What Is 'Special Status' And Why Is It Essential For Andhra Pradesh's Development?!

Updated on
What Is 'Special Status' And Why Is It Essential For Andhra Pradesh's Development?!

"స్పెషల్ స్టేటస్" ఈ ఆమోద ముద్ర కోసం ఆంధ్రప్రదేశ్ చకోర పక్షిలా ఎదురుచూస్తుంది. నిజానికి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినా దాదాపు అన్ని సదుపాయాలు తెలంగాణాకున్నాయి. అన్ని రంగాలలో కనీసం పునాది స్థాయిలలో కూడా లేని దయనీయ స్థితి ఆంధ్రప్రదేశ్ ది. 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదాను కల్పించాయి. ఇందులో జమ్ము కాశ్మీర్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, నాగాలండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా అందించింది. దీని ములంగా కేంద్రం రాష్ట్రానికి అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా నిధులు అందిస్తుంది. మాములు రాష్ట్రాలకు 30% గ్రాంటుగా 70% అప్పుగా ఆర్ధిక సాయం అందిస్తుంది, కాని ప్రత్యేక హోదా అందించిన రాష్ట్రాలకు మాత్రం 90% గ్రాంటుగా 10% అప్పుగా అందిస్తుంది. గ్రాంటు అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.. 2011-2012 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు రాష్ట్రాలన్నీటికి కలిపి కేంద్రం 4.50 లక్షల కోట్ల నిధులను ఆ రాష్టాలకు అందించింది. పన్నులు, ఇతర ఆదాయాల ద్వారా వచ్చినదాంట్లో నుండి 56% నిధులను కేవలం పదకొండు రాష్ట్రాలకు మళ్ళించింది అంటే అర్ధం చేసుకోవచ్చు స్పెషల్ స్టేటస్ వల్ల రాష్ట్రాలకు లభించే ప్రోత్సాహం ఎంతటి స్తాయిలో ఉంటుందో అని..

ముందుగా ప్రత్యేక హోదా వల్ల వచ్చె కొన్ని లాభాలను తెలుసుకుందాం..

1. 100% ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు లభిస్తుంది. 2. పారిశ్రామిక కంపెనీలన్నింటికి 100% ఆదాయపు పన్ను రాయితీ ఉంటుంది. 3. ప్రతి పెట్టుబడి దారుడికి తన కంపేని పెట్టుబడిలో 30% సబ్సీడిగా కేంద్రం అందిస్తుంది. 4. రవాణా ఖర్చులపై 90% రాయితీ ఉంటుంది. 5. మారుమూల గ్రామాల అభివృద్ది కోసం ప్రత్యేకంగా కొంత ఎక్కువ నిధులు అందుతాయి. 6. స్థాపించే ప్రతి నీటిపారుదల ప్రాజెక్టులు వంటి భారీ ప్రాజెక్టులకు 90% నిధులను కేంద్రమే భరిస్తుంది. 7. రాష్ట్ర బడ్జెట్ లోటును కేంద్రమే భరిస్తుంది. 8. Working Capital కోసం తీసుకున్న అప్పులపై కంపెనీలపై 3% వడ్డి లో రాయితీ ఉంటుంది. 9. ఇంతేకాదు కొత్తకంపెనీలకు అందించే ప్రోత్సహకాల మూలంగా రాష్ట్రాంలో దేశ, విదేశీయులు పెట్టుబడులు పెట్టడం వల్ల స్థానికంగా ఉన్న యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకెంతో మందికి ఉపాది దొరుకుతుంది. 10. ఆదాయ పన్ను లేకపోవడం , పెట్టుబడిలో సబ్సీడి వంటి వాటివల్ల కంపనీలు ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు సగానికి పైగా తగ్గుతాయి ఇటు వినియోగదారులకు కూడా లాభాలు చేకురుతాయి.

ఇంతే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభి వృద్దికి కేంద్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. దశల వారిగా, అంశాల వారిగా ఆయా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ ఇత్యాది అంశాలన్నీటిపై ప్రత్యేక శ్రద్ధతో లోపాలన్నింటిని పరిష్కరిస్తుంది..

ఇది అంతా బానే ఉంది కాని ఇది మన ఆంధ్రులకు అందింతేనే అసలైన అభివృద్ది. నిజానికి విభజన సమయంలో కాంగ్రెస్ పార్టి తెలంగాణా ఇచ్చెయ్యాలి, తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ అంతా తనకే దక్కాలి అని తొందరపడి చిందర వందరగా విభజించేసింది తప్పా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటి? అందుకు తీసుకోవాల్సిన చర్యలు, చట్టాల గురుంచి పట్టించుకోక పోవడం వల్లనే ఈ దుస్థితి.! దేశమంతటికి దేవాలయం లాంటి ఘనత వహించిన పార్లమెంట్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తాము అని ప్రకటించారు కాని బి.జే.పి నాయకులు వెంకయ్య నాయుడు ఇంకో అడుగు ముందుకేసి రాజ్యసభలో 5సంవత్సరాలు కాదు ఏకంగా 10సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రకటించి ఇప్పుడు వెనక్కి తగ్గారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్, చతీస్ ఘడ్ రాష్ట్రాలు కూడా హోదా కోరుతున్నాయి మీ ఒక్కరికి ఇస్తే మిగిలిన వారందరి నుండి ఒత్తిడి ఉంటుంది అంటు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు కాని చిత్తశుద్ది ఉంటే అన్ని ఆటంకాలను దాటి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వగలదు.. ఖచ్చితంగా కేంద్రం ఇవ్వగలదు.

SH-2

కాంగ్రెస్ పార్టి వల్లనే ఈ పరిస్థితి అని అని బి.జే.పి విమర్శిస్తుంది కాని నిజానికి... "ఒక వ్యక్తికి గాయమైంది రక్తం కారిపోతుంది అత్యవసరంగా చికిత్స అందించాలి అందుకోసం అతను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గాయానికి వైద్యం చేయాలి తప్పా ఆ గాయన్ని చేసిన వ్యక్తిని తిడుతూ వైద్యం అందించకుండా కుర్చుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత వైఖరి అలానే ఉంది. మనకు నచ్చిన వ్యక్తి నమ్మించి మోసం చేస్తే చాలా భాదగా ఉంటుంది ఎలక్షన్ల ముందు ఒక మాట ఇప్పుడొక మాట ఆంధ్రులందరు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ఎన్.డి.యె కూటమికి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు అలానే భాద పడుతున్నారు. ప్రత్యేక హోదా కల్పించి అభివృద్దికి ప్రోత్సాహం అందించాల్సిన భాద్యత కేవలం బి.జే.పి, తెలుగుదేశం మాత్రమే కాదు అడ్డగోలుగా విభజించిన కాంగ్రేస్ ది, ఎన్.డి.యే ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కొంత సామాజిక వర్గాన్ని నమ్మించిన పవన్ కళ్యాణ్ ది, విభజన సమయంలో అన్నిరకాలుగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటాం అని ప్రకటించిన కేసియార్ ది కూడా. ఏది ఏమైనా విడిపోయినా, కలిసున్నా, ఏది జరిగినా మన రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలనే ప్రతి ఒక్కరు కోరుకునేది..

SH-1

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.