Contributed By Uday Kiran Dasharadhi.
చిన్నపటి నుండి అర్దమవని చాలా విషయాలు ఏజ్ , ఎడ్యుకేషన్ తర్వాత అర్ధమయ్యేవి. కొన్ని చుట్టూ ఉన్న సమాజం నేర్పిస్తే మరి కొన్ని ఫ్రెండ్స్, టీచర్స్, ఇలా చాలా మంది నేర్పేవాళ్ళు. ఎంత లేట్ అయినా, ఎంత లోతైనా అడిగి తెలుసుకునే వరికి ఊరుకునే వాడిని కాదు. ఎవరో చెప్పినట్టు ప్రశ్నని ప్రశ్నలా వదిలేయడం కంటే ప్రాణాలు వదిలేయడం బెటర్ అని, అంతలా కాదు గాని మరీ ఏది చేసినా అదే గుర్తొచ్చేది..!
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ నాకర్థమవ్వని రెండు విషయాలున్నాయి. అవేం పెద్ద ధర్మసందేహాలు కాకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో చిరాకు తెప్పించి పిచ్చి పట్టించేస్తాయ్.
అవే "What is X " & "నలుగురూ ఏం అనుకుంటారు" .'X' ని ఇంజనీరింగ్ తో పాటే వదిలేసాననుకోండి అది వేరే విషయం... మరి మా వాళ్ళు పదే పదే గుర్తుచేసే ఆ నలుగురు ఎవరో ఇప్పటికి నాకు తెలీలేదు.. (School) చదుకోవాలిరా, చదుకోకపోతే నిన్ను సరిగా పెంచట్లేదని నలుగురూ నన్ను మీ నాన్నని అంటారు..,
College: పాస్ అవ్వాలిరా, సప్లీలు పెట్టుకుని సంవత్సరం వేస్ట్ చేసుకుంటే నిన్ను సరిగా పెంచలేదని నలుగురూ నన్ను మీ నాన్నని అంటారు..,
Job: ఎదో ఒక జాబ్ చేయాలిరా, ఇంత చదువు చదివి ఏ పని చేయకపోతే ను సరిగా పెరగలేదని నలుగురూ నన్ను మీ నాన్నని అంటారు..,
Marriage: సంపాదిస్తున్నావ్ ఇంకా పెళ్లి చేసుకో, పెళ్లి వద్దంటే నూ సరిగ్గా లేవని నలుగురూ నన్ను మీ నాన్నని అంటారు..., After Retirement: ఈ వయసులో నీకు ఆ సరదాలేంటి నలుగురూ విన్నా, చూసినా ఏమనుకుంటారు ?
ఇంతగా వెంటాడే ఆ నాలుగురెవరో ! జీవితాలని మార్చగలిగే ఆ నలుగురు మీకేమైనా తెలుసా ?
**అసలు పట్టించుకోవట్లేదు గాని ఆ ఒక్క మాట అన్ని సార్లు వినడం వల్ల ఒత్తిడికి (పీర్ Pressure) లోనయ్యి యువతలో స్వతహాగా వచ్చే ఉత్సుకత అదే Curiosity చచ్చిపోతుంది. సగం యువతకి ఆ నలుగురు ఎవరో తెలుసుకునే అవకాశమొస్తే మాత్రం వాళ్లకు మామూలుగా ఉండదు.
కలల రెక్కలతో ఎగరాల్సిన యవ్వనాన్ని "ఆ నలుగురి" కోసం బానిసత్వానికి అలవాటు చేయడం అంటే.., చిన్న దెబ్బ తగలకుండా, చుక్క రక్తం చిందకుండా, ఎదగాలి గెలవాలి అంటున్న నర నరం చిదిమేసి చంపడమే..!