బ్రహ్మా రాసిన సాధారణ రాతలపై చిత్ర గారి గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. కాసేపు ఈ "గీతలను" నిశితంగా పరిశీలిస్తుంటే మనకూ 'ఆ..!! ఏముందిలే, మనం కూడా ఓ పెన్ను పట్టుకుని సింపుల్ గా వెయ్యొచ్చని అనిపిస్తుంటుంది". ఇక్కడే చిత్ర గారు 100% సక్సెస్ అయినట్టు. చిత్ర గారి జీవన ప్రయాణం కాలిలో ముళ్ళు విరిగి, సగం ముళ్ళు పాదంలోనే ఉండిపోయిన తర్వాత కంకర తేలిన రోడ్డుపై చెప్పులు లేకుండా నడిచే నడక లాంటిది. వర్షానికి దుమ్ము దూళి కొట్టుకుపోయి ప్రకృతి స్పష్టంగా కనిపించినట్టుగా, ఆర్టిస్టు గుండె కూడా అలా తడవాల్సి ఉంటుంది, అప్పుడే అన్ని స్పష్టంగా ఆర్టిస్టుకు కనిపిస్తాయి. అందుకే అదేదో ఆర్టిఫిషియల్ గా బలవంతంగా తెచ్చుకున్నంత మాత్రాన పరిపూర్ణమైన ఆర్టిస్ట్ తయారుకాడు. వాడిని బాధలకు, కష్టాలకు గురి చెయ్యడానికి తగిన సంఘటనలను తయారుచేస్తుంది ప్రకృతి. ప్రతి ఒక్కరం ప్రకృతి కని, పెంచి పోషిస్తున్న బిడ్డలమే, ఐతే ఆర్టిస్ట్ పై ప్రకృతమ్మకు కాస్త ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. చిత్ర గారు అలా తయారు కాబడ్డ కొడుకు.
చిత్ర గారి నాన్న నందిపాడు జానయ్య గారు బండ రాళ్లతో దేవుళ్లను తయారుచేసేవారు. ఆయన తయారు చేసిన దేవత మూర్తులలో దైవం ప్రతిమ కనిపిస్తుంటుందని అందరూ అనుకుంటుంటారు. దేవుళ్లను తయారుచేసినా ఆ దేవుడు కానీ, వరాలు పొందుతున్న భక్తులు కాని వీరి జీవితాలలో సంతోషాన్ని నింపలేకపోయారు. చిత్ర గారు చిన్నతనంలో రెండు రూపాయల కూలీ కోసం దూగోడ పనిచేసేవారు. ఆ చిన్ని వయసులో అంతటి కష్టతరమైన పని నుండి తప్పించుకోవడానికి ఏదైనా తేలికపాటి పని చేసుకోవాలని అనుకున్నారు. రకరకాల పనుల తర్వాత చివరికి చిత్ర గారు ఆర్టిస్ట్ అయ్యారు. చిత్ర గారి గురించి ఒక్క ఆర్టికల్ లో వివరించడం చాలా కష్టం. ముందు ఆయన గీసిన బొమ్మలు చూద్దాం.. వచ్చే శనివారం ఇంకాస్త ఎక్కువ తెలుసుకుందాం..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.