అఖిల్ ఎన్నంశెట్టి తెలంగాణ కోవిడ్19 కు సంబంధించి విజయవంతంగా కోలుకున్న పేషేంట్ (నంబర్ 16). ఎక్కడ ఏ ఒక్కరికి ఇబ్బంది కలుగకుండా వాలంటరీగా టెస్ట్ చేయించుకున్న రెస్పాన్సిబుల్ సిటిజన్. వైరస్ సోకిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యేంతవరకు తన అనుభవాలు మనతో పంచుకున్నారు. అఖిల్ ప్రస్తుతం బ్రిటన్ లోని "ఎడిన్‌బరో యూనివర్సిటీలో మానవ హక్కుల న్యాయశస్త్రంలో ఎల్.ఎల్. ఎం" చదువుతున్నారు.

1. Covid 19 కు సంబంధించిన Symptoms జలుబు, దగ్గు, జ్వరం వస్తున్నప్పుడు, ఇంకా మీకు పాజిటీవ్ రాగానే మీ మానసిక పరిస్తితి ఏంటి.? నాకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఏమి రాలేదు. కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ అది భయపెట్టేంత లేదు. నేను బ్రిటన్ నుండి హైదరాబాద్ లో ల్యాండ్ కాగానే మిగిలిన వారి గురించి ఆలోచించి నా అంతట నేను హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకున్నాను. ఇది జస్ట్ ఫార్మాలిటీ అంతే అనుకున్నాను కానీ ఎక్కడో చిన్న అనుమానం ఐతే ఉంది. ఎలాగూ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు నెగిటివ్ వస్తుంది అని అదే మూడ్ లో ఉన్నాను. కానీ పాజిటీవ్ వచ్చింది నాకు ఈ విషయం తెలిసిన వెంటనే సైలెంట్ అయిపోయాను, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకున్నాను.
2. అమ్మనాన్నలు కానీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంటి చుట్టుపక్కల వారు మీకు కోవిడ్19 సోకిందని తెలియగానే వారు ఎలా రియాక్ట్ అయ్యారు.? మా నాన్న ప్రొఫెసర్. ఈ విషయం పై నాలెడ్జ్ ఉంది. అయినా కానీ కొడుక్కి ఇలా అయ్యేసరికి కాస్త కంగారుపడ్డారు. నేను వస్తున్న దేశంలో వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారన్న అనుమానం నాకు ఉంది. నేను వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యాను, ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకూడదు ఫస్ట్ హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేసుకోవాలి ఆ తర్వాతనే వరంగల్ వెళ్లాలని. ఒకవేళ నేను ఏ టెస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి అక్కడ వైరస్ బయటపడి ఉంటే కనుక వారిని ఇబ్బందిపెట్టేవాడిని. ఇంటికి రాకుండా డైరెక్ట్ హాస్పిటల్ కు వెళ్లినందుకు, ఇంత రెస్పాన్సిబుల్ గా ఆలోచించునందుకు అందరూ నా పట్ల గర్వంగా ఉన్నారు. డాక్టర్లు కూడా ఒక మాట అన్నారు "అఖిల్ నీ వల్ల ఏ ఒక్కరికి వైరస్ సోకలేదు" అని.. నేను ఒక్కడినే కాదు నాలాగా జాగ్రత్తలు తీసుకున్నవారు చాలామంది ఉన్నారు.
3. అది కెరీర్ కానీ, హెల్త్ పరంగా కానీ మనం స్ట్రాంగ్ గా ఉంటేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మనం భయపడితే కనుక మన Immunity power తగ్గిపోతుంది, మీరు ఎలా స్ట్రాంగ్ గా ఉండగలిగారు.? నాకు స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, నా 24 ఏళ్ల జీవితంలో నేను మొట్టమొదటిసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది కూడా దీని వల్ల. నాకు తెలుసు మనం కంగారు పడితే కనుక ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుందని. నేను ఎక్కువగా పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించాను. ప్రతిరోజు మంచి ఫుడ్ తో పాటు ప్రాణాయామం లాంటివి కూడా చేసేవాడిని. అలాగే నా పక్కన ఉన్న పేషంట్లను కూడా మొటివేషన్ చెయ్యడం వల్ల కూడా నేను స్ట్రాంగ్ గా ఉండగలిగాను.
4. ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది, 'వామ్మో గవర్నమెంట్ హాస్పిటల్ హా!!' ప్రైవేట్ కు వెళ్తే బాగుంటుందని మీరు అనుకున్నారా.?'
ఇందాకనే చెప్పాను కదా నా లైఫ్ లో మొట్టమొదటిసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది దీనివల్లనే అని.. నాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అనుమానం కలిగింది, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎలా మనతో రిలేషన్ మెయింటైన్ చేస్తారు అని. మీరు నమ్ముతారో లేదో కానీ నేను గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ ఐన మొదటిరోజు వాష్ రూమ్ వెళ్ళడానికి గంటసేపు ఆలోచించాను, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ అలా ఏమీ లేదండి వాష్ రూమ్ కానీ, మేము ఉంటున్న ఐసోలేషన్ వార్డు కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రతిరోజు వివిధ రకాలైన ఆరోగ్యకరమైన భోజనంతో పాటు డాక్టర్లు ఇక్కడి నర్సులు చాలా జాగ్రత్తగా పేషంట్ల పట్ల మెలుగుతున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని నేను ఏ మాత్రము మొదట ఊహించలేకపోయాను.
5. కోవిడ్19 సోకినప్పుడు మీ శరీరం ఎలా ఉండేది.? అంటే ఇబ్బందులు కానీ మరే ఇతర బాధలు ఎలా ఉండేవి.?
నా ఇమ్మ్యూనిటి పవర్ ఎక్కువగా ఉండడం వల్ల నేను టెస్ట్ చేయించుకునే ముందు నుండి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ ఐన తర్వాత కూడా జలుబు దగ్గు జ్వరం లాంటివి అంతగా ఇబ్బంది పెట్టలేదు. సాయంత్రం పూట ఐతే నాలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగేది, మళ్ళీ మామూలుగానే ఉండేది.
6. ఒక్కసారి క్యూర్ అయినంత మాత్రాన మళ్ళీ రాదు అని చెప్పలేము. తెలంగాణలో కూడా పాజిటీవ్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. ప్రజెంట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.?
ఒకప్పుడు జలుబు అనేది ప్రాణాంతకరమైనది కానీ మన పెద్దవాళ్ళు తట్టుకుని ఉండడం, వారి జీన్స్ మనకు వచ్చి మనం స్ట్రాంగ్ గా ఉంటున్నాం, ఇప్పుడు దానికి టాబ్లెట్ కూడా వాడడం లేదు. మన శరీరం ఒక కొత్త రకమైన వైరస్ తో పోరాడింది కాబట్టి ఇంకోసారి అటాక్ అయిన వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమయ్యే యాంటీ బాడీస్ కూడా డేవేలప్ అవుతాయి. ఈ వైరస్ కూడా భవిషత్ లో ఉండకపోవచ్చు. అయినా కానీ ఇది మొదటిసారి వచ్చింది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. నేను మా ఇంట్లో సెపరేట్ రూమ్ లో ఉండడంతో పాటు మంచి భోజనం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలాగే నేను డిశ్చార్జ్ అయ్యేరోజే డాక్టర్స్ కూడా చెప్పారు "యువర్ హెల్దీ రికవర్డ్ పర్సన్, నీ బాడీలో యాంటీ బాడీస్ కూడా డెవలెప్ అయ్యాయి, ఫ్యూచర్ లో ఎవరైనా క్రిటికల్ గా ఉంటే నీ బాడీలోని ప్లాస్మా తీసుకుని వారికి ఇంజెక్ట్ చేస్తాము. దీని వల్ల నీ బాడీలో డెవలెప్ అయినట్టుగా వారిలోనూ యాంటీ బాడీస్ డెవలెప్ అయ్యి వారు క్యూర్ అవుతారని అడిగారు". నేను 100% రెడీ మీరు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తానని హామీ ఇచ్చాను.
7. మీరు గాంధీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు మిగిలిన కోవిడ్19 పేషేంట్స్ తో మాట్లాడుకునే అవకాశం ఉండేదా.? మాట్లాడుకుంటే ఏమి మాట్లాడుకునేవారు.?
మేము మాట్లాడుకునేవాళ్ళం. హాస్పిటల్ లో ఫోన్ కూడా అనుమతిచ్చేవారు, నేను ధైర్యంగా ఉంటూ నా పక్కన ఉన్న పేషెంట్స్ ను ధైర్యంగా ఉంచడానికి ప్రయత్నించేవాడిని. మీరు చూస్తున్నారు కదా టీవీ ఛానెల్స్ లో క్రికెట్ స్కోర్, ఎలెక్షన్ రిజల్ట్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినట్టుగా స్క్రీన్ మీద "ఎంతమందికి పాజిటీవ్ వచ్చింది, ఎంతమంది చనిపోతున్నారని చూపిస్తున్నారు". బయటి రూమర్స్ ని కూడా హాస్పిటల్ లోకి స్ప్రెడ్ చేస్తున్నారు ఇది భయాన్ని ఇంకా పెంచుతుంది, నాకు వీలు అయినంత వరకు తోటి పేషెంట్స్ కు గైడెన్స్ ఇచ్చేవాడిని. అలాగే సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన పోస్టులు మొదలైనవన్ని చూడడం మానేసాము. ఒక పేషేంట్ ఐతే అడ్మిట్ రోజు చాలా భయపడేవారు, ఆ తర్వాత నా పక్క బెడ్ కు మార్చగానే అతను కామ్ అయ్యారు. దీనికి తన పేరెంట్స్ తో పాటు డాక్టర్స్ కూడా చాలా సంతోషించారు.
8. "మీ వల్లనే మాకు ఇంత కష్టం వచ్చింది, మీ అందరూ కలిసి వైరస్ ను అక్కడి నుండి ఇక్కడికి మోసుకువచ్చారు" అని క్రిటిసైజ్ చేసేవారికి మీ సమాధానం ఏంటి.?
ఇంతకు ముందు ఫారెన్ నుండి వస్తున్నాము అంటే అరేయ్ మాకోసం ఐఫోన్ తీసుకురారా, లాప్ టాప్ తీసుకురారా, నాకు అక్కడ ఒక జాబ్ చూడరా అని అడిగేవారు. పిల్లల కోసం ఫారెన్ సంబంధాలు చూసేవారు, కానీ ఒకేసారి ఇప్పుడు వాళ్ళు దయ్యాలు భూతాలు అయ్యారా.? ఇప్పుడు కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది ఎవ్వరూ కావాలని చెయ్యరు, నాకు వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. బకింగ్ హం ప్యాలస్ లో ఉన్న క్వీన్ కొడుకు యువరాజు కే వైరస్ వచ్చింది, యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ మోస్ట్ ప్రొటెక్షన్ హౌస్ లో ఉంటారు ఆయనకు వచ్చింది. ఇండియా లో ఉన్న గిరిజనుల అభివృద్ధి కోసం చాలా కృషి చేయడానికే నేను హ్యూమన్ రైట్స్ లా పై అధ్యయనం చేస్తున్నాను. నాలా ఇండియా కోసం ఆలోచిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారు వారి బాగుకోసం విదేశాలకి వెళ్లినా అదేం తప్పు కాదు కదా. వచ్చినవారిలో కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నవారు ఉన్నారు. క్వారెంటయిన్ లో ఉంటున్నారు, అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా మా దేశానికి మేము వచ్చినందుకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు.
9. మీరు బ్రిటన్ నుండి వచ్చారు, మీ స్నేహితులు కూడా వివిధ దేశాలలో ఉన్నారు. అన్ని గమనిస్తూనే ఉన్నారు. మీకు నమ్మకం ఉందా మన ఇండియా ఈ వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని బయటపడగలదని.?
మిగిలిన అన్ని దేశాల కన్నా మన దేశం త్వరగా స్పందించి లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. దీని వల్ల ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా ఇండియా సఫర్ అవ్వొచ్చు కానీ ఇలా చెయ్యడం తప్ప మనకు ఇంకొక మార్గం లేదు, ఇప్పుడున్న కేసుల సంఖ్య, మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఇలాగే స్ట్రిక్ట్ గా ఫాలో ఐతే కనుక ఖచ్చితంగా త్వరగానే మనం బయటపడుతాము.