10 Things You Need To Know About Tollywood's Most Controversial Movie Critic "Mahesh Kathi" Gaaru!

Updated on
10 Things You Need To Know About Tollywood's Most Controversial Movie Critic "Mahesh Kathi" Gaaru!

మహేష్ కత్తి గారంటే చాలామందికి కోపం ఎందుకంటే ఆయన కొన్ని గొప్ప సినిమాలను కూడా కించ పరుస్తూ రివ్యూలు ఇస్తారని.. అది గొప్ప సినిమానా కాదా అనేది తర్వాత సంగతి కాని ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్. "ప్రతి వ్యక్తిలోను ఓ గొప్ప టాలెంట్ ఉంటుంది" అనే ప్రాతిపదిక మీద మహేష్ కత్తి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

1. చాలా కష్టపడ్డారు: మహేష్ కత్తి గారిది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా దగ్గర ఒక మారుమూల చిన్న గ్రామం. వారు వెనుకబడిన కులంలో జన్మించారు. ఆర్ధికంగా కూడా అంత గొప్పవారు కూడా కాదు. ఐనా గాని బి.ఏ ఇంగ్లీష్, ఎం.ఏ కమ్యూనికేషన్ ను కష్టపడి చదివి సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ సాధించారు.

2. సినిమా అంటే విపరీతమైన పిచ్చి: మహేష్ గారికి చిన్నతనం నుండి సినిమాలంటే చాలా చాలా ఇష్టం. తన ఊరిలో థియేటర్లు లేకపోయినా గాని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్కోసారి రోజుకి 4షోలు చూసిన రోజులు కూడా ఉండేవట. ఫిల్మ్స్ అంటే ప్రేమతో ఫిల్మ్ స్కూల్స్ లో కోచింగ్ కూడా తీసుకున్నారు. తను జంద్యాల, వంశి, కె.విశ్వనాథ్, సింగితం శ్రీనివాస్ రావు గార్ల సినిమాలు బాగా ఇష్టపడతారు.

3. మొదటి స్టాండర్డ్ షార్ట్ ఫిల్మ్: ఇందాక చెప్పుకున్నాం కదా సినిమా అంటే చాలా పిచ్చి, ప్రేమ అని అదే బావోద్వేగంతో బాలగంగాదర్ తిలక్ గారి "ఊరి చివర ఇల్లు" కథను కాస్త మార్పులు చేసి "ఎడారి వర్షం" అనే పేరుతో రఘకుంచే గారితో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. అది Crowd Fundingతో తీసిన షార్ట్ ఫిల్మ్. దీనిని 35మంది ప్రొడ్యూసర్లతో 2.70 లక్షలతో తీశారు. తనలో ఇంత గొప్ప టాలెంట్ ఉందని గుర్తించిన కత్తి గారు ఇక సినిమానే నా ప్రపంచం, నా భవిషత్తు అని తన జాబ్ కు రాజీనామా చేసి పూర్తిగా సినిమాల మీదనే దృష్టి కేంద్రీకరించారు.

4. ఆస్కార్ వరకు వెళ్ళింది: మహేష్ గారు సినిమాలతో పాటు పుస్తకాలను కూడా విపరీతంగా చదివేవారు దాని వల్ల రైటర్ గా కూడా మంచి ప్రతిభ వచ్చేసింది. 2012లో Blind Children కథాంశంతో వచ్చిన "మిణుగురులు" సినిమాకు రైటర్ గా పనిచేశారు. ఆ తెలుగు సినిమా మన భారతదేశం తరుపున ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళి ప్రపంచ వ్యాప్తంగా 323 సినిమాలతో పోటీపడింది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి రికార్డ్ స్థాయిలో 7 నంది అవార్డులు గెలుచుకున్నది.

5. క్రిటిక్ గా: రొటీన్ కథలతో హీరోలను ఎలివేట్ చేసే సినిమాలంటే ఇష్టపడని కత్తి గారు రివ్యూ చెప్పేటప్పుడు ప్రతి సినిమాను Deepగా Observation చేస్తారు. దర్శకుడు ఏదైతే చెప్పాలనుకుంటాడో దానిని ప్రస్పూటంగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఉదా: దర్శకుడు ఆడియన్స్ ని నవ్వించాలనుకుంటే ఎంతమేరకు నవ్విస్తున్నాడు, ఏడిపించాలనుకుంటే ఏ స్థాయిలో బావోద్వేగానికి గురిచేస్తున్నాడు, కథలో ఏమైనా లోపాలున్నాయా ఇలా అన్ని రకాలుగా Deep గా పరిశీలించిన తర్వాతే రివ్యూ చెప్పడానికి ప్రయత్నిస్తారు. (ఆడియన్స్ కు ఆ రివ్యూ నచ్చిందా లేదా అనేది తర్వాత విషయం).

6. పెసరట్టు వెనుక కథ: Director రాం గోపాల్ వర్మ గారు Flow Cam Technologyని ఉపయోగించి ఐస్ క్రీం సినిమాను తీశారు అది అట్టర్ ఫ్లాప్. కత్తి గారు ఆ సినిమా పై తన ఒపీనియన్ ను సెటైరికరల్ గా చెబుతూ "పెసరట్టు" కథను తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పోస్ట్ చేశారు. అది చదివిన కొంతమంది మిత్రులు ఈ కథ బాగుంది కదా దీనినే సినిమాగా ఎందుకు తీయకూడదు అని అడిగారట. ఇది చిన్న సినిమా ఐనా కూడా పెసరట్టు 63 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఐతే ఇది కూడా ఐస్ క్రీం సినిమాలా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ పరంగా మహేష్ గారికి చాలా నచ్చినా గాని పెసరట్టు సినిమా తనకు కూడా నచ్చలేదు.

7. సోషల్ మీడియా ద్వారా : మహేష్ గారంటే చాలామందికి ఒక ఫిల్మ్ క్రిటిక్ అనే తెలుసు. ఐనా గాని ఫేస్ బుక్ లో ఒక ఫిల్మ్ క్రిటిక్ కు 30,000(ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కలిపి) మంది ఫాలోవర్స్ ఉండడం చాలా అరుదైన విషయం. కేవలం ఫిల్మ్స్ కు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పాలిటిక్స్ మీద కూడా తనదైన స్టైల్ లో తన భావాలను చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రాంతానికి, కులానికి అతీతంగా సమస్యలపై అతను స్పందిస్తారు. కత్తి గారు స్వతహాగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనా గాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా ఏర్పాటుకై సపోర్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని చెప్పి సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ గార్లతో కలిసి వైజాగ్ లో శాంతియుతంగా సపోర్ట్ చేశారు.

8. రిపోర్టర్: ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు టీ.డి.పి కి సపోర్ట్ గా, సాక్షి వై.ఎస్.ఆర్ పార్టికి సపోర్ట్ గా, నమస్తే తెలంగాణ టి.ఆర్.ఎస్ పార్టికి సపోర్ట్ ఉందని సవాలక్ష ఆరోపనలున్నాయి.. ఈ రకమైన వ్యవస్థ అనేది సమజానికి ఏ రకమైన కీడు చేస్తుందో అని చెప్పడానికి "రిపోర్టర్" అనే సినిమాను ప్రారంభించారు కాని ప్రొడ్యూసర్ గారికి ఆర్ధిక ఇబ్బందులు రావడంతో మధ్యలోనే ఆపేశారు. ఈ సినిమా ద్వారా అసలైన మహేష్ కత్తి గారి శైలి ప్రేక్షకులకు తెలిసేదని ఆయన భావించేవారు.

9. తారాజువ్వలు: మన దేశానికి రేపటి పౌరుల ఉపయోగం ఎంత ఉంది.? అలాంటి పిల్లలపై తల్లిదండ్రులు, టీచర్స్ పాత్ర ప్రస్తుతం ఎలా ఉంది.? అసలైతే ఎలా ఉండాలి.? అనే కథాంశంతో "ఎగిసే తారాజువ్వలు" అనే సినిమాను తీశారు. అది రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

10. ట్రాక్ రికార్డ్: మన తెలుగులో Crowd Funding షార్ట్ ఫిల్మ్(ఎడారి వర్షం), Crowd Funding ఫీచర్ ఫిల్మ్(పెసరట్టు), Crowd Funding వెబ్ సీరిస్(త్వరలో రాబోతుంది) ఈ మూడు చెసిన వారిలొ మహేష్ కత్తి ఒకరు.