ఒక ఇంటి పనివాడిగా నిక్కర్లు వేసుకొని గంగోత్రి సినిమాలో కనిపించిన వ్యక్తి ఇప్పుడు స్టైలీష్ స్టార్ గా యుత్ కి ఐకాన్ గా మారడమా... ట్రీట్ మెంట్ చేసుకొని లైమ్ లైట్ లోకి వచ్చాడు.. అని కొంత మంది అనుకోవచ్చు.. కాని ఇక్కడ మనం చూడల్సింది అనుకుంటే జరిగిపోతుంది అనే విషయాల కన్నా Artist జీవితంలో ఇంకా చాలానే ఉంటాయి... ఎంతోమంది ఆయనలానే ట్రీట్మెంట్ చేసుకొనుండచ్చు మరి అల్లు అర్జున్ లా అందరు స్టైలీష్ స్టార్ అవ్వలేదేంటి? ఆయనలా డాన్స్, ఫైట్స్ చేయడం లేదేంటి? మన ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలంటే, బ్రతకాలంటే "టాలెంట్ కృషి పట్టుదల" ఇవ్వే ప్రాణం మిగితావన్నీ శరీరం మీద వేసుకునే డ్రెస్ లాంటివి...
నటించిన మొదటి సినిమాతోనే రాష్ట్రప్రభుత్వం నుండి స్పెషల్ జ్యూరీ నంది అవార్ఢును అందుకున్నారు.. మెదటి సినిమా గంగోత్రి నే 102 సెంటర్స్ లో 100 డేస్ జరుపుకుంది.. ఆర్వ, పరుగు సినిమాలోని నటనకు గాను నంది అవార్ఢు, పరుగు, రేసుగుర్రం, ఆర్య2 సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు.. ఇంత వరకు టాలివుడ్ లో ఎవ్వరు అందుకోలేని రికార్డ్ వరుసగ మూడు సినిమాలకు 50కోట్ల కలెక్షన్ దాటిన మెదటి హీరో బన్నీ(S/Oసత్యమూర్తి, రేసుగుర్రం,రుద్రమదేవి).. 2015కు గాను ప్రఖ్యాత ఇంటర్ నేషనల్ ఫోర్బ్స్ Magazine లో ఇండియాలోనే టాప్ 50 Indian Celebrity List లో స్థానం సంపాదించుకున్నాడు.. South Indian Facebook Official Page లో 1 Cr Followers దాటినా మొదటి హీరో బన్ని..వేదం సినిమాలో ఒడమ్మ జీవీతం అంటు తన జీవితాన్ని త్యాగం చేసి మనల్నందరిని తన నటనతో ఏడిపించేశాడు.. కొంతమంది హీరోలు చాల బాగా డాన్స్ చేస్తారు కాని ఏదో కష్టపడి చేస్తున్నట్టుగా, బాగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంటుంది కాని Dance లో Grace, Spark విషయం లో జీవం ఉండదు.. కాని అల్లు అర్జున్ చేస్తే... అతను ఆ పాటను ఎంజాయ్ చేస్తు చాల కష్టమైన స్టెప్స్ కూడా చాల Easy గా చేస్తున్నట్టనిపించి మనకు కూడా డాన్స్ చేయాలి అనిపించేంతలా ఉంటుంది పాములోని Flexibility, సింహంలోని రాజసం కలిస్తే అల్లు అర్జున్ డాన్స్...
ప్రతి సినిమాకు తనలో ఉన్న మైనస్ పాయింట్స్ లను తర్వాతి సినిమాలో Plus చేసి చూపిస్తాడు..
మాములుగా ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ ఇచ్చారంటే ఇక ఆ డైరక్టర్ తో ఎంత వీలుంటే అంత Friendshipను కట్ చేసుకొని తప్పించుకుంటారు.. కాని అర్జున్ అలా మాత్రం కాదు. వరుడు లాంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ గుణశేఖర్ తో రుద్రమదేవి లోని గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కి ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ పాత్రకు న్యాయం చేశాడు.. అదికూడా రేసుగుర్రం లాంటి పెద్ధ హిట్ తర్వాత. ఒక హీరోయిన్ మెయిన్ లీడ్ రోల్ ఉన్న సినిమాలో చేయడం అంటే బన్ని మంచితనం ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.. మంచి సక్సెస్ వచ్చినా ఇప్పటికి రుద్రమ దేవికి ఏ రెమ్యునరేషన్ తీసుకోలేదు..
తెలుగు వారు ఇష్టంగా జరుపుకునే ఉగాది రోజున పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు ?