Contributed By RJ Avi
నాకు సెలవులు అనగానే గుర్తుకొచ్చే ఏకైక Emotion
అత్తారింటికి వచ్చిన లేడీస్ అందరికి పిల్లల హాలిడేస్ పేరుతో వాళ్ళ పేరెంట్స్ చూడడానికి మన tradition లో పెట్టిన ఒక పెద్ద gift
ఈ గిఫ్ట్ గురించి చెప్పాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం రండి !! అప్పట్లో annual exams అయిపోయాక Relatives ఎప్పుడొస్తున్నారో కనుక్కుని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మనకి అలవాటు
ఈ gap లో ఎదో పీకేద్దాం మనకి స్కూల్ ఇచ్చే హాలిడేస్ వర్క్ అని తీసుకెళ్తామ్ రాద్దాం అని కాదు ...రాద్దాం లే అని
ఒక్కసారి journey స్టార్ట్ అయితే ఎదో తెలియని ఆనందం మధ్యలో బస్ ఆగితే బస్ విండో లో నుండి జామకాయల బ్యాచ్ అది తిని ఒక sleep ఏసే లోపల బస్ ఊరికి రీచ్ అవుతోంది అనగానే ఎదో తెలియని excitement సెలవల మీద ఒక expectation వీటితో పాటు luggage ని కూడా తీసుకుని రిక్షా దిగగానే
అమ్మమ్మ తాతయ్య వెల్కమ్ చేస్తూ ఇచ్చే smile !! అబ్బా ఎం happiness
Next roju అక్కడ లేవగానే ఎదో pleasant ఫీలింగ్ కోయిల సౌండ్ పొలాల గాలి ఇంకా ఏమి అక్కర్లేదు అనిపిస్తుంది
వెళ్లిన ప్రతిసారి మా పండు గాడి స్పెషల్ ఉల్లిదోస తినాల్సిందే " మూర్తి గారి మనవళ్ళు వచ్చారు అనగానే ఒక చిన్న సెలబ్రిటీ ఫీల్స్ లే "
బాగా లేట్ గా రెడి అయి పక్క పల్లెటూరులో పిన్ని మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లడం
సాయంత్రం ఏం సినిమా చూడాలా అని మధ్యాహ్నం లంచ్ నుండే మన పిల్ల గ్యాంగ్ ప్లాన్ వేసుకోవడం
హై స్కూల్ దగ్గర బాగా లేట్ అయ్యే వరకు క్రికెట్ ఆడితే అమ్మ అరుస్తూ గ్రౌండ్ నుండి తీసుకెళ్లడం
సాయంత్రం అయితే 2 హార్స్ పవర్ కట్ అనే facility ఎందుకంటే ఈ గాప్ లో మళ్ళీ సబ్జా ఇన్డోర్ ఆడుకోవాలి
ఆడి ఆడి అలిసిపోయిన మాకు మా అమ్మమ్మ ఒక్కొకరికి గోరు ముద్దలు పెట్టడం
" నాకు పె......ద్ద ముద్ద కావాలి " మన ఫేవరెట్ dialogue
కొంచెం పది అవ్వగానే ఏం భయం లేకుండా హాయిగా బయట మడత మంచాలు వేసుకుని ఒక table fan oscillation లో పెట్టుకుని పడుకుని చందమామ చూస్తూ మన relativesతో జోకులు వేసుకుంటూ నిద్రపోవడం
అబ్బో ఇది కాకుండా మావిడి కాయలు కొట్టం ముక్కలు చెయ్యడం అలా చేసిన ఆవకాయని ఎవరి వాటా వాళ్ళు జాడీలో సర్దడం
ఇంకా మన relatives ఎవరైనా టీచర్ అయితే వాళ్ళు చెప్పే సమ్మర్ classes Torture
అంత .... enjoyment ని ఇంత ....education ని కొంత... బాండింగ్ ని ఎంత చెప్పిన అవ్వని మెమోరీస్ ని
నేను నిజంగా జాబ్ లో కొంచెం లీవ్ కూడా దొరక్క నా ప్రపంచాన్ని నా హాయిని మిస్ అవ్వుతుంటే ఎలా ఉంటుందో తెలుసా !!
మీకు ఎలా ఉంది ?? కామెంట్ చెయ్యండి