Contributed By Hari Atthaluri
ఒక రోజు టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేస్తూ ఉన్నాను... ఒక్క పెద్దావిడ అలాగే చూస్తూ ఉంది... చేతిలో ఓ సంచి... ఓపిక లేని కళ్ళు... నిలబడ నివ్వని కాళ్ళు...
సరేలే అని వెళ్లి అమ్మా ఆకలి వేస్తుందా ! టిఫిన్ చేస్తారా అని అడిగాను...! వద్దు బాబు ఆకలి లేదు అంది... ఓపిక లేక ఇలా కూర్చున్నా అంది... కాని నాకు నమ్మ బుద్ధి కాలేదు... పర్లేదు అమ్మా! మీ మనవడినే అనుకోండి... తినండి అన్నా..ఆవిడ ససేమిరా ఒప్పుకోల...
నా బలవంతం మీద అడిగితే ఒక్క టీ ఇప్పించు బాబు చాలు అన్నారు.... సరే అని ఒక టీ తెచ్చి ఇచ్చా... తాగక నిజం చెప్పనా బాబు... నాకు ఆకలి వేస్తుంది... పెట్టి చెయ్యే కాని నాది అడిగిన చెయ్యి కాదు... నువ్ తిను అన్నా అందుకే తినలేకపోయా...
ఈ వయసులో ఈ ముసలి దానితో ఎవరికీ అవసరం లేదు... పిల్లలు కూడా చుట్టాలు అయిపో యారు... ఎప్పుడో ఓ సారి అలా వస్తారు... ఏం చేస్తాం బాబు.. వాళ్ళ బతుకులు వాళ్ళవి...ఏం అనలేం...
పని మీద ఈ పక్కనే ఉన్న తాలూకా ఆఫీస్ దాకా వచ్చా.... ఎవరు లేరు కదా, నేనే రావాల్సి వచ్చింది.... తీరా వచ్చాక చూస్తే ఉన్న ఒక్క వంద నోటూ ఏకడో జారి పడిపోయింది అనుకుంటా ! ఆ పని ఐయ్యేసరికి యే పొద్దో పోతుంది.... ఈ గుక్క టీ పడితే అందాకా ఆకలి వేయదు... అందుకే టీ ఇప్పించమన్నా బాబు..ఏం అనుకోకు అంది....
నాకు ఏం మాట్లాడాలో అర్దం కాల... టీ తాగి అమ్మా నాన్న ని బాగా చూస్కో బాబూ అంటూ తను అలా అడుగు తీసి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే... ఆలోచన లతో నేను అక్కడే ఆగిపోయాను.... ఒక్క టీ తో తన ఆకలి ని చంపుకుని... నాక్కూడా ఇబ్బంది కాకూడదు అనే తన సంస్కారం ముందు... ఈ వయసు లో కూడా బిడ్డ కి భారం కాకూడదు అనుకునే తన అమ్మతనం ముందు నేను ఏంత అనిపించింది....!!
మనకు అన్నీ మన అమ్మా నాన్నా యే టైం కి ఇస్తున్నారు.... అడిగింది ఐనా.. అడగంది ఐనా.. కొందరికి వెంటనే...కొందరకి లేట్ గా ఐనా దొరుకుతుంది.... కష్టం ఐనా.. కూడ బెట్టి మరీ.. మనకి మంచి జీవితం ఇవ్వాలి అనే వాళ్ళ జీవితాంతం అనుకుంటారు.... ఇలా అన్ని ఈజీ గా వెంటనే దొరకటం తో....అలాంటి పేరెంట్స్ ఉండటం మనకి ఎంత అదృష్టమో ఎవ్వరికీ అర్థం కావట్ల.... ఊరికే వస్తుంది లే అనుకుంటున్నారు.... చిన్నప్పుడు మై డాడ్ ఈజ్ గ్రేట్... ఐ లవ్ మై మామ్ అనే వాళ్ళు పెరిగే కొద్దీ ఎందుకు మారిపోతున్నారు...??? ఇపుడు చిన్న తప్పు జరిగినా వాళ్ళ పైన చిర్రు బుర్రు లు ఆడుతున్నాం... చిన్న చిన్న వాటికి కూడా పెద్ద గా విసుకుంటున్నాం....!! ఏం తెలియదు అన్నట్టు ప్రతి దానికి నువ్ మాట్లాడకు అంటున్నాం... వయసు వచ్చేకొద్ధి వాళ్ళ చాదస్తం కన్నా ముందే మన సహనం తగ్గిపోతుంది.. మన అదృష్టం కాస్తా ఇపుడు మనకు మహా భారం లా కనిపిస్తుంది... ఎందుకు ?? ఆలోచించండి....!!!!! అమ్మా నాన్న లేని వాళ్ళతో చూసుకుంటే మనకి దేవుడు ఎంతో కొంత మంచే చేశాడు....!! ఆ విధంగా అదృష్ట వంతులమే.... ఇది ఎంత మందికి అర్దం అవుతుంది...?? ఎంత మంది దాన్ని చివర వరకు అదృష్టం గానే అనుకుంటున్నారు ???