ప్రియమైన ముకేశ్ అంబానీ గారికి, మీ అపరిచిత ఆప్త మిత్రుడు ఆముదాల ఆంజనేయులు రాయునది మీ జియో ఫ్రీ సర్వీసులని పొందిన వినియోగదారునిగా ,సాటి బిజినెస్ మాగ్నెట్ గా మీకు ఈ ఉత్తరం ద్వారా కొన్ని అమూల్యమైన వ్యాపార సూత్రాలని తెలుపుదాం అనుకుంటున్నాను. ఈ ఆరు మాసాలు దేశాన్ని ఒక్కతాటి పైకి తీసుకొచ్చినందుకు ముందుగా అభినందనలు . మీ జియో ప్రైమ్ లో subscriptions ఆశించినంతగా లేవని నాకు తెలిసింది,కావున నా ఐడియాలు మీకు ఉపయోగపడతాయి,ఇలాంటి క్లిష్ట సమయంలోనే నా లాంటి ఇంటెలిజెంట్ పర్సన్ మీ పక్కన ఉండాలి.
ఐడియా 1. మార్చ్ 31 తో ఫ్రీ ఆఫర్ ముగుస్తుందని అడ్వాన్సుగా ఏప్రిల్ ఫూల్ చేసానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, వెంటనే ఫ్రీ ఆఫర్ మరో మూడు మాసాలు పెంచుతున్నట్టు చెప్పి కూల్ చేయండి.
ఐడియా 2. ఈ మధ్య వాట్సాఅప్, స్నాప్ఛాట్ అంటూ అన్నిట్లో స్టోరీస్ రాసేస్తున్నారు,ఆ టాలెంట్ ని మనం వాడుకుందాం, ఈ ఆర్నెల్లు జియో ఫ్రీ ఆఫర్ ని ఎలా వాడుకున్నారో ఓ కథగా రాసి మనకి పంపమని చెప్పండి, వాటిల్లో ది బెస్ట్ కథని సినిమాగా తీసేద్దాం,ఎలాగూ మన రబ్బర్ బాలాజీ ఉన్నాడు డైరెక్షన్ కి,నట భీకర ఆంజనేయులు, నట భయంకర అమృతం మేమిద్దరం ఎలాగూ లీడ్ క్యారెక్టర్స్ కి ఉన్నాము.
ఐడియా 3. ఇక మిగతా క్యారెక్టర్స్ సెలక్షన్ కోసం యూత్ ని పిలుద్దాం ,ఎలిజిబిలిటీ జియో ప్రైమ్ మెంబర్షిప్ అలాగే సెల్ఫీ విత్ కిళ్ళీ తో ముందుగా మనకి ఫోటోలు పంపమని చెబుదాం, వాటిలోంచి సెలెక్ట్ చేసే బాధ్యత సర్వానికి అప్పగిద్దాం. ఆడిషన్స్ మన అమృత విలాస్ లో పెడదాం.
ఐడియా 4. ఇప్పుడు రాబోయేది IPL సీసన్, జియో ప్రైమ్ లో ఇప్పుడే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్ ల టికెట్స్ ఫ్రీ గా ఇచ్చేదాం. అప్పుడు మన టీం కి ఇండియా మొత్తం సపోర్ట్ ఉంటుంది.
ఐడియా 5. ఇన్నాళ్లు రీఛార్జి అనే మాటే లేకుండా చేసాం,ఇప్పుడు రివర్స్ రీఛార్జి అనే ఆఫర్ ఇద్దాం అసలే హాలిడేస్ రాబోతున్నాయ్,ఒక గంట సేపు ఆపకుండా ఒకే కాల్ లో మాట్లాడితే వాళ్ళకి గంటకి 5 రూపీస్ Paytm అకౌంట్ లో వేసేద్దాం,ఇలా మనం Paytm తో కూడా బిజినెస్ సెట్ చేసుకోవొచ్చు.
నా ఐడియాలతో, నా బిజినెస్ బ్రెయిన్ తో మా అమృతాన్ని అంబానీ లెవెల్ కి తీసుకొచ్చినవాడ్ని ,ఇంకా స్వయంగా అంబానీని ఏ లెవెల్ కి తీసుకెళతానో మీ ఊహకే వొదిలేస్తున్నా. మీతో బిసినెస్ పార్ట్నర్షిప్ కోసం మీ నుండి జవాబు కోసం ఎదురు చూస్తూ ………
మీ ఆముదాల ఆంజనేయులు
అంబానీగారికి వినమ్ర వార్నింగ్ - మా అంజిగాడి ఐడియాలతో నేను అనగా అమృతం , అంబానీ అనగా మీ రేంజ్ కి చేరలేదు , కానీ మావాడి ఐడియాలతో మీరు అనగా అంబానీ కచ్చితంగా నా రేంజ్ కి చేరుతారు.