"ఏనాడైతే నా కలం పాఠకులకు నచ్చేవిధంగా కాకుండా నచ్చేవి రాయటం మొదలుపెట్టిందో ఆనాడే నాలోని ఒక రచయిత చచ్చిపోయాడు”
కథ -కలం, నాకు బ్రతుకు నేర్పిందైనా, బ్రతుకుతెరువు చూపించింది అయినా ఇవి రెండు మాత్రమే. కాలం మారేకొంది, అక్షరాన్ని నమ్ముకున్న వారు అందరు అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నాము. ప్రశ్నించాల్సిన మేము, మమల్ని మేము ప్రశ్నించుకుంటున్నాము. కత్తి కన్నా కలం గొప్పది అనే రోజునుంచి కలం కన్నా కాసులు గొప్పవి అనే రోజులకి వచ్చాము.
“ఏం అంటున్నారు సార్? వాళ్ళు చదవాలి అనే కదా రాస్తున్నాము. వాళ్ళు చూడాలి అనే కదా ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని డిబేట్స్ చేస్తున్నాము?”
“జనాలు మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అదే నమ్మకాన్ని మనం సొమ్ము చేస్కుంటున్నాము. ఒకప్పుడు రచయిత పత్రిక కు రాసినా, సినిమాకు రాసినా రచనా స్వతంత్రం ఉండేది. కానీ ఇపుడు మేము అది కోల్పోయాం. జనాలు చూడాలని ఆశతో రాసేవాళ్ళం, జనాలు చుస్తార్లే అనే నిర్లక్ష్యంతో రాస్తున్నాం.”
“సార్, మనం ఒక మంచి వ్యక్తి గురించి రాస్తే ఎవడు చూడడు. అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందో లేదా ఏదో సెలబ్రిటీ మీద రూమర్స్ వేస్తెనే చూస్తారు. మన జేబులు కూడా నిండాలి కదా సార్ ?”
“తప్పు చేస్తున్నాము అని తెలిసినా దాన్ని సరిదిద్దుకోకుండా దాన్ని కవర్ చేయటం మానవ నైజం. కథలు అల్లే మనకు కవర్ చేయటం ఎంత పని. మనం వేస్తాం కాబట్టి వాళ్ళు చూస్తారు అనే ఆలోచననుండి ఎప్పుడు బయటకొస్తామో, అప్పుడు మనలోని రచయిత మరలా బయటకొస్తాడు. నలుగురి కొమ్ముకాసి, నాలుగు రాళ్ళూ వెనకేసుకోవచ్చు అనేది నేటి ఫార్ములా ఆఫ్ జర్నలిజం అయిపోయింది. ఒక మంచి పని చేసే వ్యక్తి కన్నా, నలుగురిపై వ్యగ్యం గా రాయటంలోనో, లేదా నాలుగు బూతులు వాడితేనే ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని ఒక ఊహ మనమే సృష్టించాం. మనం ఇలా ఉన్నాం కాబట్టే దేశ సేవ చేసే వాళ్ళకంటే dubsmashలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు, రచనలు చేయాల్సిన రచయితలం భజనలు చేస్తున్నాము.”
“సార్, జనాలు కూడా కంటెంట్ కంటే కాంట్రవర్సీ లనే ఎక్కువ చూస్తున్నారు. అందుకే కదా మంచి టాపిక్ చూసి వాటి మీద డిబేట్స్ చేస్తున్నాము. రీజినల్ నుండి నేషనల్ మీడియా మొత్తం ఇదే కదా follow అవుతుంది”
“చిన్న సవరణ. Controversy మీద డిబేట్ చేయట్లా, controversy చేసి దాని మీద డిబేట్ చేస్తున్నాము. కామెడీ అంటే స్పూఫ్ లు , డైలాగ్స్ అంటే బూతులు, పబ్లిసిటీ కోసం ఒకరి మీద కామెంట్లు వాటి మీద మనం డిబేట్లు. ఇందుకా ప్రజలు న్యూస్ చూసేది ? ఒక sensible issue మీద opinions తీసుకోరు. మీడియా అంటే గవర్నమెంట్ కి పబ్లిక్ కి ఒక వారధిలాంటిది. ఇపుడు కామెంట్స్ కి controversy కి సారధిలా ayipothundi”
“ నిజమే సార్.. ఒకసారి ఆలోచిస్తే నాకు అర్ధం అవుతుంది. కానీ ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమి లేదు. పైన వారు శాసిస్తారు మనం పాటిస్తాం ప్రజలు అదే చూస్తారు. అలవాటైపోయింది”
“అవును సత్య. మనం మారుద్దాం అని మొదలెట్టిన నా ప్రయత్నం “మనమే మారాలా?” అనే ప్రశ్నతో ఆగిపోయింది. ఆలోచించాల్సిన మనం అలవాటుచేసుకుంటున్నాము, ప్రశ్నించాల్సిన జనం మనం చేస్తుంది చూస్తూ మనల్ని పోషిస్తున్నారు”
“సార్, ఎప్పటికైనా మనం గెలుస్తాం సార్”
“లేదు సత్య, కలలో కూడా నా కలం అసత్యం పలకకూడదు, ఒకడి కొమ్ము కాయకూడదు అనుకునే నేను తప్పు దోవ పట్టాను. అక్షరాన్ని నమ్ముకున్న నేను ఒకరి అత్యాశ అమ్ముడుపోయాను.”
"నేను ఓడిపోయాను సత్యం"