంటావా? నువ్వేం అనుకుంటున్నావు ? " అని అడిగింది రమ్య. " ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీ, ఇల్లు చక్కగా ఉంటుంది ఇవన్నీ మనసులో పెట్టుకొని రాత్రుళ్లు నిద్ర చెడగొట్టుకోటం తప్ప!" అన్నాడు అతను.

"ప్రవచనాలు మాని అడిగింది చెప్పు " అని అంది అనూష చిరాగ్గా. " నాకు తెలియదండి! వాళ్ళిద్దరూ బానే ఉండే వారు, ఆవిడ అయితే సినిమా హీరోయిన్లా ఉండేది, అస్సల ఆమె ఏ రోజూ మాములు మనిషిలా ఉంది అని నాకు ఎప్పుడూ అనిపించలేదు, ఎప్పుడు చూసినా అందం గానే ఉండేది, నవ్వుతూనే ఉండేది. ఆమె ఎదో దేవలోకం నుంచి వచ్చిందేమో అందుకే మనిషి బాధలు ఆమె కు లేవేమో అనుకునే వాడిని , నేనే కాదు మా ఇంటిది కూడా అలానే అనుకునేది .. ఆ మనిషి లో అలుపు , సొలుపూ, నీరసం, అసల జుట్టు పక్కకు చేరగటం మేము చూసి ఎరుగం! ఆయన కూడా ఆమెను బాగానే చూసుకునే వారు. ఇద్దరరూ సంతోషంగానే ఉండే వారు. ఏమైందో ఏమో ఒక రోజు ఆమె చనిపోయారు, జబ్బు వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే దారిలోనే చనిపోయారు" ఎందుకు అడగాలి అనిపించిందో రమ్య కి "బెడఁరూం లో అద్దం ఎప్పుడు బాగు చేపించారు?" అని అడిగింది. Watchman కొంచెం అలోచించి,

" రెండు రోజుల ముందే మేడం! స్వర్ణ మేడం చనిపోయాక సార్ ఒక నెల రోజులు ఉన్నారు, తరువాత ఇక్కడ ఉండలేను అని ఖాళీ చేసి వెళ్ళారు, అయన వెళ్ళాక చూస్తే అద్దం పగిలి ఉంది, ఏం చెయ్యగలం? అసలే ఆయన బాధల్లో ఉన్నారని మా ఓనర్ గారే మీ కంపెనీ వాళ్ళకి ఇచ్చే ముందు అద్దం వేయించమన్నారు"

" ఓయ్ !! వచ్చేది ఉందా లేదా మీ ఇద్దరూ ? నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను, ఏమయ్యారో అని?" అంటూ గేట్ బయట వీధిలోంచి మనీష్ అరుస్తున్నాడు. "ya! coming." అని బయలుదేరారు రమ్య,అనూష. " వీళ్లందరికీ చెప్పాలంటావా?" అంది రమ్య చిన్నగా " నమ్మితే అనవసరంగా ఖంగారు పడతారు, లేదంటే ఉత్తినే ఏడిపిస్తారు, రెండూ చిరాకు బేరాలే! లైట్ తీసుకో. we will figure something out" అని అంది అనూష. అంతా కలిసి restaurant లో భోజనం చేసే సరికి రాత్రి 9:30 అయ్యింది. ఒక్కొక్కరూ రేపు ఉదయం వస్తాం అంటూ బయలుదేరారు. " నువ్వూ మాతో రావచ్చుగా రమ్య, ఒక్క దానివే ఖాళీ ఫ్లాట్ లో ఏం ఉంటావ్? మా ఇంటికి రా " అని అంది మైత్రి. " లేదు లేవే , నాకు కూడా అలవాటు అవ్వాలి కదా!" " నేను ఉంటా తనతో ఎలాగూ మా ఇల్లు దగ్గరేగా! రేపు మార్నింగ్ మీరు వచ్చాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా" అని అంది అనూష. " గుడ్! నేను మీ ఇద్దరికీ అపార్ట్మెంట్ దాకా తోడు వస్తాను ! నా కార్ కూడా ఎలాగూ అక్కడే ఉంది కదా, తీసుకొని వెళ్తా " అని అన్నాడు మనీష్.

అనూష, రమ్య , మనీష్ కలిసి అపార్ట్మెంట్ వరకు వచ్చారు, మనీష్ తన కార్ తీసుకొని, రేపు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను గేట్ దాటిన తరువాత రమ్య కి గుబులు పుట్టుకొచ్చింది. ఉండమంటే బాగుండేదేమో, ఇప్పుడు పైకి వెళ్ళాలంటే భయంగా ఉంది! పోనీ ఫోన్ చేసి పిలిస్తే? చి ఛి ! ఎంత సిల్లీ గా ఉంటుంది! అనుకుంది. అనూష watchman దగ్గరకు వెళ్దాం అని సైగ చేసింది.

సశేషం