ఇంతకు ముందు డెవలప్మెంట్ పేరుతో ఆరోగ్యాన్ని మరచి స్పీడ్ గా ముందుకు వెళ్ళడంలోనే నిమగ్నమయ్యాము, కాని తర్వాత తప్పు తెలుసుకున్నాము వేగం కన్నా ప్రాణం విలువైనది అని.. అందుకే పెస్టిసైడ్స్ తో పండించిన పంటల కన్నా సాంప్రదాయికంగా మన పెద్దలు అనుసరించిన పద్దతులే గొప్పవని మరోసారి తెలుసుకోవడంతో ఆర్గానిక్ విప్లవం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో యువత కూడా ముందుకు రావడం ఎంతో ఉపయోగకరం..
Necessity Is The Mother Of Invention: హైదరాబాద్ లో ఉంటున్న నవీన్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండేవారు. చిన్నతనం నుండి గ్రామంలో పెరగడం అక్కడ తాజా కూరగాయలు తీసుకోవడంతో అవి కాక ఏవి తిన్నా కాని అంతగా రుచించలేదు. పంట తొందరగా, అధిక సంఖ్యలో పండాలని చెప్పి రకరకాల పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఇలాంటి కూరగాయల వల్ల వారి పిల్లల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ కోసం వెతికారు, కాని అవ్వి చాలా ఖరీదైనవి.. ఇలా కాదు మనమే ఇంట్లో పండిద్దాం అని చెప్పి ప్రయత్నించారు. కాని నాణ్యమైన విత్తనాలు ఎక్కడా దొరకలేదు ఆ తర్వాత అతి కష్టం మీద ఆర్గానిక్ సీడ్స్ దొరికాయి. మేము పడ్డ కష్టం ఇంకా మరెందరో పడి ఉంటారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది భవిషత్తు అంతా ఆర్గానిక్ దే అని భావించి నవీన్ దంపతులు "సీడ్ బాస్కెట్"(7702222398) ను 2016లో స్టార్ట్ చేశారు.
మనం చేసిన రీసెర్చ్ ని బట్టి, ప్రణాళికలను బట్టే సంస్థ జర్ని ఆధారపడి ఉంటుంది. ఆర్గానిక్ సీడ్స్ మీద నెలల పాటు రీసెర్చ్ తో పాటు, నవీన్, చందన గారు "హోమ్ గార్డెన్" కు సంబంధించి కోచింగ్ తీసుకుని మరి ఈ బిజినెస్ లోకి ప్రవేశించారు. అంతేకాదు కేవలం ఒకే చోట ఉండి అమ్మితే అంతగా ఫలితం ఉండదని స్వతహాగ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఐన నవీన్ ఇందుకోసం "సీడ్ బాస్కెట్" సైట్ రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశమంతట ఆర్గానిక్ సీడ్స్ ను ఎగుమతి చేస్తున్నారు.
ఇంట్లోనే పండించవచ్చు: కూరగాయలను పండించాలంటే మనకేం వ్యవసాయ భూమి, ఇంట్లో పెరడు ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఆర్గనిక్ మొక్కలను ఓ కుండీలో పెంచుకోవచ్చు. ప్రతిరోజు మూడు గంటలు ఎండలో ఉంచి మిగిలిన సమయంలో మామూలు చోట ఉంచుకోవచ్చు.
అన్ని రకాల కూరగాయాలు: రైతులు, కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్న నవీన్ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఇరవై రకాల పూలు, ఐదు రకాల పండ్ల ఆర్గానిక్ విత్తనాలు అమ్ముతున్నారు. హైబ్రీడ్ ఆర్గానిక్ కూరగాయల మొక్కలు కాయడానికి సుమారు రెండు నెలల టైం పడుతుంది ఆ తర్వాత కొన్ని నెలలపాటు కూరగాయలు కాస్తూనే ఉంటాయి.
2016 లో సీడ్ బాస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు ఊహించినట్టుగానే ఏమాత్రం ఆశాజనకంగా బిజినెస్ జరుగలేదు. ముందు ఆర్గానిక్ ఫుడ్ గురించి సోషల్ మీడియా వేదికగా అవేర్ నెస్ తీసుకువచ్చారు అంతే ఇక మౌత్ పబ్లిసిటి ద్వారా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. డబ్బు సంపాధించడం మన లక్ష్యమైతే మన దారి నలుగురికి ఉపయోగపడేలా ఉంటే ఆ ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకంగా వెలుగుతుంది. You can visit their website HERE.