కొంతమంది సమజానికి ఒకరకమైన సేవ చేస్తుంటారు. అనాథ పిల్లలను చదివించడమో, వృద్ధులకు ఆశ్రయం కల్పించడమో, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సంఘాన్ని సంఘటిత పరచడంలా వీడియోలు తీయడమో మొదలైనవి. అరవింద్ మాత్రం చరిత్రను వెలికితీసే సేవ చేస్తున్నారు. చరిత్ర తెలుసుకుంటేనే గతం తెలుస్తుంది. గతం నుండే భవిషత్తు నిర్మాణం ఆధారపడి ఉంటుంది. జనగామ జిల్లా కంచరపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఆ చరిత్రను వెలికితీసే యజ్ఞంలో నిమజ్ఞమయ్యాడు.
మన ఇష్టమే మన భవిషత్తును నిర్ణయిస్తుంది. అరవింద్ జర్నలిజం చదువుతున్నా కూడా వివిధ చారిత్రిక ప్రాంతాలను సందర్శిస్తుండడం మాత్రమే కాదు పుస్తకాలలో నిక్షిప్తం కానివి సైతం కనుగొని వాటిని ఉన్నతాధికారులకూ చేరవేస్తాడు. ముఖ్యంగా తన పరిసర ప్రాంతమైన వరంగల్ జిల్లాను పూర్తిగా తిరిగేశాడు. కాకతీయుల చారిత్రక కట్టడాలు, పురాతన విగ్రహాలు, వాటి తాలుకు ఆనవాళ్ళు ప్రాంతాలను వివరిస్తూ ప్రత్యేకంగా డాక్యుమేంటరీలను కూడా రూపొందించి సామాన్యులకు అహగాహన కల్పిస్తున్నారు.
ఈ ప్రయాణంలో ఇప్పటికి వెలికిరాని గత చరిత్ర ఆనవాళ్ళను వెలుగులోకి తీసుకువచ్చాడు. జయశంకర్ భూపాలపల్లి మల్లూరు కొండ ప్రాంతంలోని సుమారు 8కిలోమీటర్ల గోడను కనుగొన్నాడు. ప్రతి ప్రాచీనకాలం నాటి దేవాలయ గోడలపై ఆలయానికి సంబంధించిన చరిత్ర సంస్కృతంలో లిఖించబడి ఉంటుంది. వాటిని తెలుసుకుని, ఇప్పటి వరకు దాదాపు 600 ప్రాంతాలను క్షణ్ణంగా పరీశీలించి చరిత్రను అనేక ఆర్టికల్స్ రాస్తూ, దానితో పాటు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు.