సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల ఉంటే మనం ఏది చేయాలనుకున్నా చేసేవవచ్చు.. ఇది అందరికి తెలిసిన విషయమే.. కాకపోతే సక్సెస్ అవుతామా.? మిగిలిన వారు ఏమనుకుంటారు.? ఇలాంటి రకరకాల భయాలతో చాలామంది తమ ఆశలను, ఆశయాలను వదులుకుంటున్నారు. భయపడటం వేరు జాగ్రత్త పడటం వేరు. గృహిణి ఐన శ్రావాణి గారికి కూడా మొదట్లో చాలా రకాలుగా భయపడ్డారు కాని ఆ భయంతో జాగ్రత్తలు తీసుకుని తను ఊహించిన సక్సెస్ అందుకున్నారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/1-1-5_2017-08.jpg)
ఒక ఆలోచన: ప్రతి మనిషి మదిలో ప్రతిరోజు ఎన్నో వేల ఆలోచనలు వస్తుంటాయి కాని వాటిలో కొన్ని మాత్రమే ఆచరణలోకి వెళ్ళి అమలవుతాయి. ఇంట్లో శ్రావణి గారి పిల్లలు ఏడిచినప్పుడు వారి ఏడుపు ఆపుచేయడానికి "చిక్కీలు" కొనిచ్చేవారు. మిగిలినవి కాకుండా పిల్లలకు అవి బాగా నచ్చడంతో వాటినే కొనిచ్చేవారు. ఈ ప్రయాణంలోనే తనకో అద్భుతమైన ఆలోచన తట్టింది. నేనే ఎందుకు ఇంట్లో వీటిని తయారుచేసి అమ్మకూడదు.? అని. ఆలోచన రాగనే కుటుంబ సభ్యులతో చర్చించి చిక్కీల గురించి వాటి మార్కెటింగ్ గురించి ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి సంస్థను స్టార్ట్ చేశారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/3-1-4_2017-08.jpg)
మార్కెటింగ్: ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు వాటిని సరైన విధంగా మార్కెటింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ విధానమే తెలియక మన రైతులు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. శ్రావణి గారు ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా చిన్నగానే మొదలుపెట్టారు. Mouth Publicityకి మించిన పబ్లిసిటి మరేమి ఉండదు, దీనిని గుర్తించే చిక్కీలను నాణ్యమైన ఆహార పదర్ధాలతో చేస్తున్నారు. ఇందులో వాడే బెల్లం, పల్లీలను నిశితంగా పరిశీలించిన తర్వాతే చిక్కీలు తయారుచేస్తున్నారు. చిక్కీలకు మంచి పేరు రావడం, ఆర్డర్లు పెరగిన తర్వాత దీనిని మరింత విస్తరించారు. మంచి ప్రణాలికలతో ప్రస్తుతం తన ఉహకందంత సక్సెస్ ను అందుకుంటున్నారు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/4-1-4_2017-08.jpg)