సినిమాలో ఒక పాటకి ఆదరణ ఎక్కువగా వచ్చిందంటే ఆ రచయితకి దాదాపుగా అలాంటి సందర్భాలలో వచ్చే పాటలు రాయడానికే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. ఇదో రకమైన సవాలే అయినా ఆ గేయ రచయితలోని భిన్న కోణాలని మనకి పరిచయం చేయడంలో కాస్త ఆలస్యం అవుతుంటుంది . ప్రత్యేక గీతాలు,హీరో ఇంట్రడక్షన్ పాటలు, మాస్ పాటలతో కెరీర్ తొలినాళ్లలో ప్రేక్షకులని ఉర్రోతలూగించిన భాస్కరభట్ల రవికుమార్ గారు,తనలో ఉన్న ప్రతిభని ప్రపంచానికి తెలిపే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు . శ్రావ్యమైన సంగీతానికి సరళమైన భాషతో పదాలు అల్లుతూ బాల్కనీ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించగలరు. మాస్ బీట్స్ కి తగ్గట్టుగా కిక్కెకించే పదాలతో నేలా , బెంచి ప్రేక్షకులతో స్టెప్పులూ వేయించగలరు . భాస్కరభట్ల గారు సాహిత్యం అందించిన పాటలను ఓసారి చూస్తే ఆయన ఎంత గొప్ప రచయితో మనకి తెలుస్తుంది . భాస్కరభట్ల గారు రాసిన అద్భుతమైన పాటలలోనుండి కొన్ని పాటలని ఇక్కడ పేర్కొనడం జరిగింది . అవేమిటో ఓసారి చూద్దాం ………..
1. మళ్ళి మళ్ళీ రాదంట ఈ క్షణం - చుక్కల్లో చంద్రుడు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అనుభవాల నుండి ఎలా నేర్చుకోవాలో తెలిపే గీతం ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు …సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగురోజులు ఉన్నా చాలు జన్మధన్యమే
2. గణపతి బప్పా మోరియా - ఇద్దరమ్మాయిలతో Positive Thinking గురించి చెప్పే గీతం నువ్వెళ్ళే దారిలో కొండొస్తే ట్రెక్కింగ్ అనుకొని ఎక్కేసుకో ... హే సముద్రమొస్తే నీ తోవలో స్విమ్మింగ్ కోసం యూస్ చేసుకో …..హే తుఫాను గాని వచ్చిందో ఆ స్పీడ్ అంతా నీలో నింపేసుకో .......
3. సామజిక బాధ్యత గురించి తెలిపే పాట - కెమెరామెన్ గంగతో రాంబాబు నీ ఇంటి చూరు విరిగి మీదపడక ముందే నీ గుండెల చప్పుడు నిన్ను ఛీకొట్టక ముందే కదలిరా దేహానికి హాని అంటే వైద్యమెచ్చుకోవా దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా
4. కృష్ణా నగరే మామా - నేనింతే సినిమా వాళ్ళకే కాదు సినిమాలోకి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరి మనసుని కరిగించే పాట ఎన్నెన్నో ఆశలున్నవి ఏవేవో ఊహలున్నవి… మనసంతా సినిమా సినిమా అని మెలి పెట్టి చముతున్నది కన్నవారిని ఉన్నవారిని ఉన్నపాటుగా ఒదిలేసొచ్చామ్ పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డు లో దూకేశామ్
https://www.youtube.com/watch?v=wnBLlznen9o5. సలాం పోలీస్ - గోలీమార్ పోలీసోడి గొప్పతనం చెప్పే గీతం నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుడినే .... ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే
ప్రేమగీతాలు నీ కళ్ళతోటి - తులసి ప్రేమికుల ప్రేమలోని సుకుమారాన్ని అందంగా వర్ణించారు వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా ఊపిరవుతాను నీలోనే నేను ఎన్నడూ నీ జతే వదలకుండా
2. గాల్లో తేలినట్టుందే - జల్సా ప్రేమలో పడగానే ప్రేమికులకు కలిగే అనుభూతులన్నీ ఒక్క పాటలో చెప్పేసారు నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపే పొంగే అదుపు దాటి మనసే పొంగే నాలో
3. ఓ మగువా నీతో స్నేహం కోసం - సత్యం ప్రియురాలి కోసం ప్రియుడు పడే తపన ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా
4. కన్నులు తెరచి కలగంటామని - బొమ్మరిల్లు ప్రేమలో యువకుడికి కలిగిన కొత్త అనుభవాలు ప్రేమ కోసం ఏకంగా తాజ్ మహాలే కట్టాడు షాజహాన్ కి పనిలేదా అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను .... కానీ ఇప్పుడు
5. నువ్వేలే - దేవుడు చేసిన మనుషులు ప్రియుడి తలపుల్లో మునిగిపోయిన ప్రేయసి మనసులోని భావాలు గాల్లో రాతలు రాసుకొని నాలోనే మాటాడుకొని గడిపేసానని గురుతే రాధికా నీ నీడలో నాకే తోడూ దొరకదని ఒంటరి తనమే నేస్తమని అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
6. పరవాలేదు - మనసారా మనసుకి నచ్చిన వాడు ఎలా ఉన్నా పరవాలేదంటూ సాగే పాట మసి లాగ ఉంటుందని తిడతామా రాతిరిని తనలో కనలేమా మెరిసేటి సొగసులని అందంగా లేను అని నిన్ను ఎవరు చూడరని నువ్వు ఎవరికీ నచ్చావని నీకు ఎవరు చెప్పారు
7. ఒక లాలన - జ్యోఅచుతానంద ఇంత కాలం దాచుకున్న ప్రేమని హాయిని కాలమేమి దోచుకోదు ఇమ్మని పెదవంచు మీద నవ్వుని పూయించడం నీపని నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని
9. ఏనాటికి మనమొకటేనని - శివమణి నీకోసమే మిగిలున్నానిలా నువ్వు రాక నేనింకా ఎన్నాళ్లిలా నా గుండెలో నీ ఆలోచనా నా కంటి పాపాల్లో ఆవేదన
Sad Songs 1. ఏమి సేతురా సామి ఏమి సేతు - దేవుడు చేసిన మనుషులు ఇద్దరు అనాధల గుండెల్లోని వేదన కూడు గూడు గుడ్డ ఇచ్చి తోడు మరచిపోయావు జాలి దయ లేవానీకు దగా చేసి పోయావు ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు
2. శైలజ శైలజా - నేను శైలజ ఓ కుర్రాడి విరహ వేదనని వినూత్నంగా వివరించారు నీ ఫోటోని పెట్టుకున్న పర్సు మారలేదు నీకోసం కొట్టుకునే పల్సు మారలేదు నువ్వెంత కాదు అన్న మనసు మారలేదు నువ్వెందుకు మారావే శైలజ
ఉర్రూతలూగిస్తూ ఊపేసే మాస్ బీట్స్ 1. టాపు లేసిపోద్ది - ఇద్దరమ్మాయిలతో
2. ఎందుకే రవణమ్మా - బంపర్ ఆఫర్
3. జింగిడి జింగిడి - గురు