రాంబాబుది ఏలూరు పక్కన వేలుపుచర్ల. పదుల సంఖ్యలో ఉన్న ఆ ఊరిలో ఉన్నది ఒక్క టీవి మాత్రమే. శుక్రవారం వచ్చిందంటే చాలు దురదర్శన్ లో వచ్చే చిత్రలహరి కోసం తన తోటి పిల్లలతో ఆ ఇంటికి వెళ్ళి మరి చూస్తుండేవారు. చదువుకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాదు, సినిమా పాటల పుస్తకాలు కూడా ఎంతో ఇష్టంగా చదివేవారు. ఇదేదో ఓ వినోదం కోసం మాత్రమే జరుగలేదు.. చిన్నతనం నుండి పాటలపై తనకుండే ప్రేమే అతనిని నడిపించింది.


రాంబాబు అమ్మానాన్నలు అంతగా చదువుకోలేదు కాని "మా జీవితం కన్నా మా ఆర్ధికపరిస్థితి కన్నా మా పిల్లల భవిషత్తు బాగుండాలని ఉన్న ఆ కాస్త పొలంతోనే ముగ్గురు పిల్లలను ప్రయోజికులను చేశారు". రాంబాబుకు చిన్నతనం నుండి మంచి పాటల రచయిత అవ్వాలని ఉన్నా గాని ఈ విషయాన్ని ఎప్పుడు అమ్మానాన్నలతో సీరియస్ గా చర్చించలేదు. కొన్నిసార్లు చిన్నతనం నుండి మనతో ఉన్న హాబినే మనకు కెరీర్ ను అందిస్తుందని అంటారు. టీవీలో, రేడియో లో, పుస్తకాలలో పాటలు వినడం చదవడం చేస్తుండడంతో తను గుర్తించని ఆ ఇష్టమే తన జీవితాన్ని మార్చివేసింది. ఆ ప్రేమే టాలెంట్ గా రూపాంతరం చెంది బ్యాంక్ ఆఫీసర్ జాబ్ ని సైతం రిజైన్ చేయించేలా చేసింది.

అప్పటి వరకు అమ్మానాన్నలకు తెలియదు: ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత మనోడు హైదరాబాద్ కు వచ్చాడు.. అమ్మానాన్నలకు జాబ్ కోసం అని చెప్పినా కాని తన మదిలోని రహస్య ఎజెండా మాత్రం రచయిత అవ్వడం. కొంతమంది మిత్రుల సహకారంతో "వియ్యాలవారి కయ్యాలు" సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గారిని కలిసే అవకాశం వచ్చింది. సన్నివేశం చెప్పి దీనికి తగ్గట్టు నువ్వు పాట రాయగలవా అని అడిగారట.. కేవలం రెండురోజుల్లో అద్భుతమైన లిరిక్స్ తో రమణ గారిని మళ్ళి కలవడం అతనికి విపరీతంగా నచ్చడంతో ఆ సాంగ్ ఒకే చేశారు. అప్పుడే "వియ్యాలవారి కయ్యాలు" సినిమాకు కొత్త లిరిక్ రైటర్ అని పేపర్ లో వచ్చినప్పుడు అప్పుడు అమ్మానాన్నలు తెలుసుకున్నారు తమ కొడుకు పాటల రచయిత అయ్యాడని.

బ్యాంక్ ఆఫీసర్ గా: ఆ తర్వాత కొన్ని సినిమాలకు రాసినా అవి రిలీజ్ కాకపోవడం మరికొన్ని కారణాల వల్ల ఓ మిత్రుని సహకారంతో ఓ ప్రయివేట్ బ్యాంక్ లో 5 సంవత్సరాల పాటు జాబ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగి అని సమాజంలో పేరు ఉన్న మంచి జీతం వస్తున్నా కాని తన మనసంతా సినిమాల మీదనే ఉండేది. ఉయ్యాల జంపాల సినిమాలో ఒక పాట రాయడం అది మాంచి సక్సెస్ అవ్వడంతో ఇక ఇదే నా జీవితంగా పూర్తి సమయాన్ని కేటాయించాలని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ కళామ్మ ఒడిలోకి వచ్చేసాడు.

నా పంతం ఎంత ఈ విశ్వం అంతా: ఒక్క అర్జున్ రెడ్డి ఎంతోమంది టాలెంట్ ఉన్న వ్యక్తుల జీవితాలను ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చింది. ఈ సినిమా కథను రాంబాబుకు డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు చెబుతున్నప్పుడే అతని కళ్ళల్లో ఆ సక్సెస్ కనిపించింది. ఇది మామూలు సినిమా కాదని తనకి అప్పుడే అర్ధం అయ్యింది. అదే సినిమాలో ఉద్విగ్నంగా "తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదని, హీరో ఫారెన్ లో ఉండగా వచ్చే "ఊపిరి ఆగిపోతున్నదే" పాటలు రాసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. "నచ్చిన పనిని పొందడం ఒక ఎత్తు ఐతే ఆ రంగంలో డబ్బు సంపాదించడం మరో ఎత్తు రాంబాబుకు డబ్బు సెకండరి తన ఇష్టాన్నే కెరీర్ గా మలుచుకుని అందులోనే ఆనందం అనే గొప్ప ఆస్తిని సంపాదిస్తున్నాడు"..
