తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశాన్నంతటికి ఫార్మా రంగంలో ఆయనొక దిగ్గజం.. మీ ఇండియన్స్ కేవలం నాటువైద్యం మాత్రమే నమ్ముకునే అనాగరికులు అనుకునే విదేశియులకు ఆయనొక సమాధానం.. ఖరీదైన మందులను పేద మధ్యతరగతి వారికి అందుబాటులోకి తెచ్చిన మహానుబావుడు.. అతడే Dr. Reddy's Lab అధినేత మన తెలుగువాడు కల్లాం అంజిరెడ్డి. అంజి రెడ్డి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రెడ్డి గారి తండ్రి ఒక పసుపు రైతు. చిన్నప్పటి నుండి అతనేం బ్రిలియెంట్ స్టూడెంట్ కాదు పుస్తకాలు అంతగా చదివేవారు కూడా కాదు ఆటలు కూడా ఆడేవారు కాదు.. కాని దేనిమీద ఐనా పరిశోధన చేయడమంటే మహా ఇష్టం. తనతోటి క్లాస్ మేట్స్ ఫేయిల్ ఐతే రెడ్డిగారు మాత్రం క్యాజువల్ గా చదివి పాస్ అయ్యేవారు. గ్రాడ్యువేషన్ గుంటూరు ఏ.సి కాలేజిలో చేసి, ఫార్మాసూటికల్స్ కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్, పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబరేటరీలో పీహెచ్‌డీ చేశారు.
రెడ్డి గారి కాలంలో పైజర్ అనే ఫార్మా కంపెనీ మంచి లీడ్ లో ఉండేది అంతర్జాతీయ స్థాయిలో దానికి గొప్ప పేరు ఉంది దానిని తలదన్నేల ఒక కంపేనీని స్థాపించాలనుకున్నాడు.. పి.హెచ్.డి చేస్తున్నప్పుడే ఈ బలమైన లక్ష్యం అనుకున్నాడు. అలా యూనిలాయిడ్స్ తో మొదలైన ప్రస్థనం 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వరకు అవిశ్రాంతంగా సాగింది అందుకోసం కేవలం 25 లక్షలతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్తాపించారు. ఇక అప్పటి నుండి తన పరిశోధన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. Ibuprofen అనే నొప్పిని తగ్గించె మందును తయారుచేసి తక్కువ ధరకే అమెరికాకు సరఫరా చేసేంత స్థాయికి ఎదిగారు ఆ ఒక్క మందుతో ప్రపంచస్థాయిలో రెడ్డీస్ ల్యాబ్ ఒక సంచలనం అయ్యింది.
పి.హెచ్.డి చేస్తున్న సమయంలోనే అమెరికాలో ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చినా నా అవసరం నా దేశానికై అవసరం అని రెడ్డీస్ ల్యాబ్స్ ద్వారా ఇప్పుడు అమెరికాకే మందులను పంపించే స్థాయికి ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద కంపెనీలన్నీ ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లరూపాయలు కేవలం పరిశోదనలకే ఖర్చుచేస్తాయి ఒక కొత్త మందును కనిపెట్టడానికే వేల కోట్ల అవసరం ఉంటుంది కాని ఇంతటి ఖర్చును మన భారతీయ కంపెనీలు వెచ్చించలేవు.. అంజి రెడ్డి గారు మాత్రం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేవారు. ఇదంతా కేవలం ప్రయోగదశకు ముందు పెట్టుబడిపెట్టే మొత్తం ఇలా తక్కువ ఖర్చుతో మందులను తయారుచేసి ఈరోజు ప్రపంచస్థాయి కంపెనీలకు ధీటుగా రెడ్డీస్ ల్యాబ్ ఎదిగింది.
దేశంలో మొదటిసారిగా Antibiotic మందు Metronidazole సల్ఫర్ మెటాక్ససోన్ ను తయారుచేశారు ఇవే కాదు ఎన్నో రకాల మందులను తయారుచేశారు. మనదేశంలో విటమిన్ టాబ్లెట్స్ కూడా అందుబాటులో లేని కాలంలో ఆయన సంస్థ ద్వారా అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగితా వారికి రెడ్డి గారికి ఉన్న తేడా వ్యాపారంలో కూడా తన సేవను కొనసాగంచాడు. 1989లో Norfloxacin ధరను 8 రూపాయల నుండి 3 రూపాయలకు తగ్గించారు, Ciprofloxacin ను 20రూపాయల నుండి 12 రూపాయలకు తగ్గించారు గుండే సంబందిత వ్యాదులకు Stamlo beta మందులను తయారుచేసి తక్కువ ధరకే అందించారు. ఒక స్టేజ్ లో ఒక డ్రగ్ సక్సెస్ అయినంత మాత్రానా అక్కడితో ఆగిపోలేదు ఎప్పటికప్పుడు ఇంకో కొత్త రకమైన మందును కనుగొంటు సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రెడ్డి గారు ఫార్మ రంగంలో చేసిన సేవలకుగాను ఆయన అందుకున్న అవార్డులన్ని అత్యున్నత మైనవే... ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన డా. రెడ్డీస్ ల్యాబ్స్ అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
అందుకున్న అవార్డులు: అంజిరెడ్డి కొంతకాలంగా కంపెనీ కార్యకలాపాలకు దూరంగా ఉంన్నా సేవారంగంలో తన కృషిని చివరి వరకు కొనసాగించారు. రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
1984, 1992 సర్, పి.సి. రాయ్ అవార్డు 1998 ఫెడరల్ ఆఫ్ ఏషియన్ ఫార్మాసూటికల్ అసోషియేషన్ అవార్డు 2000 కెంటెక్ పౌండేషన్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2001 బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుండి బిజినెస్ మ్యాల్ ఆఫ్ ద ఇయర్ 2011 పద్మశ్రీ పద్మభూషణ్
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.