చేగొండి అనంత శ్రీరామ్.. సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 13 ఏళ్ల సినీ జీవితంలో కొన్ని వందల పాటలకు సాహిత్యం అందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్నారు.. ఆయన పాట అనే కాదు.. ఆయన చెప్పే మాటలు కూడా ఎంతో స్ఫూర్తిదయకంగా, ఆలోచింపచేసేలా ఉంటాయి... ఇక సమాజాని కి తన వంతుగా ఏదైనా చెప్పాలనీ నేటి రాజకీయాల తీరుని, ఓటు గొప్పతనాన్ని, అంత గొప్పదైన ఓటుని అమ్ముకోవద్దు అని తను రాసి, ఆలపించిన పాటే ఇది...
ఓటేస్తావా.. ఓటేస్తావా.. ఓటేస్తావా వొళ్ళు కొవ్వెక్కి, ఓటేస్తావ... ఓటేస్తావా కళ్లు నెత్తికెక్కి, ఓటేస్తావా...
సిల్లరా కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా.. బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా.. కన్నబిడ్డల రేపుని మింగేసి కాటి కెళ్ళి సుఖపడతావా... ఓటేస్తావా వొళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా.. ఓటేస్తా వా కళ్లు నెత్తి కెక్కి, ఓటేస్తావా... రెండు వేల నోటు నిలబెడతాదా నిండు బతుకుని.. అయిదు ఏళ్లపాటు నీకెడతాదా మింగ మెతుకు నీ.. అర్ధ మవ్వదా.. అడ్డగాడిద.. వేల నోట్లు వాడు పంచేదెందుకు..? వెళ్లి వేల కోట్లు మళ్లీ బొక్కేందుకు... ఓటేస్తావా వొళ్ళు కొవ్వెక్కి.. ఓటేస్తావా... ఓటు వేసి నువు సుపెడతావ సుపుడు వేలు.. గద్దె నెక్కి నేత సుపెడతాడు మధ్యలో వేలు.. పిచ్చ పీనుగా మార్చలేనుగా.. లంచగొండినేమి అనలేవు కొడకా.. ముందు లంచం తీసుకుంది నువ్వే కనుక... ఓటేస్తావా వొళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా.. ఓటేస్తావా కళ్లు నెత్తికేక్కి ఓటేస్తావా... సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా.. బురిడిలు చూసి బుద్ది లేకుండా ఓటేస్తావా.. కన్న బిడ్డల రేపటిని మింగేసి కాటి కెళ్ళి సుఖపడతావా... ఓటేస్తావా వొళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా.. ఓటేస్తావా కళ్లు నెత్తికెక్కి ఓటేస్తావా...