అమ్మమ్మ.కాం ఈ సీరియల్ కథ గురించి తెలియాలంటే ఈ సిరియల్ టైటిల్ సాంగ్ వింటే సరిపోతుంది.
"నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోందీ అమ్మమ్మ.కాం".
ఈ సాంగ్ గురించి ఆ పాట రాసిన సిరివెన్నల గారి మాటల్లో
ఈ సాంగ్ వస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాత కాలం అమ్మాయి ఎదిగే క్రమాన్ని చూపిస్తారు.. మన అమ్మమలా బాల్యం ఇంచు మించు అలానే ఉంటుంది..
మన ఇంట్లో మన అమ్మమ్మల్ని చూస్తూనే ఉంటాం, భక్తి ఛానెల్ పెట్టుకుని ఏమి తెలియని వాళ్ళ లాగ ఉంటారు కాని వాళ్ళ అనుభవాలు మనకు నేర్పే పాఠాలు గూగుల్ లో కూడ ఉండదు.
2007 జూన్ 25. అప్పటివరకు జూం అవుట్ జూం ఇన్ షాట్లతో పగ ప్రతీకారలతో నిండిన కథలతో సీరియల్స్ తీస్తున్న తరుణం లో ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది. ఒక 50-60 మధ్య వయస్కురాలైనా గృహిణి, తన కోడలి సాయంతో కంప్యుటర్ నేర్చుకుని తనకి తెలిసిన చిట్కాలను, అనుభవాలకు రూపంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ రుపొందించడం జరిగింది. ఆ గృహిణి పాత్రలో జయలలిత గారు చాలా సహజమైనా నటనను ప్రదర్శించారు. ఇక సాంకేతికత మనుషులని బద్దకస్తుల్ని చేస్తుంది అని నమ్మే సగటు మధ్యతరగతి మనిషిగా ఆమె భర్త పాత్ర ఉంటుంది..
2007 అప్పుడప్పుడే నెట్ మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్న కాలం. ఆ కాలం లొ మనుషుల ఆలోచనలు రెండు రకాలు గా ఉండచ్చు.. ఆ మార్పు ని స్వాగతించే వాళ్ళు ఉంటారు. స్వాగతించని వాళ్ళు ఉంటారు. అలాంటి రెండు భిన్న మనస్తత్వాలని ఇందులో భార్య భర్తలు గా చూపించారు. ఆ భర్త యొక్క ఆలోచనలకి ఎటువంటి వ్యతిరేకత చూపకుండ అతని లో మార్పుని ఎంతో ఓర్పు గా ఆ గృహిణి పాత్ర తీసుకొస్తుంది.
https://youtu.be/qSUFiZIgWVQ
ఈ సీరియల్ లో ఎవరు స్పృశించని కొన్ని అంశాలని ఉదాహరణకి, పొరపాటున ఏయిడ్స్ సోకిన వ్యక్తి తన కుటుంబానికి ఎలా చెప్పాలో తెలీక సతమతం అవుతుంటే ఆ సమస్యకి పరిష్కరించే విధానం. ఆమ్మాయి రెండో పెళ్ళి చేసుకోవడం వంటి అంశాలు ఇందులొ ప్రస్తావించారు. తన కుటుంబం లో జరిగే విషయాలని ఆ గృహిణి పాత్ర చక్కదిద్దే విధానం మన అమ్మ అమ్మమ లని తప్పకుండా గుర్తు చేస్తుంది..
ఇలా సీరియల్ ఓ వైపు చాలా గంభీరంగా నడుస్తుంటే. అమెరికా వెళ్ళాలి అని కలలు కనే మరో గృహిణి పాత్రలో రాగిని గారి పాత్ర నవ్వులు పూయిస్తుంది. మనం అందరం తరుచుగా అనే "బ్రో" అనే పదం నేను ఈ సీరియల్ లోనే ఫస్ట్ టైం విన్నాను.
అలా ఒక చక్కని ఆహ్లాద కరమైన వాతరవరణం తో నేటి సమాజానికి అవసరమయ్యే కథాంశం తో, మన ఇంటి పక్కనే ఎక్కడో జరిగిన కథలా అనిపించే ఈ సీరియల్ 400 లోపు ఎపిసోడ్ల లోపే ముగిసిపోయింది.ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి కుమార్తే పాలగుమ్మి సీత గారు ఈ కథ ని రచించారు. అమృతం వంటి మరుపురాని సీరియల్ తీసిన గుణ్ణం గంగరాజు గారే ఈ సీరియల్ ని రూపొందించారు. ఎన్ని సీరియల్లు వచ్చినా ఒక అమ్మ మనస్సు ప్రతిబింబం లా ఈ సీరియల్ అలా ఉండిపోతుంది..