This Daughter Describing The Bond With Her Mom Is Relatable To All The Girls Out There

Updated on
This Daughter Describing The Bond With Her Mom Is Relatable To All The Girls Out There

Contributed by Kutti Subramanyam

ప్రేమ! ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు పుడుతుందో చెప్పలేం కానీ, ఎంత మందితో పుడుతుందో మాత్రం ఒక కౌంట్ ఉండాలండి. ఒకే! ఒకవేళ కౌంట్ లేకపోయినా లక్కీగా నాకున్న అమ్మ లాంటి అమ్మ ఉండాలి. ఎందుకో మీరే చూడండి.

మా అమ్మ తో నేను చాల క్లోజ్. అన్నీ షేర్ చేస్కుంటా. అన్నీ అంటే అన్నీ. ముఖ్యం గా నాకు సంబంధించిన విషయాలు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటా. ఆ ఎక్స్పీరియన్స్ తో ఏమోకానీ, నేను ఏదయినా అన్నానంటే ఆ విషయాన్ని ఎంత సీరియస్ గా తీస్కున్నానో చాలా అవలీలగా గమనించేస్తుంది.

అలా అక్కర్లేని వాగుడు ఎంతో వాగా. చిన్నప్పట్నుంచి బాయ్స్ ఏ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం చూసి నాలో అమ్మాయి లక్షణాలు తక్కువ అని ఒక క్లారిటీ కి వచ్చింది మా అమ్మ. కానీ జెండర్ తో సంబంధం లేకుండా, ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో ఏదయినా జరగచ్చు. అలా నాకు కూడా ఆ ఏజ్లోప్రేమ బిడ్డ పుట్టింది. క్లాసుమేట్ ఒకడు. పోనీ అందం గా ఉంటాడా అంటే ఆహ! నా కన్నా పొడుగు కూడా కాదు. అయినా నచ్చాడు. అల్లరి చేసేవాడు, అందరిలోనూ తేడా గా ఉండేవాడు. రోజు ఇంటికెళ్లి వాడి గురించి అమ్మకి చెప్తూ ఉండేదాన్ని. ఆలా కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు"అమ్మ, వాడిని పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది కదా" అన్నా. నవ్వి వెళ్ళిపోయింది. కొన్ని రోజులయ్యాక నేను వాడు మాట్లాడుకోవడం మానేసాం. ఎందుకంటే, మేము మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ గా ఉండడం ఇవన్నీ సీక్రెట్స్ గా ఉంచాలన్నాడు. పో అని వదిలేసా వాడిని వాడి ఫ్రెండ్షిప్ని! అమ్మకి చెప్పా, ఎదో ముందే expect చేసినట్లు నవ్వి వెళ్ళిపోయింది.

సెకండ్ ఇయర్ కి వచ్చేసా. ఈసారి నా చిన్నప్పటి స్నేహితుడు నేను అంటే ఇష్టం అని చెప్పాడు. చాలా సరదా పడిపోయి ఇంటికెళ్లి అమ్మకి చెప్పేశా. మేమిద్దరం చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. అంటే మాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పట్నుంచి. ఎదో సినిమాల్లో చూపించినట్లు, చిన్నతనం నుంచి ఒక లవ్ స్టోరీ ఉండడం, వాడినే పెళ్లి చేస్కోవడం బావుంటుంది కదా, అదే రియల్ గా జరిగితే సూపర్ కదా! అలాంటిది వాడు నన్ను ఒక్కదాన్నే ఇష్టపడ్డాడు, అబ్బా సూపర్ అనుకోని అమ్మ దెగ్గరికెళ్ళి, "అమ్మ, వాడిని పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది కదా" అన్నా. నవ్వి అక్కడనుంచి లేచి వెళ్ళిపోయింది. అరెరే, మల్లి నాకు అర్ధం కాలేదు. కానీ వాడు అంతగా నాకోసం ఏమి వెయిట్ చేయలేదు చిన్నప్పట్నుంచి అని తెలిసి అవన్నీ వదిలేసి నా చదువు లో నేను పడిపోయా.

థర్డ్ ఇయర్. నా క్లాస్మేట్స్ లో చాల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళలో నాకు ఫస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు చాలా తెలివైన వాడు, కానీ నన్ను గురూజీ గురూజీ అంటూ అన్ని షేర్ చేసుకొని డౌట్స్ అవి అడుగుతూ ఉండేవాడు. అనుకోకుండా ఏంటో తెలీదు కానీ, ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఎంత క్లోజ్ అంటే తాను నాకు ఇష్టం అని వాడికి అర్ధం కానీ సబ్జక్ట్స్ నేనే చదివి, వాడికోసం ఒక సమ్మరీ లా రాసి ఇస్తుండేదాన్ని. నిద్ర కోసం ప్రాణం పెట్టె నేను వాడికోసం పడుకోకుండా అన్ని ఎగ్జామ్స్ కి అలా రాసిచ్చా. అంత కాంపిటీటివ్ గ ఉండే నేను వాడికి చాలా హెల్ప్ చేశా. అమ్మ అన్ని చూస్తూనే ఉంది.

ఇంజనీరింగ్ కలిసే పూర్తి చేసాం. మొత్తానికి ఇద్దరకీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం అని అర్ధమయింది. అమ్మ కి చెప్తే ఏమనుకుంటుందో అన్న భయం. ఏమి అనదు అని తెలుసు కానీ, ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుందేమో అని ఒక బాధ. నాకోసం అమ్మ కన్ఫ్యూషన్ లో పడకూడదని నేను ఏది చెప్పలేదు.

పీజీ కూడా ఒకే కాలేజీ లో సీట్ తెచ్చుకొని కలిసే చదివాం. పీజీ లాస్ట్ డేస్ అవి. ప్లేసెమెంట్స్ అవుతున్నాయి. నాకు టార్గెట్ చేసిన జాబ్ వచ్చింది. ఏడూ సంవత్సరాల గా తెలుసు వాడు నాకు ఇప్పుడు. ఒక్కరోజు కూడా అమ్మకి వాడంటే ఇష్టం అని చెప్పలేదు. అమ్మకి చెపుదాం అనుకునే లోపు సడన్ గా అమ్మ కాల్, "కుట్టమ్మ, నీకు నచ్చినట్లు చదువుకున్నావ్. జాబ్ తెచ్చుకున్నావు. ఒకసారి పెళ్లి గురించి ఆలోచించు. ఐ వాంట్ యు టు గెట్ మారీడ్ నౌ. మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. నువ్వేమంటావ్?" ఇంతలో ఫోన్ కట్ అయింది.

మల్లి కాల్ వచ్చింది. "ఒక్క విషయం గుర్తుంచుకో కుట్టమ్మ, నేను నిన్ను 23 ఇయర్స్ గా చూస్తున్న. లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో ఎలా ఉన్నవో కూడా చూసా. అది మేబి నీ ఏజ్ వల్ల వచ్చిన చేంజ్ అవ్వచ్చు కానీ ఒక మంచి పాజిటివ్ చేంజ్ మాత్రం తాను వచ్చాక చూసా. నీకు తాను అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కాస్ట్ గురించి ఆలోచించకు. ఫ్యూచర్ లో కలిసి ఉండాల్సింది మీరు. తాను ఎలాంటివాడో నేను చూసా. ఇన్ని ఇయర్స్ ఎదురు చూసా చెప్తావేమో అని. అన్నీ చెప్పిన నువ్వు వాడి విషయం చెప్పడానికి ఆలోచించావు అంటే, నా గురించి ఆలోచించి ఆగి ఉంటావు. నేను ఎక్కడ బాధపడతానేమో అని ఆగిపోయి ఉంటావ్ అని నాకు తెలుసు. తప్పు డెసిషన్ తీస్కొని ఉంటె బాధపడేదాన్నేమో, బట్ ఐ రెస్పెక్ట్ యుఆర్ డెసిషన్. ఒకవేళ మీ ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఏమనుకోకు. వాడితో ఉండాలి అని ఆలోచన ఉంటె నాకు చెప్పు. ఎక్కువ ఆలోచించకు కుట్టమ్మ! యు అర్ ది బెస్ట్ డాటర్." అని తరువాత మాట్లాడతా అని ఫోన్ పెట్టేసింది. ఎదో ఒక దేవత సడన్గా కాల్ చేసి అన్నీ మంచి రోజులే అని చెప్పినట్లు అనిపించింది.

నాకు ఆ రోజు అమ్మ అన్న మాటలకి మా అమ్మ మీద గౌరవం ఎంత ఎత్తుకు పెరిగిపోయిందో నా మాటల్లో చెప్పలేను. ఆరోజు నేను ఎప్పటికి మర్చిపోలేను. పెద్ద ఉద్యోగం, ఎక్కువ జీతం వచ్చి లైఫ్ లో ఒక రకంగా స్థిరపడ్డాను అనుకుంటే, అన్ని రకాలుగా నన్ను తృప్తి పరచడానికి అమ్మ సొంతం గా వచ్చి నాకు ఒక క్లారిటీ ఇచ్చిన విధానం చూస్తే తెలిసింది, అమ్మ దెగ్గర అన్నీ ఎందుకు చెప్పాలో!

మన కడుపు చూసి ఆకలేస్తోందో లేదో చెప్పలేకపోవచ్చు కానీ కళ్ళు చూసి ఆనందం గా ఉన్నామో లేదో చెప్పడం అమ్మ కి చాల సింపుల్. అలాంటి అమ్మ కి అబద్దాలు చెప్పకుండా ఉన్నందుకు ఈరోజు చాల సంతోషంగా ఉంది.

"You are my Alice in this wonderland, Keeping all my worries away with your magic wand"... చిన్నప్పుడు ఎప్పుడో తేలిక రాసిన ఈ లైన్స్, నిజంగా ఈరోజు ప్రూవ్ అయ్యాయి. అబ్బాయిల విషయం లో నేను చాలాసార్లు తప్పు ఏమో కానీ, అమ్మ విషయం లో ఎప్పుడూ కాదు. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. కానీ చిరంజీవి కన్నా infinite టైమ్స్ ఎక్కువగా వేరే హీరో ని నా లైఫ్ లో ఇష్టపడ్డానంటే అది నువ్వే అమ్మ!"