Contributed by Bharath Dhulipalla
అది ఒక మారుమూల గ్రామం ,చాలా తక్కువ మంది నివసిస్తున్నారుఅక్కడ. ఆ ఊరు చివర ఒక అడవి ఉంది. ఒక రాత్రి కృష్ణ సినిమా కి వెళ్ళివస్తూ ఆ అడవి గుండా తన ఊరికి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు. చుట్టూ చెట్లు ఇంకొంచెం దూరం వెళ్తే వాళ్ళ ఇల్లు వస్తుంది . ఇంతలో ఒక కారు వేగముగా వచ్చి ఒక చెట్టుని ఢీ కొట్టింది.కృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసాడు ఏమి జరిగిందో అని , ఆ కారులో ఒక మనిషి తల నుండి రక్తం కారుతూ కారు స్టీరింగ్ మీద కాస్త నొప్పితో " ఆ హ్ " అని శబ్దం చేస్తూ కారు స్టీరింగ్ మీద తల పెట్టుకొని లేవడానికి ఓపిక లేక అలా పడుకొని ఉన్నాడు.అతను ఎలా ఉన్నాడంటే "నల్లటి కోటు, నల్లటి షర్ట్ , నల్లటి ప్యాంటు మరియు నల్లటి టోపీ తో ఉన్నాడు ". అతను తన తలకి ఉన్న టోపీ ని కారు స్టీరింగ్ కి ఆనిచ్చి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు.
కృష్ణ అక్కడికి వెళ్లేసరికి ఆ వ్యక్తి తల నుండి రక్తం కారుతూ ఉంది. ఆ వ్యక్తి తల నుండి ఒక్కో రక్తం చుక్క కింద ఉండే గేర్ మీద పడుతుంది.ఆ కారు కూడా పనిచేయట్లేదు ఎందుకంటే కారు వెళ్లి చెట్టుకు గుద్దుకొని కారు స్టెప్నీ కూడా దెబ్బతింది .కృష్ణ అలా ఎం చెయ్యాలో తెలియని పరిస్థితి ఫోన్ చెయ్యడానికి ఫోన్ సిగ్నల్ కూడా లేదు. అప్పుడే కృష్ణ అలా కారు మొత్తం చూస్తుండగా కారులో ఒక suitcase కాస్త తెరచి ఉండడం గమనించాడు.అది ఎలా తెరచి ఉందంటే ఒక డబ్బు నోట్ల కట్ట కాస్త బయటకి కనిపించేట్టట్టు సగం లోపల సగం బయటకి ఉంది.
కృష్ణకి అది చుసిన వెంటనే ఆ డబ్బు ని ఎలాగైనా తీసుకోవాలి అని డబ్బు మీద అత్యాశ ఎక్కువైంది.కృష్ణ ఎలా ఆలోచించాడంటే "అతను ఎలాగైనా చనిపోతాడు, తనకి డబ్బు అవసరం కాబట్టి అతనిని వదిలేసి ఆ suitcase ని ఎలాగైనా తీసుకు వెళ్ళాలి " అని అనుకుంటాడు. ఆ డబ్బు ఉన్న suitcase ని తీసుకొని అతను కాస్త భయంతో , కాస్త కంగారుతో వాళ్ళ ఇంటికి పరుగెత్తుతున్నాడు. అతను ఉండేది ఒక చిన్న Forrest ఏరియా , అక్కడ ఒక 10 ఇల్లు ఉంటాయి. కృష్ణ ఆ suitcase తో వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు.అతను ఇంటికి చేరుకోవడానికి ఇంకొంచెం దూరం ఉండగా కృష్ణకి ఎదో శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు , కృష్ణ కి కాస్త భయం ఎక్కువైంది. అతను కాస్త ముందుకు వెళ్లి మల్లి ఎదో శబ్దం వచ్చిందని మల్లి వెనక్కి తిరిగి చూసాడు.
అది చలికాలం, మంచు అలా రోడ్డు పక్కన ఉన్న చెట్ల దగ్గర మంచు కప్పబడి ఉంది.కృష్ణకి ఎదో శబ్దం వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి, ఆ మంచులో తనకి ఆ కారు లో ఉన్న వ్యక్తి కనిపించాడు. అతని మోహము కనిపించట్లేదు. అతని టోపీ అతని మోహమునకు అడ్డుగా ఉంది , చేతిలో గన్ ఉంది.అతని మొహం నుండి కారుతున్న రక్తపు బొట్లు మంచు తనలో కలుపుకొని తీసుకు వెళ్తున్నట్టుగా కింద పడుతుందో లేదో అన్నట్లుంది. కృష్ణ కారు లో కూడా అతని మోహము చూడలేదు.
కృష్ణకి అతన్ని చూడగానే భయం ఎక్కువయింది, ఏమి చెయ్యాలో తోచట్లేదు .అతని చేతిలో గన్ చూడగానే కృష్ణ కి భయం ఎక్కువైంది.suitcase వదిలితే తాను బతకొచ్చు అన్న ఆశతో కృష్ణ ఆ suitcase ని అక్కడ వదిలి , వెనక్కి చూసుకోకుండా వేగముగా పరిగెడుతూ ఉన్నాడు. అతను సరిగ్గా తన ఇంటికి వచ్చి వెనక్కి తిరిగి చూసాడు వెనకాల ఎవ్వరు లేరు.కృష్ణ మోహములో కాస్త ఆనందంతో లోపలికి వెళ్ళడానికి ఇంటి తలుపు తాళం పెడుతుండగా , ఆ తలుపు మీద ఒక్కసారిగా ఒక నీడ పడింది. కృష్ణకి కంగారు,భయం ఎక్కువైంది . అలా భయపడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగాడు.
అతనే ఆ కారు లో ఉన్న వ్యక్తి, మోహము మాత్రం కనిపించట్లేదు.అతని మోహము టోపీతో కప్పబడి ఉంది .వీధి లైట్ అతని టోపీ మీద పడటంవల్ల ఆ టోపీ నీడ అతని ముఖాన్ని కప్పేసింది,అతని నోరు మాత్రమే కనిపిస్తుంది.భయం తో కృష్ణ అతన్ని అడుగుతున్నాడు " ఎవరు నువ్వు ? " అని, అతను ఏమి సమాధానం ఇవ్వట్లేదు . కృష్ణ అతనితో " నన్ను క్షమించు . ఎదో అత్యాశ తో తీసుకువచ్చాను. దయచేసి నన్ను క్షమించు" అని ఆ suitcase ముందుకు చూపిస్తూ బ్రతిమిలాడుతున్నాడు అక్కడే తన మోకాళ్ళ మీద కూర్చొని. కృష్ణ కళ్ళు మోసుకొని ఆ పొగని చేతితో పక్కకి అంటూ ఒక్కసారి అతను కళ్ళు తెరిచి చూసే సరికి తన ఎదురుగా గన్ పెట్టి ఉంది. ఆ వ్యక్తి కృష్ణని తల మీద కాల్చుతాడు, అతను బిగ్గరగా అరుస్తూ కింద పడిపోయాడు.
చుట్టుప్రక్కన వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చి అతని శవాన్ని చూస్తున్నారు. కృష్ణ ఇంటి దగ్గర్లో ఉన్న 'రాము' అనే వ్యక్తి వచ్చి అతన్ని శవాన్ని చూసి కాస్త భయంతో వెనక్కి వచ్చి చుట్టూ చూస్తున్నాడు. అతనికి కొంచెం దూరంలో మంచు పొగలో అదే వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని నోటిలో సిగరెట్ , కుడి చేతిలో suitcase ఎడమ చేయి అతని ప్యాంటు జేబులో ఉంది.అతని మోహము టోపీతో కప్పబడి ఉంది.అతని తల నుండి రక్తపు చుక్కలు కారుతున్నాయి.రాము కళ్ళను రుద్దుకొని మల్లి చూసాడు , కానీ ఆ వ్యక్తి అక్కడ లేడు..
- (ఇంకా ఉంది)