All You Need To Know About "ARTOS" East Godavari's Very Own Soft Drink Brand!

Updated on
All You Need To Know About "ARTOS" East Godavari's Very Own Soft Drink Brand!

కేవలం స్టార్ హీరోలకు, పొలిటీషియన్స్, క్రికెటర్స్ కు మాత్రమే కాదండి మనం తీసుకునే ఫుడ్ కు కూడా మనం ఫాన్స్ ఐపోతాం. అలా అభిమానిస్తున్న వాటిలో మ్యాగీ, లిటిల్ హార్ట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. కేవలం టేస్ట్ విషయం అని మాత్రమే కాదు వాటితో మనకు మాటలో పరిపూర్ణంగా వర్ణించలేని ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉంటుంది, అలాంటి వాటిలో మన తాతల తరం నుండి ఇప్పటి పిల్లల వరకు "ఆర్టోస్ కూల్ డింక్ర్" కు ఎందరో ఆత్మీయులు ఉన్నారు.(వీరిని ఫాన్స్ అనే కంటే ఆత్మీయులు అనడం కరెక్ట్ అని).

1919 నుండి.. 1912లో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న రోజులలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చాలామంది బ్రిటీష్ సైన్యం వచ్చేవారు. అలసిపోయిన సైన్యానికి గోలిసోడాలు అమ్మేవారు అక్కడ ఉండే అడ్డూరి రామచంద్ర రాజు గారు. వారు సైన్యంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ఆ బంధంతో ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ తయారు చేసే మిషిన్స్ ను దిగుమతి చేసుకున్నారు. మొదట 1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో "ఆర్టోస్" గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే 'రాజు గారి కలర్ కాయ్' అని ప్రజలు ముద్దుగా పిలుచుకునే వారు. అప్పటి వరకు నిమ్మరసం, గోలిసోడాలు తాగుతున్న వారికి ఈ డ్రింక్ టేస్ట్ కొత్తగా అనిపించింది, ఇంకా గోదావరి జిల్లాలో ఉండే కొబ్బరి బొండాలు, గోదావరమ్మ నీళ్ళ లాగే ఈ Artos లోని రుచి నచ్చడంతో మంచి సక్సెస్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సక్సెస్ పరంపర అలా కొనసాగుతూనే ఉంది.

ఆర్టోస్ ను అమ్మేది లేదు.. ఆర్టోస్(1955) తర్వాత మనదేశంలో చాలా రకాల కూల్ డ్రింక్స్ వచ్చేశాయి. వాటిలో చాలా వాటిని 'కోక్' కంపెనీ కొనేసింది. కోక్ కంపెని మన ఆర్టోస్ కంపెనీని కూడా కొనేసి బ్రాండ్ నేమ్, టేస్ట్ మార్చెద్దామని అనుకుంది కాని రామచంద్ర రాజు గారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోటీ ఎక్కువైనా గాని మిగిలిన వాటి కన్నా తక్కువ ధరకే కేవలం 5రూపాయల కన్నా తక్కువ ధరకే అమ్మేవారు. అలా తక్కువ ధరకే అమ్ముతూ ఇప్పటికి మిగిలిన కూల్ డ్రింక్స్ పోటీని బలంగా ఎదుర్కుంటు ముందుకు సాగుతున్నారు.

ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆర్టోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగానే ఉంటుంది. కాని ఇది మన తెలుగు వారి సంస్థ కావడంతో Artosపై మన వారికి అభిమానం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇది కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో మాత్రమే దొరుకుతుంది ఐనా కూడా మంచి బిజినెస్ జరుగుతూ కోట్లల్లో టర్నోవర్ సాధిస్తుంది. మీరెప్పుడైనా ఆ వైపు వెళ్తే టేస్ట్ చూసేయండి మరి.