ఇటీవల విడుదలైన, అశ్వథ్థామ టీజర్, ట్రైలర్ ని చూస్తే, అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలపై, ఒక యువకుడు ఎలా స్పందించాడు. ఆ సమస్యని అరికట్టడానికి తన వంతు ప్రయత్నం ఏం చేసాడు అనే point మీద నడిచే కథ అని అర్థమవుతుంది. ఊహలు గుసగుసలాడే నుండి ఇప్పటివరకు పక్కింటి కుర్రాడిలా కనిపించిన, నాగశౌర్య ఈ సినిమా కి కథ రాసారు. తన makeover కూడా చాలా బాగుంది . కానీ, ఈ సినిమా కి అశ్వథ్థామ అనే ఎందుకు పేరు పెట్టారు?. అంటే పురాణాలలో స్త్రీ కి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్లలో అశ్వథ్థాముడు ఒకడు.
అశ్వథ్థామ అనే ఈ పేరు కి మహాభారతం లో, కృష్ణుడు, పాండవులు, కౌరవులు కి సమానమైన ప్రాధాన్యత ఉంది. మహాభారతం కి సంబంధించిన, సినిమా, సీరియల్ చూసిన ఎవరికైనా, "అశ్వథ్థామ హతః కుంజరః" అనే వాక్యం బాగా వినుంటారు. కానీ, అశ్వథ్థామ ఈ ఒక్క వాక్యానికే కాదు. మహాభారతం లో జరిగిన ఎన్నో సంఘటనలకు సాక్షి గా, కర్తవ్యానికి కట్టుపడిన ఒక సైనికుడిగా చూడచ్చు అశ్వథ్థామ ని.
కౌరవులు, పాండవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వథ్థాముడు. మహాభారతం లో, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు, అక్కడున్న ఏ కురు పెద్దలు కానీ, భీష్ముడు, ద్రోణుడు లాంటి మహానుభావులు కానీ ఆ అన్యాయాన్ని ప్రశ్నించరు. కానీ అశ్వథ్థాముడు ప్రశ్నిస్తాడు, ప్రతిఘటిస్తాడు. "ఇది తప్పు కదా?" అని నిలదీస్తాడు. (గోపాల గోపాల సినిమాలో కూడా ఈ reference ఉంటుంది.)
కురుక్షేత్రం లో కూడా అశ్వథ్థాముడు కౌరవుల వైపే యుద్ధం చేస్తాడు. కురుక్షేత్రం అంతం అయ్యేసరికి కౌరవుల వైపు మిగిలున్న అతి కొద్దీ మందిలో అశ్వథ్థాముడు ఒకరు. తన దగ్గరున్న నారాయణ అస్త్రం తో పాండవుల సైన్యాన్ని చాలా వరకు హతమార్చేది అశ్వథ్థాముడే. కానీ, తప్పు జరిగినప్పుడు తన వాళ్ళ వైపు తప్పున్న దాన్ని తప్పని ఖండించాడు అశ్వథ్థాముడు.
ఇప్పుడు ఉన్న సమాజం లో, యుద్ధం చేసే వాడు ఎంత ముఖ్యమో, ప్రశ్నించేవాడు అంతే ముఖ్యం. అలా ప్రశ్నించే ఒక బాధ్యత కల, ప్రతి పౌరుడు అశ్వథ్థాముడే.
మహాభారతం అశ్వథ్థాముడి పాత్ర ఎన్నో రాజ్యానికి కట్టుబడి పాండవుల వైపు యుద్ధం చేస్తాడు కానీ, ఈ సినిమాలో అశ్వథ్థామ అనే పాత్ర అన్వయించిన వ్యక్తిత్వం, ఆ పాత్ర నుండి మనం నేర్చుకోవాల్సినది ఒకటే "అన్యాయాన్ని ప్రశ్నించడం" ఆ ప్రశ్న కి జావాబు మన వంతు ప్రయత్నం మనం చేయడం. కృష్ణుడిలా లీలలు చేయలేకపోవచ్చు. అర్జునిడిలా యుద్ధం చేయలేకపోవచ్చు. అశ్వథ్థాముడిలా మన వంతు ప్రశ్నిద్దాం, ప్రతిగట్టిద్దాం, ప్రయత్నిద్దాం.