గెలిచానా? ఓడిపోయినా? అనే ప్రశ్న ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు , కానీ ఈ క్షణం , ఒక సందేహం కన్నా ఒక ఆందోళన , ఒక సందిగ్థతల అనిపించింది.
ఇంజనీరింగ్ చేసి 3 ఏళ్ళు అయ్యింది. క్యాంపస్ లో జాబ్ వచ్చింది , కానీ దాని జీతం వచ్చే లోపే నాకు చిరాకు వచ్చింది. ఒక షాప్ పెట్టి సొంత వ్యాపారం చేస్తా అంటే అమ్మ, నాన్న 2 లక్షలు అప్పు తీసుకొచ్చారు. ఆలోచన బాగుంది , సక్సెస్ కూడా అయింది కానీ 2 గంటల కన్నా ఎక్కువ కూర్చోవాలి అనిపించలేదు.
సంతృప్తి లేదా ? ఆసక్తి లేదా ? ఇలా ఒకటి రెండు కాదు పది పన్నెండు ఉద్యోగాలు చేశాను. విచిత్రం ఏంటంటే అమ్మ నాన్న ఒక్క మాట కూడా అనలేదు. బయటికి కనపడకపోయిన వాళ్ళు బాధ పడుతున్నారు అని తెలుస్తూనే ఉంది. అన్నిటి మీద చిరాకు వచ్చి కొన్ని నెలలు అన్ని వదిలేసి అలా గాలికి తిరిగాను.
3 నెలల తర్వాత అది కూడా చిరాకు వచ్చింది. అసలేం చేస్తున్నా? ఖాళీగా ఒక నెల కూర్చుంటావ్ , రెండు నెలలు కూర్చుంటావ్ , ఆ తరువాత ? ఈ లోకం లో అన్నిటికంటే కష్టమైనది ఎం పని చేయకపోడం.
ఎప్పుడు లేనిదీ అమ్మ తో మాట్లాడాలి అనిపించింది. రాత్రి 10 అయ్యింది. ఇంటి డాబా మీద ఒక్కడినే ఆలోచిస్తూ నుంచున్నా. ఇంతలోపు అమ్మ వచ్చారు.
అమ్మ : ఏరా తిన్నావా ?
రవి : హా అమ్మ ! నువ్వు ?
అమ్మ : అయ్యింది , ఎం చేస్తున్నావ్ ?
రవి : ఏం లేదు అమ్మ , ఊరికే అలా !
(ముందున్న ఇల్లులు అన్ని చూస్తూ )
మనిషి ఒకే చోట కదలకుండా ఎలా ఉండగలడు అమ్మ ? ఎదగాలనే ఆలోచన ఉండదా ? పక్కింటి సుబ్బారావు అంకుల్ నా చిన్నప్పటినుండి అదే ఇల్లు. ఈ మనుషులు నాకు అర్ధం కారు అసలా.
అమ్మ : (నవ్వుతు ) : బానే ఉన్నావా ?
రవి : ఏం అర్ధం కావటలేదు , నిన్ను ఒకటి అడగొచ్చా?
అమ్మ : కానీ ..
రవి : ఒకే చోట స్థిరంగా లేను , ఇన్ని మారాను , అసలా లైఫ్ లో ఎం కావాలో నాకే తెలీదు. కానీ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అనలేదు. నన్ను కూడా ఎప్పుడు నవ్వుతారే కానీ అసలేం అనరు, ఎందుకు అమ్మ ?
అమ్మ : ఎంట్రోయ్ ! విచిత్రంగా మాట్లాడుతున్నావ్ ?
రవి :విచిత్రంగా కాదు అర్ధం కాక
అమ్మ : నిన్ను మేము ఎప్పుడు ఆపలేదు , డబ్బు నీ సంతోషానికి ఎప్పుడు రాకూడదు , రానివమ్ము కూడా , ఏ తిప్పలు అయినా , ఎన్ని కష్టాలు అయినా నీ దాక రానివ్వకూడదనే నాన్న నేను కష్టపడేది
రవి : ఎందుకు అమ్మ ?
అమ్మ : మనిషికి భయం ఎక్కువ. దింట్లో ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి ? అందుకే సేఫ్ ఆప్షన్ చూసే చేసుకుంటారు . అందుకే మనలో చాలా మంది కష్టంగా కనిపించినా, అనిపించినా సేఫ్ జాబులు అంటేనే మోజు, ఇష్టంగా ఉన్న మిగతా అన్ని వృత్తులు అంటే భయం , కాకపోతే ఒకసారి ఇష్టం అయినా పని పట్టుకుంటే ఇప్పటికి కాకపోయినా , ఇప్పటికైనా అక్కడ ఒక మంచి స్థాయిలో నిలబడతారు . అందుకే అన్ని ట్రై చేసి దేంట్లో నువ్వు సంతోషంగా ఉంటె దానిలో ఎదగాలన్నది నాది , నాన్నది కోరిక.
రవి : మరి నాకు ఏది నచ్చట్లేదు ? ఆఖరికి ఖాళీగా ఉన్న చిరాకు వస్తుంది.
అమ్మ : (నవ్వుతు ) నీ సమస్య ఏది చేయాలి అని కాదు ! ఎందుకు చేయాలి అని.
రవి : అర్ధం కాలేదు
అమ్మ : నీకు చిరాకు వచ్చింది అనే ఒక్క కారణం తీసేసి ఇన్ని జాబ్స్ ఎందుకు మానేసావో ఒక్క కారణం చెప్పమంటే నీ దగ్గర సమాధానం ఉందా? అసలా ఒక ఫీల్డ్ లో పడిపోతే లేదా కొంచెం ఫెయిల్ అయినా మళ్ళీ లేచి పోరాడావా? కనీసం ట్రై చేసావా ?
రవి : ఇష్టం లేకపోయినా అక్కడే ఉండమంటున్నావా ?
అమ్మ : ఇష్టానికి , మళ్ళీ ప్రయత్నిచడానికి సంబంధం ఏంటి చెప్పు ?
నీకు నీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇష్టం ఉండచ్చు , కానీ తన గురించి నీకు మొత్తం తెలుసా ? కానీ తెలుసుకుంటే ఇష్టం పెరుగుతుంది కానీ తగ్గుతుందా ? ఈ లోకం లో ఏదైనా అంతే ! నేర్చుకుంటూ పోతేనే ఒక్కోటి తెలుసుకుంటూ , విజయపు మెట్లు ఎక్కుతావ్
రవి : కష్టమైన ఒకే చోట ఉంది ఎదగలంటావ్
అమ్మ : చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు చెప్పింది వినలేదు , చాలా తప్పులు కూడా చేసావ్ ! అలా అని నిన్ను వదిలేస్తే ఈరోజు ఇక్కడ ఉండేవాడివా ?
రవి : గెలిచానా? ఓడిపోయినా? అనే ప్రశ్న ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు , కానీ ఈ క్షణం , ఒక సందేహం కన్నా ఒక ఆందోళన , ఒక సందిగ్థతల అనిపించింది.
అమ్మ : నువ్వు ఏ ఉద్యోగం తీసుకున్న , కష్టాలు చిరాకు , సంతోషం , గెలుపు అన్ని కలిపే వస్తాయి , కష్టాలు లేని ఉద్యోగాలు ఏవి చెప్పు ? చీకటి లేకపోతే వెలుగుకి గుర్తింపు ఉంటుందా ? అలానే కష్టం లేకపోతే గెలిచినప్పుడు ఆనందం కూడా ఉండదు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు , ఎన్నో ఎత్తులు ఎన్నో సమస్యలు , విజయం అయినా ఓటమి అయినా తాత్కాలికమే. "Everything shall pass ".
కానీ చేసే ఉద్యోగం వల్ల మానసికంగా ఎదగాలి. పని చేసి ఇంటికి వచ్చాక హమ్మయ్య అని ప్రశాంతంగా పడుకోవాలి కానీ , అబ్బా మళ్ళీ రేపు పనికి వెళ్ళాలి అనిపించని ఏ ఉద్యోగం అయినా నువ్వు సంతోషంగానే ఉంటావ్.
రవి : థాంక్స్ అమ్మ
అమ్మ : ఏడిసావ్ లే , త్వరగా పడుకో
రవి : అమ్మ , రేపు షాప్ కి వస్తాను ! ఇంకో 6 నెలల్లో ఈ కాలనీ లోనే మనది పెద్ద షాప్ అవుతుంది. నాన్నకి చెప్పు.