The Third Episode Of Antharmadhanam Will Remind You Of Your Childhood Crush!

Updated on
The Third Episode Of Antharmadhanam Will Remind You Of Your Childhood Crush!

Click here to view Episode 1 , Episode 2

Contributed by Bharadwaj Godavarthi

పేపర్ స్లయిడింగ్(Started Writing)

"ప్రేమ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య అవగాహనా , కాదు! ప్రేమ అంటే మొదటి చూపులో కలిగే ఆకర్షణా, కాదు! ప్రేమ అంటే ఇద్దరి వ్యక్తుల ప్రయాణమా, కాదు! ప్రేమ అంటే నేను, నా అనే వ్యక్తిత్వం."

"నిజమే కదా, ప్రేమ అంటే 'నా' అనే వ్యక్తిత్వం నుండి ఉద్భవించిన ఒక అనుభూతే కదా?"

"అంతర్లీనంగా 'నా' అనే వ్యక్తిత్వపు అభిరుచులకు దెగ్గరగా ఉన్న మరొక వ్యక్తిత్వాన్ని కలుసుకున్నప్పుడు (లేదా) చూసినప్పుడు (లేదా) సుదూరాల నుండి నాలా అనుభవిస్తున్నప్పుడు, మన మనసుకు తెలియకుండా, అది కలుగచేసే 'స్పర్శ' తాలూకు అనుభూతే 'ప్రేమ'. "

ఏంటీ, ఇప్పుడెందుకు ప్రేమ గురించి రాస్తున్నానా? నువ్వే ఇందాక అడిగావు కదా, నిన్ను ఎప్పుడైనా విడిచి వున్నానా అని? ఆ కధ గురించి నీకు చెప్పాలంటే, ముందుగా ఇన్నాళ్ల ప్రయాణపు అనుభవం తరువాత 'ప్రేమ' మీద నాకున్న అభిప్రాయం రాయాలనిపించింది.

"కానీ అప్పట్లో ప్రేమ అంటే మాత్రం??"

పేపర్ స్లయిడింగ్(Started Writing Again)

Date: 15/08/2000 Time: 10:30 Am Premises : School

"Now special song by our school "SPL" 'సిరి కుందన' "

"ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగు బాసన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా... వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది ॥"

Present - 2018 (With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఏంటీ! ఆ, ఆ అమ్మాయే! అందులో నేనెక్కడ ఉన్నానా?

అదిగో అక్కడే, ఆ పిల్లలలో? అన్ని చపట్ల మధ్యన, నా 'కను రెప్పల చప్పట్ల చప్పుడు' తనకు వినపడాలని అదేపనిగా కోరుకుంటూ తననే తన్మయంతో చూస్తూ ఉన్న ఆ పిల్లోడిని నేనే.

ఏంటీ! అంత తన్మయంతో చూడడానికి తనలో ఉన్న ప్రత్యేకత ఏంటా?

తెలీదు, కానీ ఎప్పుడూ తను నాకు ప్రత్యేకమే!

"సంతోషాన్ని వ్యక్తం చేసే ఆ కళ్ళు, చిరు గర్వాన్ని చూపించే అందమైన చెవి దిద్దులు, ఎప్పుడూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే మెడ, తన స్వతంత్ర భావాల్ని వ్యక్త పరుస్తూ ఎప్పుడూ గాలికి ఎగిరే తన కురులు"

ఒక మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పలేము అనుకో!!

కానీ,

నువ్వు 'ఆనంద్' సినిమా చూసావా? లేదా! అందులో రూపలా ఉంటుంది నా 'సిరి కుందన'.

తనకు ఎప్పుడూ ఆ సినిమాలో "వేటూరిగారు" రాసిన మాటలు చెప్పాలనిపించేది

"మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెలో మనసు కధా మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెలో మనసు కధా"

కానీ, ఎందుకో తనతో ఒక్కసారి కూడా మాట్లాడడం కుదర్లేదు!

ఏంటీ? అవును ఒక్కసారి కూడా మాట్లాడలేదు! YES, "మొదటి ప్రేమ" అన్నాను, YES "FIRST LOVE" అని కూడా అన్నాను! కానీ, ప్రేమిస్తే మాట్లాడాలి అన్న రూల్ లేదు కదా!

ఏంటీ?

మరి, ఎందుకు తనని అంతలా ఆరాధిస్తున్నానా? తెలీదు! మనసు మంచిదా? అస్సలు తెలీదు! రూపం చూసి పడిపోయినా? తెలీదు! కనీసం తన అలవాట్లు, అభిరుచులు, చెప్పాలా? తెలీదు! మరి ఎలా ప్రేమించానా? తెలీదు!

ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు, ఆశ్చర్యపోతావు?

నిజంగానే చెప్తున్నాను, నాకు తెలీదు!!

బహుశా ఇవేమి తెలుసుకోలేదు కాబట్టే ఆ ప్రేమ ఇంకా అంత పదిలంగా నా మనసులో ఉండిపోయింది.

ఎందుకో తెలీదు, నా జీవితంలో తను ఎప్పటికీ అనుచరించలేని 'ప్రేమ' నిర్వచనం అయిపొయింది.

అబ్బా, తనతో ఒక్క జ్ఞాపకం కూడా నాతో లేదు అని చెప్పా కదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు??

సర్లే ఆగు ఆలా అలగకు, చెప్తాను. ఒకే ఒక్క జ్ఞాపకం ఉన్నటు ఉంది.

అనుభూతుల పొరల నుండి బయటకు తీసుకువస్తాను, కాసేపు ఆగు.

"అమంగళం ప్రతిహతం అవ్వుగాక"

ఏంటీ! ఇప్పుడేం అమంగళం జరగలేదు. అది ఆ అమ్మాయి ఊతపదం.

ఎప్పుడు వాడిందా?

పేపర్ స్లయిడింగ్(Started writing again)

Date: 23/10/2000 Time: 3:30 Pm Premises : Class

సిరి కుందన:

"Good Evening all, This is "Siri Kundana". Today I came here to request you all that in few days 'SCHOOL PEOPLE LEADER' elections are going to be conducted and you all know that I am one of the participant. You also know that how responsible I am as 'SPL' and my activities during recent tenure. In this new tenure also I promise you to resolve all the issues that you are facing. Please vote for me. Thank You"

నేరేటర్ ఫ్రెండ్: అన్నీ అబద్దాలే, ఏమీ చేయలేదు తను. ఈసారి మాత్రం మన సునీల్ గాడినే గెలిపించాలి. ఈ అమ్మాయికి చాలా పొగరు ఎక్కువ. నువ్వు కూడా మాకే సపోర్ట్ చేయాలి?? నేరేటర్: ఆ, సరే రా!! నేరేటర్ ఫ్రెండ్: సరే అంటే? ఎవరికీ వేస్తావు ఓటు? నేరేటర్: సునీల్.

Present - 2018 (With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఏంటీ , లేదు సునీల్ కి వేసాను నా వోట్. నిజమే చెప్తున్నాను!

ఎందుకు అంటే?? ఏమో నాకే తెలీదు? బహుశా తనకున్న చెవి దిద్దు అంత పొగరు వల్ల కావచ్చేమో.

అరే!! నువ్వు మధ్య, మధ్యలో, వచ్చి అసలు కధ నుండి బయటకు లాగేస్తున్నావు . చెప్పనీ తను ఆ మాట ఎప్పుడు ఆందో.

ఆ రోజు ' SCHOOL PEOPLE LEADER' రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం, లక్కీగా తన 'చుట్టూ పక్కల' నిలబడే అవకాశం దొరికింది. తను చాల కూల్ గానే ఉంది.

కానీ తన పెదాలు కదులుతూనే ఉన్నాయి. ఏదో గొనుకుంటున్నట్టు అనిపించింది. ఏమి అంటోందో విందాం అని కొంచం పక్కకి వెళ్ళాను.

పేపర్ స్లయిడింగ్(Started writing again)

Date: 23/10/2000 Time: 5:30 Pm Premises : స్టేజి

సిరి కుందన: "అమంగళం ప్రతిహతం అవ్వుగాక, అమంగళం ప్రతిహతం అవ్వుగాక, అమంగళం ప్రతిహతం అవ్వుగాక"

"Now we are going to announce the results of newly elected 'SPL' for this year."

సిరి కుందన: "అమంగళం ప్రతిహతం అవ్వుగాక, అమంగళం ప్రతిహతం అవ్వుగాక, అమంగళం ప్రతిహతం అవ్వుగాక"

"He is none other than sunil. Congratulations Sunil"

Present - 2018 (With narrator, His Imaginary Friend(ఒంటరితనం))

ఏంటీ ఆలా ఉండిపోయానా?

లేదు, ఆ రోజు మొదటిసారి 'ఆత్మవిశ్వాసం కంటతడి పెట్టుకోడం చూసాను', 'కఠినంగా కనపడే వ్యక్తిత్వం మనసు చాలా సున్నితం అని అర్ధంచేసుకున్నాను'.

మనసు అదోలా అయిపొయింది. ఏదో నేను వోట్ వేయకపోవడం వల్లే తను ఓడిపోయింది అన్న ఫీలింగ్

ఏంటీ , మంచి ఫీల్లో ఉంటె ఓ అడ్డుపడుతావు?

ఏంటీ , నేనెప్పుడు 'అమంగళం ప్రతిహతం అవ్వుగాక' అని అనుకున్నానా.

ఆ మాట ఎప్పుడు అనుకోలేదు కానీ, ఒక్కసారి అలాంటి సందర్భం వచ్చింది.

పేపర్ స్లయిడింగ్(Started writing again)

Chapter 3 : " అమంగళం రాగం " ----------To Be Continued----------