Contributed by Bharadwaj Godavarthi
----జ్---జ్----- Alarm - 3:30 AM ----బజ్ బజ్ బజ్...బజ్ బజ్ బజ్---- stop 4:00 AM బజ్ బజ్ బజ్...బజ్ బజ్ బజ్ -------హా---------- ఓయ్, ఇక్కడ ఉన్నావ్ ఏంటీ?? నిన్నే?? మాట్లాడవే?? --హాష్--సరే washroomకి వెళ్లొచ్చి నీ పని చెప్తానుండు... --ప్లిష్--ప్లిష్--(water sound ) స్లాం----(Door Closed ) ఓయ్, ఎక్కడ ఉన్నావ్?? --క్లిక్(light switches sound )-- ఓహో, ఇక్కడ కూర్చున్నావా! నిన్న రాత్రే చెప్పాను కదా, లేచేసరికి నువ్వు నా కంటికి కనపడకూడదు అని. మళ్ళీ ఎందుకు వచ్చావ్? రాత్రి అంతా నా పక్కనే ఉన్నావు కదా! కనీసం నేను నిద్రపోయేటప్పుడు కూడా నన్ను వదిలిపెట్టవా? ఇంత అరుస్తున్నా కదా, ముంగిలా అలా కూర్చుంటావే! మాట్లాడు. మాట్లాడవా? సరే, ఇంక నుండి నేను కూడా నీతో మాట్లాడను! ---నిశ్శబ్దం--- అయినా మాట్లాడవా? అంతేలే, నీకు నేను మాత్రమేనా. ఈ రాత్రి, నువ్వు నాతో పాటు ఎంత మంది పక్కన ఉంది ఉంటావో. సరే, నువ్వు మాట్లాడితే నాకేంటి, మాట్లాడకపోతే నాకేంటి? ఎలాగో ఎప్పుడూ నాపక్కనే ఉండి చస్తావు కదా? నాకిపుడో ముఖ్యమైన పని ఉంది. నేనో కధ రాయాలి. చాల తక్కువ సమయం ఉంది. కాసేపు నన్ను వదిలేయ్, ప్లీజ్!! ------గుర్----గుర్----గుర్(pouring coffee from jug )---- ----ఆహ్(after first sip )-- ----ఆలోచన---- ---స్లైడింగ్ పేపర్స్---- దేని గురించి రాదాం?? ఏంటీ, సణుగుతున్నావ్! గట్టిగా, చెప్పు?? నీ గురించి రాయాలా? ఇప్పటిదాకా ఎంత మొత్తుకున్నాను, నోరు విప్పావా! లేదే? దేని గురించి రాదాం అంటే మాత్రం, వెంటనే నీ పేరు చెప్తావా. ఎంత స్వార్ధం నీకు? నేను రాయను.. ఏం చేస్తావో చేసుకో! ఏంటీ వదిలేసి వెళ్ళిపోతావా. వెళ్ళిపో? ఎవరికి ఎక్కువ?? ఓయ్, ఏంటీ నిజంగానే వెళ్ళిపోతున్నావా? ఆలోచిస్తాను ఉండు రాయాలో, వద్దో?? ఓయ్!! ఓయ్!! వెళ్ళిపోకు ప్లీజ్. రాస్తాను, రాస్తాను.. నువ్వు లేకపోతే నేను ఉండలేను!!ప్లీజ్ ఉండు. నీకంటే, చాలా మంది స్నేహితులు ఉంటారు. ఎప్పుడు ఎవరితో ఒకరితో ఉంటావ్. నాకు అలా కాదు! నువ్వు మాత్రమే స్నేహితుడివి...నువ్వులేకపోతే నేను లేను.. ---స్లైడింగ్ పేపర్స్---- సరే ఏమని రాయమంటావ్, నీ గురించి? అసలు టైటిల్ ఏం పెట్టమంటావ్? నీ పేరే పెట్టనా! సరే! ---స్లైడింగ్ పేపర్స్--- ఒంటరితనం: ------- టైటిల్ మరీ ముతకగా ఉంది. నో !!వెళ్ళదు ఆగు, రాస్తున్నా "నిశ్శబ్దానికి కూడా ఒక శబ్దం ఉంటుంది, అది మనసుతో వింటేనే వినపడుతుంది, అలా మనసుతో వింటే కనపడే రూపం ఉంటె, ఆ రూపం రేపు 'ఒంటరితనం' ". థాంక్స్, నచ్చిందా నీకు? చిన్న సందేహం?? నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా మిగిలిపోయావా?? ఎప్పుడైనా, "రవిని మింగిన అసుర సంధ్య "ఆనందంతో, 'చీకటిని', ప్రపంచం మీదకు కమ్ముతున్న వేళ, ప్రాణ వాయువు యొక్క సన్నిహిత్యానికి దూరమై, ఒంటరిగా ఏ సముద్రం ఒడ్డునో, వెర్రి ఆలోచనలతో, ఒంటరిగా మిగిలిపోయావా??? మళ్ళీ నిశబ్దమా?? సరే?? నీ గురించి ఇంతకన్నా ఏం రాయాలో తోచట్లేదు, నువ్వే చెప్పు, ఏమి రాయమంటావో? నీ పుట్టుక గురించా? నాకేం తెలుసు, నువ్వెప్పుడు పుట్టావో?? ఓహో, నాలో నీ పుట్టుక గురించా!! బావుంది ఆలోచన. కానీ, దానికి ఒక టైటిల్ పెట్టాలి, ఎందుకంటే అది నా జీవితంలో ఒక సెపెరేట్ చాప్టర్. సరేనా!! --పేపర్స్ స్లైడింగ్--- chapter 1 : వాసంత సమీరం: ---To Be Continued -------